వృద్ధి పెంపునకు ప్రభుత్వ చర్యలు:
మాదిరి ప్రశ్నలు:
1. రిజర్వు బ్యాంక్ 2018-19 వార్షిక నివేదికలో కింది ఏ రంగాల అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించింది?
ఎ) తయారీ రంగం బి) రవాణా, సమాచారం సి) వాణిజ్యం, హోటళ్లు డి) బ్రాడ్ కాస్టింగ్ 1) ఎ, సి 2) బి, డి 3) సి, డి 4) ఎ, బి, సి, డి
2. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పన్ను మినహాయింపులు ఎప్పటి నుంచి వర్తిస్తాయని ఆర్థిక మంత్రి ప్రకటించారు? 1) 2019 మార్చి 1
2) 2019 ఏప్రిల్ 1 3) 2019 జూలై 1 4) 2019 సెప్టెంబర్ 20
3. కింది వాటిలో ప్రపంచ నవకల్పన సూచీ 2019ని రూపొందించింది ఏది? 1) కార్నెల్ యూనివర్సిటీ, INSEAD, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్
2) హార్వార్డ యూనివర్సిటీ, హెరిటేజ్ ఫౌండేషన్ 3) ఆక్స్ఫర్డ యూనివర్సిటీ, INSEAD 4) పైవేవీ కావు
4. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ కింది వాటిలో దేనికి సంబంధించిన ప్రత్యేక ఏజెన్సీ? 1) ప్రపంచ బ్యాంక్
2) ఐ.ఎం.ఎఫ్ 3) ఐక్యరాజ్యసమితి 4) ఆసియా అభివృద్ధి బ్యాంక్
5. రిజర్వ బ్యాంక్ మూలధన నిల్వను నిర్వహించడానికి కారణం ఏమిటి?
ఎ) కరెన్సీ విలువలో ఒడిదుడుకులను తగ్గించడానికి బి) బాండ్ల విలువలో తగ్గుదలను అరికట్టడానికి సి) క్రెడిట్ రిస్క్‌ను తగ్గించుకోవడానికి డి) బహిరంగ మార్కెట్ చర్యల సంబంధిత స్థిరీకరణ వ్యయాల నిమిత్తం 1) ఎ మాత్రమే 2) బి, సి 3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
6. స్వదేశీ కంపెనీలపై సర్‌ఛార్జి, సెస్‌లను కలుపుకొని కార్పొరేషన్ పన్నును ఎంతగా ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించింది? 1) 22.17 శాతం
2) 25.17 శాతం 3) 28.17 శాతం 4) 29.17 శాతం
7. ఏ విధమైన ప్రోత్సాహకాలు, మినహాయింపులు పొందని స్వదేశీ కంపెనీలపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయపు పన్ను రేటును ఎంతగా ప్రతిపాదించింది? 1) 22%
2) 25% 3) 27% 4) 28%
8. బహుమతి పన్నును కింది ఏ కమిటీ సిఫార్సుపై ప్రవేశపెట్టారు? 1) రాజా చెల్లయ్య
2) ఎస్. చక్రవర్తి 3) కాల్డర్ 4) పార్థదాస్ గుప్తా
9.నిలకడ గల అభివృద్ధి కింది వాటిలో దేనితో సాధ్యమవుతుంది?
ఎ. సుస్థిర వ్యవసాయాభివృద్ధి బి. గ్రీన్ హౌస్ వాయువు విడుదలను తగ్గించుకోవడం సి. పట్టణీకరణ, పారిశ్రామికాభివృద్ధిలో పర్యావరణ అంశాల ప్రాధాన్యత డి. జీవ పారిశ్రామిక హబ్‌ల ఏర్పాటు 1) ఎ మాత్రమే 2) బి, సి 3) ఎ, బి, సి, డి 4) డి మాత్రమే
10. ప్రపంచ నవకల్పన సూచీ-2019లో భారత్ స్థానం?
1) 42 2) 52 3) 62 4) 81
11. కింది వాటిలో కోశ విధాన లక్ష్యం ఏమిటి?
ఎ) వనరుల సమీకరణ బి) ఆర్థికాభివృద్ధి సి) ఆదాయపునఃపంపిణీ డి) పొదుపు, పెట్టుబడులను ప్రోత్సహించడం 1) ఎ, బి 2) బి, సి 3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
12.పర్యావరణ అభివృద్ధిపై 1992లో జరిగిన ఐక్యరాజ్యసమితి సదస్సులో నిలకడగా ఉన్న అభివృద్ధికి సంబంధించి ఎన్ని నియమాలను తెలియజేశారు? 1) 17
2) 27 3) 32 4) 34
13. పన్నెండో పంచవర్ష ప్రణాళికకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? 1) సత్వర, సమ్మిళిత, నిలకడ ఉన్న అభివృద్ధి పన్నెండోప్రణాళిక లక్ష్యం
2) ఈ ప్రణాళికలో సుస్థిరత్వ సమస్యకు ప్రాధాన్యత ఇచ్చారు 3) వనరుల కేటాయింపులో పరిశ్రమలు, ఖనిజాలకు ప్రాధాన్యత ఇచ్చారు 4) అభివృద్ధి ప్రక్రియలో పర్యావరణం వల్ల కలిగే పర్యవసనాలను విస్మరించడం సాధ్యం కాదని ప్రణాళిక పేర్కొంది.
14. 1972లో ‘లిమిట్స్ టు గ్రోత్’ గ్రంథాన్ని రచించింది ఎవరు? 1) డి.హెచ్. మెడోస్
2) రేచల్ కార్సన్ 3) రాబిన్సన్ 4) పాల్క్రూగ్మన్
15. భవిష్యత్ తరాలవారి అవసరాలు తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల వారు తమ అవసరాలను తీర్చుకోగలగడమే నిలకడగా ఉన్న అభివృద్ధిగా వర్ణించిన సంస్థ? 1) ఐక్యరాజ్యసమితి
2) బ్రిట్లాండ్ క మిషన్ 3) ప్రపంచ ఆరోగ్య సంస్థ 4) ప్రపంచ వాణిజ్య సంస్థ
16. ‘సెలైంట్ స్ప్రింగ్’ గ్రంథ రచయిత ఎవరు? 1) రేచెల్ కార్సన్
2) శామ్యుల్సన్ 3) శ్యాంపిట్రోడా 4) కీన్స్
17. వ్యవసాయ ఆదాయంపై పన్ను విధింపును 1972లో సిఫార్సు చేసిన కమిటీ ఏది? 1) వాంఛూ కమిటీ
2) కాల్డర్ కమిటీ 3) కె.ఎన్. రాజ్ కమిటీ 4) రాజా చెల్లయ్య కమిటీ
18. సెక్యూరిటీల లావాదేవీలపై పన్నును కింది ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1) 1997
2) 2004 3) 2006 4) 2008
19. ధరిత్రి సదస్సు ఎజెండా-21లో ప్రస్తావించని అంశం ఏది? 1) పేదరికాన్ని తొలగించడం
2) సహజ వనరుల పరిరక్షణ 3) దేశాల మధ్య సరిహద్దు వివాదాల తొలగింపు 4) అత్యవసర సేవలు అందరికీ అందుబాటు
20. కింది ఏ బ్యాంక్ మనీ విత్ డ్రాయల్ (withdraw)కు సంబంధించి రూ.1000 పరిమితిని రిజర్వు బ్యాంక్ ఇటీవల విధించింది? 1) పంజాబ్, మహారాష్ర్ట కోఆపరేటివ్ బ్యాంక్
2) అలహాబాద్ బ్యాంక్ 3) ఇండియన్ బ్యాంక్ 4) మహేష్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్
21. నిర్విక్ (NIRVIK) పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి? 1) మానవాభివృద్ధి
2) ఎగుమతిదారులకు రుణ లభ్యత పెంపు 3) ఆర్థిక అసమానతల తొలగింపు 4) వ్యవసాయదారులకు పరపతి
22. 2019 సెప్టెంబర్ 12న రాంచీలో ప్రధానమంత్రి ప్రారంభించిన జాతీయ పెన్షన్ పథకం కింద అర్హులు ఎవరు?
ఎ) దుకాణదారులు బి) రిటైల్ వర్తకులు సి) స్వయం ఉపాధి పొందేవారు డి) వ్యవసాయ కార్మికులు 1) ఎ, బి 2) బి మాత్రమే 3) ఎ, బి, సి 4) డి మాత్రమే
23. ఇండియన్ బ్యాంక్‌లో ఏ బ్యాంక్ విలీనాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? 1) అలహాబాద్ బ్యాంక్
2) ఆంధ్రా బ్యాంక్ 3) కార్పొరేషన్ బ్యాంక్ 4) సిండికేట్ బ్యాంక్
24. భారత్‌లో కొరతగా ఉన్న ఖనిజ వనరులు ఏవి? 1) మైకా, బాక్సైట్
2) ఇనుము, మాంగనీస్ 3) కాపర్, జింక్, గ్రాఫైట్ 4) లైమ్‌స్టోన్, డోలమైట్
25. ప్రోత్సాహకాలు, మినహాయింపులు పొందుతున్న కంపెనీలపై కనీస ప్రత్యామ్నాయ పన్నును 18.5 శాతం నుంచి ఎంతకు త గ్గించారు? 1) 12 శాతం
2) 15 శాతం 3) 16 శాతం 4) 17 శాతం
26. ఆర్థిక మంత్రి ఇటీవల ప్రకటించిన పన్ను ప్రోత్సాహకాలు/మినహాయింపుల విలువ ఎంతగా ఉంటుందని అంచనా? 1) రూ.1,45,000 కోట్లు
2) రూ.1,57,000 కోట్లు 3) రూ.1,76,000 కోట్లు 4) రూ.1,96,000 కోట్లు
27. నిర్విక్ పథకాన్ని ఇటీవల ప్రారంభించింది? 1) ఎక్స్పోర్ట్ క్రె డిట్ గ్యారంటీ కార్పొరేషన్
2) రిజర్వు బ్యాంక్ 3) ఆసియా అభివృద్ధి బ్యాంక్ 4) ఐసీఐసీఐ
| |
Latest News
‘నిర్విక్’ పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment