మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్‌కు కేబినెట్ ఆమోదం

మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా రూపొందించిన ‘మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది.
Current Affairs

అక్టోబర్ 30న సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌తో (ఎన్‌బీసీసీ) కుదుర్చుకోనున్న ఒప్పందానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా చాలా ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను విక్రయించి, ఆ డబ్బును ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలైన నవరత్నాలు, నాడు-నేడు మౌలిక సదుపాయాల కల్పన తదితర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌బీసీసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. మరోవైపు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద మరిన్ని కార్యక్రమాల కోసం ‘కనెక్ట్ టు ఆంధ్రా’ పేరిట లాభాపేక్ష లేని సంస్థను ప్రారంభించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చైర్మన్‌గా ‘కనెక్ట్ టు ఆంధ్రా’ సంస్థ పనిచేస్తుంది.

No comments:

Post a Comment