ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్‌గా ‘ట్రినిటీ - ట్రఫుల్స్ ఎక్స్‌ట్రార్డినేర్’ గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించింది.
ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ కంపెనీ ‘ఐటీసీ’కి చెందిన ఫాబెల్లె బ్రాండ్ తయారు చేసిన ఈ చాక్లెట్ ఖరీదును కేజీ రూ. 4.3 లక్షలుగా నిర్ణయించారు. ఇంతటి ఖరీదైన చాక్లెట్ మరొకటి లేనందున గిన్నిస్ బుక్‌లో ఈ లిమిటెడ్ ఎడిషన్ స్థానం సంపాదించినట్లు ఐటీసీ అక్టోబర్ 22న వెల్లడించింది. ఫ్రాన్స్ కు చెందిన చాక్లెట్ తయారీ నిపుణుడు ఫిలిప్ కొంటిచినీ, ఫాబెల్లెలోని భారత నిపుణులు సంయుక్తంగా ఈ చాక్లెట్లకు రూపకల్పన చేశారని తెలిపింది. చెక్క పెట్టెలో ఈ చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు పేర్కొంది. ఒక్కో చెక్క పెట్టెలో 15 ట్రఫుల్స్ ఉండగా.. సగటు బరువు దాదాపు 15 గ్రాములు ఉన్నట్లు వివరించింది.
No comments:
Post a Comment