ప్రపంచ ప్రభావిత రచయితల్లో భారతీయులు

ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఇంగ్లిష్ నవలలు రాసిన ‘మొదటి 100 మంది జాబితా’లో ప్రముఖ భారతీయ రచయితలు ఆర్‌కే నారాయణ్, అరుంధతి రాయ్, సల్మాన్ రష్దీ, విక్రమ్ సేత్, వీఎస్ నైపాల్‌లకు చోటు లభించింది.
Current Affairsఆంగ్లంలో తొలి నవలగా భావించే ‘రాబిన్సన్ క్రూసో ’ప్రచురితమై 300 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీబీసీ సంస్థ ఈ జాబితాను రూపొందించింది. లండన్‌లో నవంబర్ 7న మొదలైన బీబీసీ సాహితీ ఉత్సవంలో భాగంగా ఈ జాబితాను ప్రకటించారు.

మొదటి 100 మంది జాబితాలో అరుంధతి రాయ్ రాసిన ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్‌‌స’పుస్తకం ఐడెంటిటీ కేటగిరీలోను, ఆర్‌కే నారాయణ్ ‘స్వామి అండ్ ఫ్రెండ్‌‌స’కమింగ్ ఆఫ్ ఏజ్ సెక్షన్‌లో, సల్మాన్ రష్దీ రాసిన ‘ది మూర్స్ లాస్ట్ సై’ రూల్ బ్రేకర్స్ విభాగంలో ఎంపికయ్యాయి. విక్రమ్ సేథ్ రాసిన నవల ‘ఎ స్యూటబుల్ బోయ్’ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్‌షిప్ కేటగిరీ, వీఎస్ నైపాల్ రచించిన ‘ఎ హౌస్ ఆఫ్ మిస్టర్ బిశ్వాస్’కు క్లాస్ అండ్ సొసైటీ విభాగంలో చోటు దక్కింది.

No comments:

Post a Comment