ఏపీ హైకోర్టు తొలి సీజేగా జస్టిస్ జేకే మహేశ్వరి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి నియమితులయ్యారు.
Current Affairsఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అక్టోబర్ 3న ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీజేగా జస్టిస్ మహేశ్వరి నియామకం అమల్లోకి రానుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటైన నాటి (జనవరి 1, 2019) నుంచి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే)గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయి సీజే నియామకంతో జస్టిస్ ప్రవీణ్‌కుమార్ సీనియర్ న్యాయమూర్తిగా రెండో స్థానంలో కొనసాగుతారు.

జస్టిస్ మహేశ్వరి నేపథ్యమిదీ..ఇప్పటివరకు మధ్యప్రదేశ్ హైకోర్టులో నంబర్ టూ స్థానంలో ఉన్న జస్టిస్ మహేశ్వరి 1961 జూన్ 29న జన్మించారు. 1985 నవంబర్ 22న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించి సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసుల్లో పట్టు సాధించారు. 2005 నవంబర్ 25న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2008లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు.

No comments:

Post a Comment