ఆటోలు, క్యాబ్‌లు, కార్లు నడుపుకొని జీవించే పేద వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఏటా రూ.10 వేలు చొప్పున అందించే ‘వైఎస్సార్ వాహనమిత్ర’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబర్ 4న ప్రారంభించారు.

మరోవైపు ఏలూరులో ప్రభుత్వ వైద్య కళాశాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అలాగే 2019, అక్టోబర్ 10 నుంచి ప్రారంభమయ్యే వైఎస్సార్ కంటి వెలుగు పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు.
No comments:
Post a Comment