బ్యాంకింగ్ రంగంలో కొలువంటే... యువతకు యమ క్రేజ్. బ్యాంక్ జాబ్ అనగానే చాలామంది క్లర్క్, పీవో పోస్టులే అనుకుంటారు! కాని ఇటీవల కాలంలో బ్యాంకులు మారుతున్న అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక విద్యార్హతలు, నైపుణ్యాలున్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.
ఆ క్రమంలో భారీగా స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులను భర్తీ చేస్తున్నాయి. తాజాగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్)... ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 1163పోస్టుల వివరాలు: ఐటీ ఆఫీసర్ -76, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్-670, రాజ్‌భాష అధికారి-27, లా ఆఫీసర్-60, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్-20, మార్కెటింగ్ ఆఫీసర్-310.
కొలువులిచ్చే బ్యాంకులు: అలహాబాద్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఒవర్‌సీస్ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్, సింధ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
అర్హత: ఆయా పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.
వయసు: 20-30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
ప్రిలిమినరీ పరీక్ష:

- లా ఆఫీసర్, రాజ్‌భాష అధికారి పోస్టులకు నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షలో.. ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన జనరల్ అవేర్‌నెస్‌పై ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు-25 మార్కులకు, రీజనింగ్ 50 ప్రశ్నలు-50 మార్కులకు, జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులకు మొత్తంగా 125 ప్రశ్నలు-150 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 120 నిమిషాలు. పరీక్ష ఇంగ్లిష్/హిందీ మాధ్యమంలో ఉంటుంది.
- ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జరిపే ప్రిలిమినరీ పరీక్షలో... ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అంశాలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు-25 మార్కులకు, రీజనింగ్ 50 ప్రశ్నలు-50 మార్కులకు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-50 మార్కులకు మొత్తంగా 125 ప్రశ్నలు-150 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 120 నిమిషాలు. పరీక్ష ఇంగ్లిష్/హిందీ మాధ్యమంలో ఉంటుంది.
- ప్రిలిమినరీ పరీక్షలో నిర్దేశిత కటాఫ్ మార్కులను సాధించిన అభ్యర్థులను మెయిన్‌కు షార్ట్‌లిస్ట్ చేస్తారు.
- లా ఆఫీసర్, ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టుల్లో ఎంపికకు నిర్వహించే మెయిన్ పరీక్షలో.... ప్రొఫెషనల్ నాలెడ్జ్ పై 60 ప్రశ్నలు- 60 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 45 నిమిషాలు.
- రాజ్‌భాష అధికారి పోస్టులకు నిర్వహించే మెయిన్ పరీక్షలో.. ప్రొఫెషనల్ నాలెడ్జ్(ఆబ్జెక్టివ్) పై 45 ప్రశ్నలు ఉంటాయి. దీనికి కేటాయించిన సమయం 30 నిమిషాలు. దీంతోపాటు ప్రొఫెషనల్ నాలెడ్జ్‌పై డిస్క్రిప్టివ్ తరహాలో రెండు ప్రశ్నలు అడుగుతారు. డిస్క్రిప్టివ్ పరీక్షకు కేటాయించిన సమయం 30 నిమిషాలు. ఆబ్జెక్టివ్,డిస్క్రిప్టివ్ రెండింటికీ కలిపి 60 మార్కులు కేటాయించారు.
No comments:
Post a Comment