1. కింది వాటిలో సరైనది?
i) గౌతమి బాలశ్రీ తన మనుమడైన వాసిష్ఠిపుత్ర పులోమావి 19వ రాజ్య సంవత్సరంలో ‘నాసిక్ ప్రశసి’్త వేయించింది ii) గౌతమి బాలశ్రీ పుత్రుడు గౌతమిపుత్ర శాతకర్ణి యుద్ధవిజయాలు, సామ్రాజ్య విస్తీర్ణం, వ్యక్తిత్వం గురించి నాసిక్ ప్రశస్తి తెలుపుతుంది iii) గౌతమిపుత్ర శాతకర్ణి ‘నాసిక్, కార్లే’ శాసనాలు పోయినరాజ్య భాగాలను తిరిగిపొందే ప్రయత్నాల గురించి తెలుపుతుంది1) i,iii 2) ii,iii 3) iii 4) i,ii,iii
2. ప్రశస్తి శాసనాల్లో కనిపించే వివరాలు ?
i) రాజు పేరు, వంశావళి, బాల్య జీవిత విశేషాలు ii) సైనిక, రాజకీయ, పరిపాలనాకార్యాలు, ఇరుగు పొరుగు రాజ్యాల పేర్లు iii) రాజకీయ భాగాలు, రాజు వ్యక్తిగత వివేషాలు iv) దాన, కళాపిపాస v) పురాణదేవతలతో సామ్యాలు, పోలికలు1) i,iv,v 2) i,iii 3) i,iii,v 4) పైవన్నీ
3. గౌతమిపుత్ర శాతకర్ణి నాణాలు లభించిన ప్రదేశాలు ?
i) జోగకతంబి ii) వాటిగాం iii) ఆంధ్రప్రదేశ్ iv) కేరళ 1) i,ii 2) i,ii,iv 3) i,ii,iii 4) i,ii,iii,iv
4. నాగార్జునకొండ వద్ద లభించిన నాణాలు ముద్రించే మూస అధారంగా ధాన్యకటక - నాగార్జునకొండ ప్రాంతాల్లో ఏ శాతవాహన రాజుకు సంబంధించిన టంకశాల ఉండేది ?
1) శాతకర్ణి - I 2) హాలుడు 3) గౌతమిపుత్ర శాతకర్ణి 4) 1,2,3
5.గౌతమిపుత్ర శాతకర్ణి సింహాసనం అధిష్టించేనాటికి సమకాలికులు, వారి చర్యలు ?
i) కుషాణులు - ఇండోగంగా మైదాన ప్రాంతంలో అభివృద్ధి పథం సాగించారు ii) క్షహరాటులు - పశ్చిమ, దక్కన్లపై ఆధిపత్యం పొందారు iii) శకులు, యవనులు, పహ్లవులు హిందూమతాన్ని స్వీకరించి భారత్ లో స్థిరపడి దక్కన్లో శాంతి సామరస్యాలకు అటంకం కలిగించేవారు iv) ఇక్ష్వాకులు - నాగార్జునకొండ ప్రాంతంలో స్వతంత్రులయ్యారు1) i,iii 2) ii,iii,iv 3) i,ii,iv 4) i,ii,iii
6. i) గౌతమిపుత్ర శాతకర్ణి సామ్రాజ్యంలో ఆంధ్ర, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ర్ట, మధ్యభారత్, ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు ఉన్నాయి
ii) గౌతమిపుత్ర శాతకర్ణి సామ్రాజ్యం తూర్పు రాజస్థాన్ నుంచి తమిళనాడులోని కడలూరు వరకు, రిషికుల్య (ఒరిస్సా) నుంచి వైజయంతి (కర్ణాటక) వరకు విస్తరించింది పై వ్యాఖ్యల (నాసిక్ ప్రశస్తి) ఆధారంగా గౌతమిపుత్ర శాతకర్ణి సామ్రాజ్య వైశాల్యాన్ని కింది విధంగా చెప్పవచ్చు ?1) సింధు నుంచి కావేరి వరకు 2) కాశీర్ నుంచి కన్యాకుమారి వరకు 3) గంగా మైదానం నుంచి కృష్ణానది మైదానం వరకు 4) మహానది నుంచి కృష్ణా - గోదావరి మైదానం వరకు
7. కింది వాటిలో సరికానిది ?
i) గౌతమిపుత్ర శాతకర్ణి రాజులకు రాజని నాసిక్ ప్రశస్తి వర్ణించింది ii) దక్షిణ భారత చరిత్రలో అప్పటికే రాజులకు రాజు అనే బిరుదు ఖారవేలునికి ఉంది iii) నాసిక్ ప్రశస్తి గౌతమిపుత్ర శాతకర్ణిని ‘‘బెణ్ణాకటక స్వామి’’గా పేర్కొంది iv) బెణ్ణా అనగా కృష్ణానది. దీని ఒడ్డునున్న ధాన్యకటకమే ‘బెణ్ణాకటకం’1) ii,iv 2) i,iii 3) ii 4) i,iii,iv
8. గౌతమిపుత్ర శాతకర్ణి ముఖ్య రాజధాని చిచిచిచి నుంచి పాలించగా, కుమారుడైన వాసిష్ఠిపుత్ర పులోమావి ఉపరాజధాని చిచిచిచి నుంచి సామ్రాజ్య పశ్చిమ భాగాన్ని శాసించాడు.1) ప్రతిష్ఠానం - ధాన్యకటకం
2) ఉజ్జయిని - కోటిలింగాల 3) ధాన్యకటకం - ప్రతిష్ఠానం 4) మహిష్మతి - ధాన్యకటకం
9. క్షహరాతులతోబాటు గౌతమిపుత్ర శాతకర్ణికి లొంగిపోయిన ఇతర విదేశీ రాజవంశాలు ?
i) శక ii) యవన (గ్రీకు) iii) పహ్లవ iv) కుషాణ1) i,iv 2) ii,iii,iv 3) i,ii,iii 4) పైవన్నీ
10. గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదులు ?
i) క్షహరాట వంశ నిరవశేషకర ii) త్రిసముద్రలోయ పీతవాహన iii) ఆగమాన నిలయ iv) క్షత్రియ దర్పమాన దర్పితుడు v) శాతవాహన కుల యశోప్రతిష్ఠాపనకర vi) కులవిపులసిరికర1) i,iv 2) ii,iii,iv 3) i,ii,iii 4) పైవన్నీ
11. జతపరచండి.
గౌతమిపుత్ర శాతకర్ణి జయించిన ప్రాంతం i) అస్సక (అశ్మక) ii) సురువ (పెరిప్లస్, టాలమి చెప్పిన సిరాస్తిక్) iii) కుకుర iv) అపరంత (పెరిప్లస్, టాలమీ చెప్పిన అక్లక్) v) అంసిక (రిషిక) నెలకొన్న ప్రదేశం/రాజధాని a) దక్షిణ కథియవార్ b) గుజరాత్ ఉత్తరభాగం, తూర్పు రాజస్థాన్ c) బోధన్ (పౌదన్య/పోతన) d) ఉత్తరకొంకణ్, సోపర, నాసిక్ e) కృష్ణా, గోదావరి నదుల మధ్య ప్రాంతం1) i-a,ii-b,iii-c,iv-d,v-e 2) i-b,ii-c,iii-d,iv-a,v-e 3) i-c,ii-a,iii-b,iv-d,v-e 4) i-c,ii-a,iii-d,iv-b,v-e
12. గౌతమిపుత్ర శాతకర్ణి జయించిన ప్రాంతాలు, అవి నెలకొన్న ప్రదేశాల సరైన జత ?
i) అనుప (మాళ్వ దక్షిణ ప్రాంతం) - మాహిష్మతి ii) విదర్భ (బీరార్) - గోదావరి, తపతిల మధ్య భాగం iii) ఆకర (మాళ్వ తూర్పు భాగం) - విదిశ iv) ములక - పైఠాన్ v) అవంతి (మాళ్వ పశ్చిమ ప్రాంతం) - ఉజ్జయిని vi) సురాష్ర్ట - భరుకచ్చం (బ్రోచ్)1) i,iii,v 2) i,ii,iii,vi 3) ii,iii,iv,v 4) i,ii,iii,iv,v,vi
13. నాసిక్ ప్రశస్తి ప్రకారం గౌతమిపుత్ర శాతకర్ణి సామ్రాజ్యంలోని పర్వత పంక్తులు ?
i) అచీవత్ - సాత్పుర పర్వతాలు ii) పారియాత్ర (పరిచాత) - ఆరావళి పర్వతాలు iii) సిరిఠణ - శ్రీశైల పర్వతాలు iv) చకోర - తూర్పు కనుమలు v) సెటగిరి - నాగార్జునకొండ1) i,iii,v 2) ii,iv,v 3) i,ii,iii,iv 4) పైవన్నీ
14. గౌతమిపుత్ర శాతకర్ణి శత్రువులైన నహపాన, ఉషవదత్తులకు సహాయం చేసిన మధురను ఏలిన ‘శక’ వంశ రాజులు ?
i) హగన ii) హగమష iii) శివదత్త iv) సుశ ర్మ1) i,iv 2) ii,iii,iv 3) i,ii,iii 4) పైవన్నీ
15. గౌత మిపుత్ర శాతకర్ణి నాసిక్, కార్లీ శాసనాలు తెలియజేసే అంశాలు ?
i) తన 18వ పరిపాలనకాలంలో (క్రీ.శ. 80) పోగొట్టుకున్న రాజ్యభాగాల ఆక్రమణకు చేసిన ప్రయత్నాలు ii) ఇతని దానాలు గోవర్ధనంలోని విజయస్కంధావారం నుంచి జరిగినవి iii) వైజయంతి నుంచి వచ్చిన సేనాదళాలు అద్భుత సాహసాలు ప్రదర్శించాయి1) i,iii 2) ii 3) i,ii 4) i,ii,iii
16. తనకు ఎంతబలం ఉన్నప్పటికీ నహపాన రాజును ఓడించడం కోసం గౌతమిపుత్ర శాతకర్ణి కొన్ని జిత్తులు అవలంభించి, ఒక మంత్రిని పంపి, నహపాలుడితో ధానధర్మాలు చేయించి ఖజానా ఖాళీ చేయించాడు. తర్వాత నహపాలున్ని ఓడించి చంపాడని చెబుతున్న గ్రంథం ?1) పద్మపురాణం
2) ఆవశ్యక సూత్రనిరుక్తి 3) చంద్రికాపరిణయం 4) తౌసక్నామా
17. ‘క్షహరాతవంశ నిరవశేషకర’ అని నాసిక్ ప్రశస్తి గౌతమిపుత్ర శాతకర్ణి విజయాన్ని కీర్తించింది. నహపాణునిపై గౌతమిపుత్ర శాతకర్ణి విజయాన్ని సూచించే మరికొన్ని ముఖ్యాధారాలేమిటి ?
i) జున్నార్ శాసనం ii) జోగల్తంబిలో నహపాణుని నాణాలపై ఇతని బొమ్మ తిరిగి ముద్రించిన నాణాలు iii) కొడవలి శాసనం iv) వానేఘాట్ శాసనం1) i,iii,iv 2) ii 3) ii,iii 4) iv
18. గౌతమిపుత్ర శాతకర్ణి క్షత్రపరాజైన నహపాణున్ని ఓడించి స్వాధీనం చేసుకున్న ప్రాంతాలేవి ?
i) గుజరాత్ ii) మాళ్వా iii) ఉత్తర మహారాష్ట్ర iv) ధాన్యకటకం v) బెంగాల్ vi) ఒరిస్సా1) i,iv,vi 2) ii,iii,v 3) i,ii,iv,v 4) i,ii,iii
19. కన్నడ దేశంలోని ఏ ప్రసిద్ధ రేవుపట్టణాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి ఆక్రమించాడు ?1) అరికమేడు
2) సొపార 3) వైజయంతి 4) కళ్యాణ్
20. జతపరచండి.
1. నహపణ a) కార్లే శాసనం 2. ఉషవదత్త b) జున్నార్ శాసనం 3. ఆయమ c) నాసిక్ శాసనం1) ------1-c,2-b,3---------a 2) 1-b,2-c,3-a-------- 3) 1-c,2-a,3---------b 4) 1-a,2-b,3-c--------
21. కింది పుణ్యక్షేత్రాలలో ఉషవదత్త దానం చేయనిది ?
i) సోపార, బ్రోచ్ ii) రామతీర్థ, గోవర్ధన iii) దశపుర, వైభస్ iv) నానామ్గొల v) అమరావతి vi) తంజావూరు1) i,ii 2) iv,v,vi 3) i,iii,vi 4) v,vi
22. కింది వాటిలో సరైనది ?
i) నాసిక్‌లో బౌద్దసన్యాసులకు ఉషవదత్త ఆగ్రహారం దానం చేశాడు ii) గౌతమిపుత్ర శాతకర్ణి ఉషవదత్తుని నాసిక్ అగ్రహార దానాన్ని వెనిక్కి తీసుకున్నాడు1) i 2) i,ii 3) ii 4) ఏదీకాదు
23. గౌతమిపుత్ర శాతకర్ణి యవనుల కిచ్చిన కానుకల గురించి తెలిపే శాసనాలు ?1) నాసిక్
2) కార్లే 3) జున్నార్ 4) పైవన్నీ
24. నిశ్చితవాక్యం (A): గౌతమిపుత్ర శాతకర్ణి చివరిరోజుల్లో గెలిచిన చాలా ప్రాంతాలను శకులు ఆక్రమించారు
హేతువు (R): గౌతమిపుత్ర శాతకర్ణి ఉత్తర రాష్ట్రాలను (Provinces) కోల్పోగా, అవి శకులపరమైనట్లు రుద్రదాముని జునాఘడ్ రాతి శాసనం తెలుపుతుంది. 1) A సరైనది, R సరికానిది 2) A, Rలు సరికానివి 3) A సరైనది, R సరికానిది 4) A, Rలు సరైనవి
25. గౌతమిపుత్ర శాతకర్ణి తన కుమారుడైన వాసిష్ఠిపుత్ర శాతకర్ణికి శక రుద్రదామన్ కుమార్తె రుద్రదమనికకు జరిగిన దౌత్యసంబంధ వివాహ ఫలితం ?1) శక శాతవాహన యుద్ధాలు అంతం
2) శక శాతవాహనుల మధ్య ఆర్ధిక సంబంధాల వృద్ధి 3) శక శాతవాహనుల ఆధిపత్య పోరులో విరామం, శాంతి 4) శకులు, శాతవాహనులు కలిసి పోయారు
26. కింది వాటిలో సరైనది ?
i) రుద్రదాముడు సంస్కృత భాషాభిమాని ii) మొట్టమొదటి సుదీర్ఘమైన శాసనాన్ని గార్నార్ (జునాగఢ్) వద్ద సంస్కృతంలో వేయించాడు iii) భారతదేశంలో తొలి ప్రాకృత సుదీర్ఘ శాసనం అశోకునిది iv) మౌర్యుల కాలం నాటి సుదర్శన తటాకానికి రుద్రదాముడు మరమ్మత్తులు చేయించాడు1) i,ii 2) iii 3) i,ii,iv 4) పైవన్నీ
27. కింది రాజులను పాలనాక్రమం ఆధారంగా అమర్చండి ?
i) యజ్ఞశ్రీ శాతకర్ణి ii) వాసిష్ఠిపుత్ర శాతకర్ణి iii) వాసిష్ఠిపుత్ర పులోమావి1) i,ii,iii 2) iii,ii,i 3) ii,iii,i 4) i,iii,ii
28. వాసిష్ఠిపుత్ర పులోమావి శాసనాలు లభించిన ప్రదేశాలు ?
i) అమరావతి ii) ధరణికోట iii) నాసిక్ iv) కార్లే1) i,ii 2) i,ii,iii 3) iii,iv 4) i,ii,iii,iv
29. నాసిక్ ప్రశస్తి పేర్కొన్న దక్షిణాపథేశ్వరుడు ?1) యజ్ఞశ్రీ శాతకరి
2) హాలుడు 3) కుంభశాతకరి 4) వాసిష్ఠిపుత్ర పులోమావి
30. వాసిష్ఠిపుత్ర పులోమావికి సంబంధించి కింది వాటిలో సరైనది ?
i) శాతవాహన సామ్రాజ్యం అత్యున్నత దశ ii) దక్షిణంలో మద్రాస్ వరకు ఉన్న కోస్తా ప్రాంతాన్ని ఆక్రమించాడు iii) నాణాలపై ఓడగుర్తులున్నాయి iv) సముద్ర తీరప్రాంతాల్లో వలసలు v) నవనగర అనే పట్టణాన్ని నిర్మించాడు vi) అమరావతి స్తూపం ఇతని కాలంలో మరింత అభివృద్ధి చెందింది1) iii,v,vi 2) i,iv,v 3) i,ii,iii 4) పైవన్నీ
31. ఆంధ్రప్రాంతంలో శాతవాహనుల శాసనాల లభ్యం ఎవరి కాలం నుంచి మొదలైంది ?1) గౌతమిపుత్ర శాతకర్ణి
2) శాతకర్ణి - I 3) యజ్ఞశ్రీ శాతకర్ణి 4) వాసిష్ఠిపుత్ర పులోమావి
32. కింది వాటిలో సరైనది ?
i) వాసిష్ఠిపుత్ర పులోమావి (పైఠాన్), చాష్టన (ఉజ్జయిని)ల సమకాలితను టాలమీ పేర్కొన్నాడు ii) చాష్టనుని అంధౌశాసనం (క్రీ.శ. 130) ప్రకారం ‘సౌరాష్ట్రలోని కచ్, అనుప, అకర, అవంతి, కుకర భాగాలు’ చాష్టనుని ఆధీనంలో ఉన్నాయి. iii) వాసిష్ఠిపుత్ర పులోమావి తూర్పు మండల వ్యవహారాల్లో మునిగిఉన్న సమయంలో చాష్టన ఉత్తర వాయువ్య ప్రాంతాలను ఆక్రమించాడు1) i,ii 2) i,iii 3) ii,iii 4) i,ii,iii
33. తెలంగాణాలో శాతవాహన, చిముక, శాతకర్ణుల నాణాలు, తీరస్థ ఆంధ్రలో గౌతమిపుత్ర శాతకర్ణి నాణాలు లభించడాన్ని బట్టి వాసిష్ఠిపులోమావి _____వారసుడు.1) చిన్న సామ్రాజ్యానికి
2) భారతదేశ సామ్రాజ్యానికి 3) విస్తార సామ్రాజ్యానికి 4) తీరస్థ ప్రాంతానికి
34. క్షాత్రపులతో జరిగిన సంఘర్షణలో పరాజయం, కుర వంశస్థుల తిరుగుబాటు కారణంగా పశ్చిమ ప్రాంతాలపై ఆశ వదులుకొని సామ్రాజ్య మొదటిభాగాలపై వాసిష్ఠిపుత్ర శాతకర్ణి దృిష్టి పెట్టినట్టు తెలిపే గ్రంథాలు ?1) ధాన్యకటక శాసనం
2) ఆంధ్ర ప్రాంతంలో అసంఖ్యాకంగా లభించిన నాణాలు 3) నాగార్జునకొండలోని టంక శాల 4) 1,2
35. శాతవాహన చిహ్నాలకు భిన్నమైన రాజన్ బిరదుతో దనుర్భాణములు కలిగిన నాణాలపై ఉన్న కొల్హాపూర్ కురవంశస్థుల రాజుల పేర్లు ?
i) వాసిష్ఠీపుత్ర విలివాయకుర ii) మాఢరీపుత్ర శివలకుర iii) గౌతమిపుత్ర విలివాయకుర iv) వాసిష్ఠీపుత్ర కుంభకర్ణి1) i,ii 2) i,iii,iv 3) i,ii,iii 4) పైవన్నీ
36. i) కుషాణులు సాంచీ వరకు భూభాగం స్వాధీనం చేసుకున్నారు
ii) కర్ధమ క్షత్రపుడు, చష్టనుడు తూర్పు, పశ్బిమ మాళ్వాలను ఆక్రమించాడు iii) సౌరాష్ట్ర, గుజరాత్‌లలో చష్టనుని నాణాలు లభించాయి పై వాక్యాలాధారంగా వాసిష్ఠిపుత్ర పులోమావి పాలన చివరి దశలో ఏఏ ప్రాంతాలకు పరిమితమైంది ?1) దక్కన్ ఉత్తర ప్రాంతాలకు 2) దక్కన్ పశ్చిమ ప్రాంతాలకు 3) దక్కన్ తూర్పు ప్రాంతాలకు 4) దక్కన్ దక్షిణ ప్రాంతాలకు
37. వాసిష్ఠిపుత్ర శాతకర్ణి శకరుద్రదామక కుమార్తె రుద్రదమనిక శాసనకర్తను వివాహం చేసుకున్నట్టు తెలిపే శాసంనం ?1) నానాఘట్
2) నాసిక్ 3) కన్హేరి 4) అమరావతి
38. వాసిష్ఠిపుత్ర శాతకర్ణికి సంబంధించి కింది వాటిలో సరైనది ?
i) ఇతని నాణాలు కృష్ణ, గోదావరి జిల్లాల్లో లభించాయి ii) పశ్చిమ క్షాత్రపులననుకరిస్తూ నాణాలకు ఒకవైపు ప్రాకృతం, మరొకవైపు తమిళ భాషలు ఉన్నాయి iii) శకులతో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు iii) అపరాంత, ఉత్తర కొంకణ ప్రాంతాల పరిధిలో పూర్తి రాజ్యనియంత్రణ కలిగి ఉన్నాడు1) i,ii 2) iii 3) i,ii,iii 4) పైవన్నీ
39. ఏ శాతవాహన రాజు కాలంలో మత్స్యపురాణ సంకలనం జరిగినట్టు చరిత్రకారులు చెబుతున్నారు ?1) గౌతమీపుత్ర శాతకర్ణి
2) వాసిష్ఠిపుత్ర పులోమావి 3) యజ్ఞశ్రీ శాతకర్ణి 4) పులోమావి - III
40. యజ్ఞశ్రీ శాతకర్ణికి సంబంధించి కింది వాటిలో సరైనది ?
i) పురాణాల ప్రకారం ప్రముఖ ఆంధ్ర శాతవాహనుల్లో చివరివాడు ii) నాసిక్, కన్హేరి, చినగంజాంలలో శాసనాలు లభించాయి iii) ఆంధ్ర, మధ్రప్రదేశ్, బిరార్, కొంకణ, సౌరాష్ట్ర, మహారాష్ట్రలలో నాణాలు దొరికాయి (తూర్పు, పశ్చిమ ప్రావిన్సలు) iv) చినగంజాం శాసనం ప్రకారం యజ్ఞం చేసినట్టు తెలుస్తోంది 1) ii,iv 2) ii,iii,iv 3) i,iv 4) i,ii,iii,iv
41. నిశ్చిత వాక్యం (A): యజ్ఞశ్రీ శాతకర్ణి పశ్చిమ శకులననుకరించి తన నాణాల ముందు భాగం రాజుబొమ్మ, వెనుకభాగం ఉజ్జయిని, పర్వతం, సూర్య కిరణాలతో ముద్రించాడు
హేతువు (R): రాజు బొమ్మ, సూర్య కిరణాలు (Rayed sun), పర్వతాలతో ఉన్న నాణాలు పశ్చిమ శకుల నాణాల సాధారణ లక్షణం1) A, Rలు సరైనవి, R, Aకి సరైన వివరణ 2) A, Rలు సరైనవి, R, Aకి సరైన వివరణ కాదు 3) A సరైనది, R సరికానిది 4) A సరికానిది, R సరైనది
42. యజ్ఞశ్రీ శాతకర్ణి జారీ చేసిన నాణాలకు సంబంధించి సరైనది ?
i) సత్రప నాణాల అనుకరణతో కొత్తగా గెలిచిన పశ్చిమ జిల్లాల్లో పంపిణీ చేశాడు ii) సోపార వద్ద దొరికిన ఇతని వెండి నాణాం రుద్రదాముని వెండి నాణాన్ని పోలి ఉంది iii) మధ్యప్రదేశ్‌లోని చాందా జిల్లాలో పోటిన్ నాణెం లభించింది iv) కాంశ్య నాణాలు, లెడ్ నాణాలు తూర్పు ప్రావిన్సలలో లభించాయి 1) i,ii,iii 2) i,iii,iv 3) i,ii 4) పైవన్నీ
43. రెండు తెరచాప కొయ్యలు కలిగిన ఓడ గుర్తుతో, యజ్ఞశ్రీ శాతకర్ణి పేరుతో లభించిన నాణాలు దొరికిన ప్రదేశాలు ?
i) ఆంధ్రలోని కోస్తా జిల్లాలు ii) ఉత్తరప్రదేశ్ నదుల వద్ద iii) అస్సాం వద్ద iv) తమిళనాడు తీరం నుంచి కడలూరు వరకు1) i,ii 2) ii,iii,iv 3) iii,iv 4) i,iv
44.కింది వాటిలో సరైనది ?
i) యజ్ఞశ్రీ శాతకర్ణి పశ్చిమ ప్రాంతాలకోసం శక రుద్ర దామునిపై రెండుసార్లు దండెత్తాడు ii) శక రుద్రదాముడు శాతవాహనుల్లో చీలికలు తెచ్చాడు iii) రుద్రదాముడు యుద్ధాల్లో గెలిచి బంధువు కాబట్టి యజ్ఞశ్రీ శాతకర్ణిని విడిచి పెట్టాడు iv) వాసిష్ఠిపుత్ర శాతకర్ణి క్షాత్రపుల సామంతుడు v)యజ్ఞశ్రీ, రుద్రదామక యుద్ధాల తర్వాత ఆంధ్ర సాంమ్రాజ్యం ఆంధ్రకే పరిమితమైంది1) ii,iv,v 2) i,ii,iii 3) i,ii,iii,iv 4) పైవన్నీ
45. యజ్ఞశ్రీ శాతకర్ణి అపరాంత, పశ్చిమ భారత్, నర్మదాలోయ ప్రాంతాల నుంచి శకులను పారద్రోలడానికి దోహదపడిన సంఘటన ?1) చష్టన ఉత్తర భారతదేశంపై దృష్టి
2) రుద్రదాముని మరణం 3) శకులలో ముఖ్యులైన జివదామనుడు, రుద్రదాముని అంతర్గత పోరాటం 4) పైవన్నీ
46. ఆచార్య నాగార్జునుని పోషించిన యజ్ఞశ్రీ శాతకర్ణి ఏ కవిని త్రిసముద్రాధీశ్వరునిగా స్తుతించాడు ?1) హర్షుడు
2) హరిసేనుడు 3) బాణుడు 4) పంప
47.‘‘యజ్ఞశ్రీ శాతకర్ణి రాజకీయ ప్రభావం తమిళనాడులోనికి ప్రవేశించింది’’
ఈ వ్యాఖ్యకు సంబంధించి కింది వాటిలో సరైనది ? i) ఓడ చిహ్న నాణాలు తమిళనాడు తీరమంతా లభ్యమైనాయి. ii) ప్రాచీన తమిళమహా కావ్యమైన సిలప్పదిగారం పాసండసాత్తాన్ (పాషాండ = వేదాన్ని నిరసించిన, సాత్తాన్ = శాతవాహనులు) ఉత్సవానికి హాజరైనట్టు చెబుతోంది.1) i 2) i or ii 3) ii 4) i,ii
48. సముద్రాంతర వాణిజ్యం యజ్ఞశ్రీ శాతకర్ణి వశమైనట్టు అతని శాసనాలు, నాణాల ద్వారా తెలుస్తోంది. ఏఏ దేశాలతో ఆ కాలంలో వాణిజ్య సంబంధాలుండేవి ?
i) తూర్పు తీర రేవు పట్టణాలు ఆగ్నేయాసియా దేశాలతో ii) తూర్పు తీర రేవు పట్టణాలు చైనాతో iii) పశ్చిమ తీర రేవు పట్టణాలు మెసపటోమియాతో iv) పశ్చిమ తీరరేవు పట్టణాలు శ్రీలంకతో1) i,iii 2) ii,iv 3) i,ii 4) పైవన్నీ
49. యజ్ఞశ్రీ శాతకర్ణి బౌద్ధ మతాన్ని ఆదరించినట్టు, నాగార్జునాచార్యుని తన రాజ్యంలో నిలుపుకొని, ఆయన కోసం మహావిహారాలను, చైత్యాలను నిర్మించినట్టు పేర్కొన్న విదేశీ యాత్రికుడు ?1) మెగస్థనీస్
2) పాహియాన్ 3) హుయాన్‌త్సాంగ్ 4) 1,2
50. కింది వాటిలో సరైనది ?
i) నాగార్జునుడి కోసం యజ్ఞశ్రీ శ్రీపర్వతంలో మహాచైత్య విహారాలను నిర్మించినట్టు టిబెట్, చైనా చరిత్ర రచనలు తెలుపుతున్నాయి ii) ధాన్యకటక మహాస్తూపానికి నాగార్జునుడు శాలిప్రాకారం నిర్మించాడు iii) నాగార్జునుడు శాతవాహన యువరాజు చేతిలో మరణించినట్టు కథాపరిత్సాగరంలోని కథ తెలుపుతోంది1) i,iii 2) ii,iii 3) i,ii 4) పైవన్నీ
51. పలు ప్రాంతాల్లో కనిపించే కడపటి శాతవాహనుల శాసనాలు, నాణాల ఆధారంగా, శాతవాహన వంశంలో అంతఃకలహాలు ప్రారంభమైనట్టు ఏ గ్రంథంలో హుయాన్‌త్సాంగ్ పేర్కొన్నాడు ?1) గాథాసప్తసతి
2) విక్రమోర్వశీయం 3) కథాసరిత్సాగరం 4) అభిజ్ఞాన శాకుంతలం
52. యజ్ఞశ్రీ శాతకర్ణి తదుపరి రాజుల పాలనాక్రమం ?
i) చంద్రశ్రీ ii) పులోమావి - III iii) విజయ శాతకర్ణి 1) i,ii,iii 2) iii,ii,i 3) iii,i,ii 4) ii,i,iii
53. జతపరచండి ?
i) విజయ శాతకర్ణి ii) చంద్రశ్రీ/ చందసిరి iii) పులోమావి - III a) కొడవలి శాసనం (తూర్పు గోదావరి) b) అకోలా, తర్హాలా నిధులు (మహారాష్ట్ర) c) మ్యాఖదొని శాసనం (కర్నూలు)1) i-c,ii-b,iii-a 2) i-b,ii-a,iii-c 3) i-a,ii-b,iii-c 4) i-c,ii-a,iii-b
54. నాగార్జునకొంద వద్ద దొరికిన శాతవాహన రాజు శాసనం, శ్రీపర్వత - నాగార్జునకొండ సమీపాన ‘విజయపురి’ నిర్మాణం ఈ కింది రాజు పేరు మీద జరిగినట్టు చరిత్రకారుల అభిప్రాయం ?1) విజయ శాతక ర్ణ
2) విజయకుంభకర్ణి 3) వియజ శాతకర్ణి 4) విజయ చందశాతకర్ణి
55. తూర్పుదక్కన్, ఆంధ్ర దేశ ప్రాంతాల నుంచి ఒకేకాలానికి చెందిన , పురాణాల్లో పేర్కొనని శాతవాహన రాజులకు సంబంధించిన నాణాలు లభ్యమైనాయి. ఆ నాణాలు దొరికిన ప్రదేశం, రాజుల పేర్లను జతపరచండి ?
జీ) తీరాంధ్ర a) శివమకసద ii) తెలంగాణా b) శకశాతకర్ణి iii) తర్హాలానిధి c) కుంభకర్ణ iv) చేబ్రోలు d) కౌశకీపుత్ర శాతకర్ణి1) i-a,ii-b,iii-c,iv-d 2) i-b,ii-a,iii-c,iv-d 3) i-b,ii-c,iii-d,iv-a 4) i-d,ii-a,iii-b,iv-c
56. కింది వాటిలో సరైనది ?
i) ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో సింహం గుర్తుగల నాణాలు ‘సకసద’ అనే పేరుతో లభ్యమైనాయి ii) రుద్ర శాతకర్ణి, కర్ణ శాతకర్ణి, కుంభ శాతకర్ణి, కౌశీపుత్ర శాతకర్ణి నాణాలపై ఏనుగు, ఉజ్జయనీ చిహ్నాలున్నాయి1) i 2) ii 3) i లేదా ii 4) i,ii
57. నిశ్చిత వాక్యం (అ): అన్యస్తేషాం (ఇతరులైన వారిలో) అనేపదాన్ని పులోమావి పేరుముందు కొన్ని పురాణాలు ఉపయోగించాయి.
హేతువు (R): శాతవాహన సామ్రాజ్యం అస్తమించిన తర్వాత ఏర్పడిన అనేక స్థానిక రాజవంశాల్లో ఒక శాతవాహన వంశ ఉపశాఖకు చెందినవాడు పులోమావి. 1) A సరైనది, Rసరికానిది 2) A, Rలు సరికానివి 3) A సరికానిది, R సరైనది 4) A, Rలు సరైనవి
58. చివరి శాతవాహనుల కాలంలో అంతఃపుర కలహాలు అధారంగా భిన్న భాగాల్లో భిన్న శాఖలకు చెందిన రాజకుమారులు స్వతంత్రరాజ్యాలు స్థాపించారని తెలిపే పురాణం?
స్వతంత్రరాజ్యాలు స్థాపించారని తెలిపే పురాణం?1) మత్స్య 2) యుగ 3) వాయు 4) బ్రహ్మాండ
59. జతపరచండి.
శాతవాహన సామంతులు i) ఇక్ష్వాకులు ii) చుటునాగులు iii) అభీరులు iv) హిరణ్యకులు స్వాతంత్య్రం ప్రకటించిన ప్రాంతాలు a) కడప - కర్నూలు b) కర్ణాటక c) నాసిక్ (మహారాష్ట్ర) d) నాగార్జునకొండ1) i-a,ii-b,iii-c,iv-d 2) i-b,ii-a,iii-c,iv-d 3) i-d,ii-b,iii-c,iv-a 4) i-d,ii-b,iii-a,iv-c
60. మూడో పులోమావి కాలంలో కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో శాతవాహనరట్టిని పాలించడానికి నియమించబడిన మహా సేనాధిపతి ?1) స్కందవర్మ
2) స్కందశర్మ 3) స్కందనాగుడు 4) స్కందపతి
61. శాతవాహనులను అంతం చేసి శ్రీపర్వతీయులు రాజ్యానాక్రమించారని యుగపురాణం తెల్పుతోంది. దీని ప్రకారం ఇక్ష్వాక వంశస్థుడు శాంతమూలుడు ఏ శాతవాహనరాజును ఓడించి ధరణికోటను ఆక్రమించాడు ?1) పులోమావి - i
2) పులోమావి - ii 3) పులోమావి - iii 4) పులోమావి - iv
62. శాతవాహన వంశ క్షీణతకు ముఖ్యకారణం ?1) మహారధులతో వివాహా సంబంధాలు
2) శక - శాతవాహన చిరకాల సంఘర్షణ 3) శాతవాహన వంశంలో చీలికలు 4) పైవన్నీ
63. శకులపై పోరాటంలో నిమగ్నమవడంతో శాతవాహన రాజ్యానికి వచ్చిన ముప్పు ?1) పల్లవ, చాళుక్య, చోడులు బలవంతులై స్వతంత్ర రాజ్య స్థాపన చే యడం
2) కుర, చుటు, ఇక్ష్వాకు వంశస్థులు ఎదురు తిరిగి స్వతంత్ర రాజ్య స్థాపనకు పూనుకోవడం 3) శాతవాహనుల్లో అంతఃపుర కలహాలు 4) పైవన్నీ
64. శాతవాహనులు పశ్చిమ తీరంపై ఆధిపత్యం కోల్పోవడం వల్ల కలిగిన ముఖ్య ఫలితం ?1) ఆర్థిక నష్టం
2) సామంతులు స్వతంత్రించడం 3) అనేక మతాలు ఆవిర్భవించడం 4) 1,2
65. శాతవాహనుల పతనానికి కారణాలు ?
i) శక, పహ్లవ, క్షాత్రపుల నిరంతర దాడులు ii) శాతవాహన పోరాటాలతో సైనిక, ఆర్థిక నిర్వీర్యం iii) యజ్ఞశ్రీ శాతకర్ణి తర్వాత రాజులు అంత సమర్ధులు కాకపోవడం iv) సామంతుల తిరుగుబాటు v) అంతఃపుర కలహాలు1) i,ii,iv 2) i,ii,v 3) iii,iv 4) పైవన్నీ
|
![]() |
Latest News
శాతవాహనుల రాజకీయ చరిత్ర, క్షీణత
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment