వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన, ప్రజలకు విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తించి ప్రోత్సహించడం లక్ష్యంగా ‘వైఎస్సార్ లైఫ్‌టైమ్ అవార్డు’లను ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.

వైఎస్సార్ లైఫ్‌టైమ్ అవార్డులు-విధి విధానాలు
- 2020 సంవత్సరం నుంచి ప్రతియేటా ఈ అవార్డులు ఇస్తారు.
- ఏడాదికి వంద అవార్డులు మించకుండా ఇస్తారు.
- ప్రతియేటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న, గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఈ పురస్కారాలను ముఖ్యమంత్రి ప్రదానం చేస్తారు.
- సోషల్ వర్క్, ప్రజావ్యవహారాలు, సైన్స్, ఇంజినీరింగ్, వ్యాపార వాణిజ్య రంగాలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెద్య రంగం, కళలు, సాహిత్యం, విద్య, ప్రజాసేవ, క్రీడారంగంతోపాటు సంస్కృతి, మానవ హక్కులు, వన్యప్రాణుల పరిరక్షణ తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు.
కమిటీ ద్వారా ఎంపికవైఎస్సార్ లైఫ్‌టైమ్ పురస్కారాల కోసం వచ్చిన దరఖాస్తులను సెలక్షన్ కమిటీ పరిశీస్తుంది. ఈ కమిటీని ఏటా ముఖ్యమంత్రి నియమిస్తారు. ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) అధ్యక్షతన గల ఈ కమిటీలో ముఖ్యమంత్రి సిఫార్సు చేసిన మూడు శాఖల కార్యదర్శులు సభ్యులుగానూ, సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) మధ్య స్థాయి అధికారి కన్వీనరుగాను ఉంటారు. అవార్డుల బహూకరణకు రెండు నెలల ముందు ఈ కమిటీ సిఫార్సులు స్వీకరిస్తుంది. వచ్చిన నామినేషన్లను ఈ కమిటీ పరిశీలించి ఎవరెవరికి అవార్డులు ఇవ్వాలో జాబితా తయారుచేసి ముఖ్యమంత్రికి సిఫార్సు చేస్తుంది. ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం.
No comments:
Post a Comment