దిగ్గజ సంస్థ గూగుల్‌తో నేషనల్ హెల్త్ అథారిటీ(ఎన్‌హెచ్‌ఏ) అక్టోబర్ 4న ఒక ఒప్పందం కుదుర్చకుంది.

ఈ ఒప్పందం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకానికి ప్రాచుర్యం కల్పించడంతోపాటు దీన్ని మరింత బలోపేతం చేయడానికి గూగుల్ సహకరించనుంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద వచ్చే లక్షలాది దరఖాస్తులను వేగవంతంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పరిష్కరించడానికి తోడ్పడనుంది.
No comments:
Post a Comment