ప్రముఖ నటుడు రజనీకాంత్‌కు ‘ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డు’ లభించింది.
ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేవకర్ నవంబర్ 2న ప్రకటించారు. 50వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) 2019 అవార్డుల కార్యక్రమంలో రజనీకాంత్‌కు గోల్డెన్ జూబ్లీ అవార్డును ప్రదానం చేయనున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ సినిమాకు చేసిన విశేష కృషికి గుర్తింపుగా రజనీకాంత్‌కు ఈ అవార్డు దక్కింది. మరోవైపు విదేశీ నటి కేటగిరీలో ఫ్రెంచ్ నటి ఇసాబెల్లె హప్పెర్ట్‌కు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రదానం చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
2019, నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో గోల్డెన్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డుల కార్యక్రమం జరగనుంది. ఈ చలన చిత్రోత్సవంలో వివిధ దేశాలకు చెందిన 250 సినిమాలను ప్రదర్శిస్తారు.
2019, నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో గోల్డెన్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డుల కార్యక్రమం జరగనుంది. ఈ చలన చిత్రోత్సవంలో వివిధ దేశాలకు చెందిన 250 సినిమాలను ప్రదర్శిస్తారు.
No comments:
Post a Comment