చైనాలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. చైనాకు చెందిన మూడు దిగ్గజ టెల్కోలు అక్టోబర్ 31న 5జీ సర్వీసులు ప్రారంభించాయి.
చైనా మొబైల్, చైనా టెలికం, చైనా యూనికామ్ సంస్థలు... బీజింగ్, షాంఘై తదితర ముఖ్య పట్టణాల్లో 5జీ సర్వీసులను ప్రారంభించినట్లు వెల్లడించాయి. ప్రస్తుతం ఉన్న 4జీ నెట్‌వర్క్‌లతో పోలిస్తే 100 రెట్లు వేగంగా ఉండే 5జీ సేవలతో సెకన్ల వ్యవధిలోనే పూర్తి నిడివి సినిమాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డ్రైవర్హ్రిత కార్లు, ఫ్యాక్టరీల్లో ఆటోమేషన్ వంటి 5జీ సేవలు ఉపయోగపడతాయి.
2020 ఏడాదికి 17 కోట్ల మంది యూజర్లతో 5జీ వినియోగంలో చైనా అగ్రస్థానంలో, సుమారు 75,000 మంది యూజర్లతో దక్షిణ కొరియా రెండో స్థానంలో, 10,000 మంది వినియోగదారులతో అమెరికా మూడో స్థానంలో ఉండొచ్చని అంచనా.
2020 ఏడాదికి 17 కోట్ల మంది యూజర్లతో 5జీ వినియోగంలో చైనా అగ్రస్థానంలో, సుమారు 75,000 మంది యూజర్లతో దక్షిణ కొరియా రెండో స్థానంలో, 10,000 మంది వినియోగదారులతో అమెరికా మూడో స్థానంలో ఉండొచ్చని అంచనా.
No comments:
Post a Comment