ఒకటవ తరగతి నుంచి ఇంటర్ వరకు పేద విద్యార్థులను పాఠశాల, కళాశాలలకు పంపే తల్లులకు ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని వర్తింప చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.
అక్టోబర్ 30న సచివాలయంలోముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం
మంత్రివర్గ కీలక నిర్ణయాలు
మంత్రివర్గ కీలక నిర్ణయాలు
- వివిధ రంగాల ద్వారా ప్రజా సేవ అందించిన వారికి, ప్రతిభావంతులకు వైఎస్సార్ లైఫ్ టైమ్ అవార్డులను అందించేందుకు ఆమోదం. ఏటా జనవరి 26న 50 మందికి, ఆగస్టు 15వ తేదీన 50 మంది చొప్పున ప్రతి సంవత్సరం 100 మందికి అవార్డులిస్తారు.
- ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా నవంబర్ 21న మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించే వైఎస్సార్ మత్స్యకార నేస్తం అమలుకు ఆమోదం.
- 9 జిల్లాల్లో 46 నియోజకవర్గాల్లో ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు.
- కార్పొరేట్ రెస్పాన్స్ బులిటీ కింద కనెక్ట్ టు ఆంధ్రా పేరిట సంస్థ ఏర్పాటు.
- కృష్ణా-గోదావరి డెల్టా కాల్వల శుద్ధికి ప్రత్యేక మిషన్ ఏర్పాటు.
- కంకర నుంచి రోబో శ్యాండ్ (ఇసుక) తయారు చేసే స్టోన్ క్రషర్స్ యూనిట్లను కొత్త యంత్రాలతో అప్‌గ్రేడ్ చేసుకునేవారికి రూ.50 లక్షల నుంచి రూ.1.50 కోట్ల వరకూ పావలా వడ్డీ కింద రుణాలివ్వడం.
- అభ్యంతరం లేని ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో ఉన్న అక్రమ ఇళ్ల క్రమబద్ధీకరణకు ఆమోదం. 300 చదరపు గజాల వరకూ క్రమబద్ధీకరణ చేస్తారు.
- విశాఖపట్నం బీచ్‌రోడ్డులో లులూ సంస్థకు కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం కోసం గత ప్రభుత్వం ఇచ్చిన అత్యంత విలువైన 13.83 ఎకరాల కేటాయింపు ఒప్పందం రద్దు.
- కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో వీబీసీ ఫెర్టిలైజర్స్‌కు గత టీడీపీ ప్రభుత్వం హయాంలో 498.93 ఎకరాల కేటాయింపును రద్దు.
- అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్ లిమిటెడ్ పరస్పర అంగీకారంతో అమరావతి డెవలప్‌మెంట్ పార్టనర్స్ (ఏడీపీ) లిమిటెడ్ మూసివేత.
- పౌష్టికాహార లోపం, రక్తహీనత అధికంగా ఉన్న 8 జిల్లాల్లోని సబ్‌ప్లాన్ ఏరియాల్లో 77 గిరిజన మండలాల్లో గర్భవతులు, బాలింతలు, ఆరేళ్లలోపు పిల్లలకు అదనపు పౌష్టికాహారం అందించేందుకు ఆమోదం.
- నవంబర్ 7న అగ్రిగోల్డ్ బాధితులకు రూ.10 వేల లోపు డిపాజిట్లు చెల్లింపు. 3,69,655 మందికి సుమారు రూ.264 కోట్లు చెల్లింపు.
- హజ్, జెరూసలేం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపుకు ఆమోదం. వార్షికాదాయం రూ.మూడు లక్షలలోపు ఉన్నవారికి ఇస్తున్న సహాయాన్ని రూ.40 వేల నుంచి రూ.60 వేలకు.. వార్షికాదాయం రూ.మూడు లక్షలకు పైబడి ఉన్నవారికి ఇస్తున్న సహాయాన్ని రూ.20 వేల నుంచి రూ.30 వేలకు పెంచుతారు.
- ఆంధ్రప్రదేశ్ మాల సంక్షేమ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ మాదిగ సంక్షేమ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ రెల్లి, ఇతర కులాల సంక్షేమ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకు ఆమోదం.
No comments:
Post a Comment