ఒలింపిక్స్ టెస్ట్ ఈవెంట్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు శివ థాపా, పూజా రాణి బంగారు పతకాలు సాధించారు.
జపాన్ రాజధాని టోక్యోలో అక్టోబర్ 31న జరిగిన పురుషుల 63 కేజీల కేటగిరీ ఫైనల్లో నాలుగు సార్లు ఆసియా చాంపియన్ అయిన శివ 5-0తో ఆసియా కాంస్య విజేత సనతలి టోల్తయెవ్ (కజకిస్తాన్)పై విజయం సాధించాడు. మహిళల 75 కేజీల కేటగిరీ ఫైనల్లో ఆసియా క్రీడల కాంస్య విజేత పూజా రాణి 4-1తో ఆస్ట్రేలియాకు చెందిన కై ట్లిన్ పార్కర్‌పై గెలుపొందింది.
మరో భారత బాక్సర్ ఆశిష్ పురుషుల 69 కేజీల కేటగిరీ ఫైనల్లో 1-4తో సెవొన్ ఒకజవా (జపాన్) చేతిలో ఓడి రజతం దక్కించుకున్నాడు. ఈ టెస్టు ఈవెంట్‌లో నిఖత్ జరీన్ (51 కేజీలు), సిమ్రన్‌జీత్ కౌర్ (60 కేజీలు), సుమిత్ సాంగ్వాన్ (91 కేజీలు), వహ్లిమ్‌పుయా (75 కేజీలు) కాంస్యాలు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ మొత్తం 7(2 సర్ణ+ 1 రజత+ 4 కాంస్యం) పతకాలతో టోర్నీని ముగించినట్లయింది.

No comments:
Post a Comment