1. కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందిన ‘పేరిణీ శివతాండవం’ నృత్యాన్ని ఆధునీకరించినవారు ? 1) వెంపటి చినసత్యం
2) నటరాజ రామకృష్ణ 3) కృష్ణయ్యర్ 4) బాలసరస్వతి అమ్మాళ్
2. జతపరచండి.
జాబితా - I 1. మైలమ 2. హేమాద్రి 3. సింగన 4. విద్యానాధుడు జాబితా - II a) వ్రతఖండం గ్రంథం b) తెలుగు రాయ ప్రతిష్టాపనా చార్య బిరుదు c) ప్రతాపరుద్ర యశోభూషణ గ్రంథం d) కడలాలయబనది 1) 1-D,2-A,3-B,4-C 2) 1-A,2-B,3-C,4-D 3) 1-D,2-C,3-B,4-A 4) 1-C,2-D,3-A,4-B
3. కాకతీయుల కాలంలో వైశ్యుల కుల సంఘం పేరు ? 1) తక్షక
2) మహాజనులు 3) నకరం 4) నాపిత
4. కింది వాటిలో సరైనది ? 1) బ్రహ్మనాయుడు - వీరవైష్ణవం
2) బసవేశ్వరుడు - వీరశైవం 3) తిక్కన - హరిహరాద్వైతం 4) పైవన్నీ
5. ఆవులు, గొర్రెల మీద విధించే పన్ను ఏది ? 1) పంగం
2) ఇల్లరి 3) కిళారము 4) అంతరాయము
6. వీరవైష్ణవానికి ప్రధాన కేంద్రం ? 1) గురజాల
2) మాచెర్ల 3) గుడివాడ 4) అద్దంకి
7. ‘‘గోనగన్నారెడ్డి’’ గ్రంథ రచయిత ? 1) ఆరుద్ర
2) అడవిబాపిరాజు 3) దాశరథి రంగాచార్యులు 4) నండూరి సుబ్బారావు
8. నవకాశీ చిత్రకళలో కీర్తిగాంచిన మహిళ ? 1) మైలాంబ
2) ముప్పమాంబ 3) మాచెల్దేవి 4) రుయ్యమ
9. గ్రామసరిహద్దుల్లో ప్రమాద ఘటికలను మోగించే వారు ఎవరు ? 1) పెరికవారు
2) సింగినాదంవారు 3) కాసెవారు 4) ఈదురువారు
10. ‘మూర్తూరు’ అనగా ఏ పంటసాగు చేసే భూమి ? 1) గోధుమ
2) చెరకు 3) వరి 4) మొక్కజొన్న
11. పల్నాటి యుద్ధంలో నలగామరాజుకు సహకరించిన కాకతీయ పాలకుడు ? 1) ప్రోలరాజు - II
2) గణపతిదేవుడు 3) బేతన - I 4) ప్రతాపరుద్రుడు - I
12. కాకతీయుల కాలంలో వర్తక శ్రేణులు తరచూ సమావేశమయ్యే నేటి కృష్ణపట్నం ప్రాచీన నామం ? 1) కొల్లితురై
2) పాలిక్కడ్ 3) గండగోపాలపట్నం 4) 1,3
13. తలారిపన్ను అంటే ? 1) ఇంటిపన్ను
2) పశువులను మేపుకున్నందుకు చెల్లించేది 3) ఊరి కాపలాదారు ఖర్చు కోసం చెల్లించేది 4) ఉప్పు కొటారులపై పన్ను
14. బ్రహ్మ, విష్ణు ద్వారపాలకులుగాగల శివాలయం ఎక్కడ ఉంది ? 1) మందడం
2) పుష్పగిరి 3) ఉదయగిరి 4) గుడిమల్లం
15. విజ్ఞానేశ్వరీయం ప్రకారం కాకతీయుల కాలం నాటి వడ్డీరేటు ఎంతమించకూడదు ? 1) 12%
2) 11% 3) 10% 4) 9%
16. కాకతీయుల రాజ భాష ? 1) కన్నడ
2) తెలుగు 3) సంస్కృతం 4) ప్రాకృతం
17. కాకతీయులు పూజించిన శాంతినాథజైనుని ఉపాసిక చిహ్నం ? 1) వరాహం
2) గరుడ 3) శంఖు 4) దుప్పి
18. కాకతీయులు కాలంలో పండించనిపంట ? 1) కందిపప్పు
2) అరటి 3) వరి 4) చెరకు
19. కింది వాటిలో సరికానిది ? 1) పండితారాధ్య చరిత్ర - పాల్కురికి
2) నీతిసారం - రుద్రదేవుడు 3) నృత్యరత్నావళి - జాయపసేనాని 4) క్రీడాభిరామం - రావిపాటి త్రిపురాంతకుడు
20. గొర్రెల మందలపై విధించేపన్ను ? 1) అంతరాయం
2) ముదార 3) కిరళము 4) అలము
21. కాకతీయుల కాలంలో రైతు సంఘాలను ఏమనేవారు ? 1) నరకం
2) మహానాడు 3) ఉపకృతి 4) చిత్రమేలి
22. కింది వాటిలో సరైనది ? 1) రావిపాటి త్రిపురాంతకుడు - మదనవిజయం
2) రంగనాథ రామాయణం - గోనబుద్ధారెడ్డి 3) క్రీడాభిరామం - వీథి నాటకం 4) పైవన్నీ
23. తొలి కాకతీయులు ఏ మతస్థులు ? 1) జైనులు
2) బౌద్ధులు 3) వైష్ణవులు 4) వీరశైవులు
24. కింది వాటిలో ధర్మ శాస్త్ర గ్రంథమేది ? 1) దశకుమార చరిత్ర
2) నీలితారావళి 3) ప్రేమాభిరామం 4) విజ్ఞానేశ్వరీయం
25. రుద్రీశ్వరాయం ఎక్కడ ఉంది ? 1) మందడం
2) హన్మకొండ 3) లక్నవరం 4) పాలింపేట
26. రుద్రమదేవి వివరన కలిగిన మల్కాపురం రాతి స్థంభ శాసనాన్ని పరిశోధించినవారు ?
1) A.R.సరస్వతి 2) వేటూరి ప్రభాకరశాస్త్రి 3) జయంతి రామయ్య 4) నీలకంఠశాస్త్రి
27. కింది వాటిలో సరికానిది ?
1) జైతుగి - రుద్రదేవుడు 2) సుసరబేత్ - రోమనివారిణి 3) సింగన - గణపతిదేవుడు 4) బయ్యారం చెరువు శాసనం - రుద్రమదేవి
28. రామప్పదేవాలయాన్ని ఎప్పుడు నిర్మించారు ? 1) 1213
2) 1230 3) 1229 4) 1269
29. కింది వాటిలో సరైనది ? 1) మల్లికార్జున పండితుడు - శివతత్వసారం
2) శివదేవయ్య - పురుషార్థసారం 3) మడికి సింగన - సకలనీతిసమ్మతం 4) పైవన్నీ
30. ఆంధ్రదేశంలో తొలి ప్రసూతి వైద్య ఆలయం ఎవరి కాలంలో నిర్మించారు ? 1) రుద్రదేవుడు
2) రుద్రమదేవి 3) గణపతి దేవుడు 4) రెండవ ప్రతాపరుద్రుడు
31. ‘ప్రతాపరుద్ర యశోభూషణం’ గ్రంథకర్త ? 1) విద్యానాథుడు
2) అప్పయా చార్యుడు 3) యథావాక్కుల అన్నమయ్య 4) మడికి సింగన
32. గణపతి దేవుడిని ఓడించిన జెటావర్మ సుందర పాండ్యుడు ఎక్కడ వీరాభిషేకం చేయించుకున్నాడు ? 1) ఓజిలి
2) పులికాట్ 3) నెల్లూరు 4) సూళ్ళూరుపేట
33. కరువు వల్ల తన వృత్తిని (పూజారితత్వాన్ని) అమ్ముకున్న పూజారి వివరణ కలిగిన శాసనం ఎక్కడ ఉంది ? 1) వీరభద్రాలయం (ప్రకాశం)
2) రంగనాథాలయం (నెల్లూరు) 3) కోటప్పకొండ (గుంటూరు) 4) దేవగుడి (కడప)
34. కింది వాటిలో రాణి రుద్రమదేవి పాలనాకాలం? 1) 1269 - 1289
2) 1259 - 1289 3) 1259 - 1279 4) 1269 - 1299
35. కర్నూలు ప్రాంతంలో అడవులను నరికించి వ్యవసాయం చేయించిన పాలకుడు ? 1) ప్రోలరాజు - II
2) రుద్రదేవుడు 3) ప్రతాపరుద్రుడు - II 4) గణపతిదేవుడు
36. సంగీత, చిత్రలేఖనాల్లో పేరుగాంచినవారు ? 1) మాచల్దేవి
2) మైలాంబ 3) నారమ 4) ముమ్ముడమ్మ
37.మోటుపల్లి ఓడరేవు ఏ జిల్లాలో ఉంది ? 1) విజయనగరం
2) కృష్ణా 3) ప్రకాశం 4) విశాఖపట్నం
38. దేవకార్యాల కోసం భూమి యజమానుల నుంచి, వర్తకుల నుంచి వసూలు చేసే పన్నును ఏమంటారు ? 1) మగము
2) అప్పం 3) దొగరాచపన్ను 4) పడివల
39. తురుష్కులు ఉపయోగించిన ‘మంజనిక్’ అంటే ఏమిటి ?
1) రోమనివారిణి మందులు 2) భూమికొలత సాధనాలు 3) రాళ్ళువిసిరే యంత్రాలు 4) కుప్పనూర్పిడి యంత్రాలు
40. మార్కొపోలో ఏ దేశానికి చెందిన వాడు ? 1) వెనీస్
2) మిలాన్ 3) జినోవా 4) రోమ్
41.తిక్కన ఆరాధనాతత్వం ఏమిటి ? 1) హరిహరనాథతత్వం
2) వీరశైవం 3) విశిష్టాద్వైతం 4) వీరవైష్ణవం
42. సప్తసంతానాల్లో లేని ఆచారం ఏది ? 1) తటాక నిర్మాణం
2) నిథినిక్షేపణం 3) అంతఃపుర నిర్మాణం 4) ప్రబంధ రచన
43. కాకతీయుల కాలంలో విధించని పన్ను ? 1) దరిసినం
2) మోతుర్పా 3) పుట్టికొలుచు 4) పుట్టిప హుండీ
44. ద్రాక్షారామం భీమేశ్వరుడిని నాలుగు దిశల నుంచి కాపాడుతున్న గ్రామదేవతల్లో లేనిది ? 1) నూకాంభిక
2) ఘట్టాంభిక 3) గోగులాంభింక 4) ఓగులాంభిక
45.గణపతి దేవుని మత గురువు ఎవరు ? 1) పాల్కురికి సోమనాథుడు
2) రామేశ్వర పండితుడు 3) మల్లికార్జున పండితుడు 4) విశ్వేశ్వర శివాచార్యుడు
46. శ్రీశైలానికి మెట్లు నిర్మించిన కాకతీయ రాజు ? 1) ప్రోలరాజు - I
2) ప్రోలరాజు - II 3) బేతియ 4) గణపతి దేవుడు
47. మోటుపల్లి ఓడరేవు ప్రాంతంలో గణపతి దేవుడు నియమించిన అధికారి ? 1) కోటనాయకుడు
2) మల్లికార్జున పండితుడు 3) సిద్ధయ్య దేవుడు 4) షితాబ్ఖాన్
48. ఏకవీరాదేవి ఆలయం ఎక్కడ ఉంది ?
1) మొగిలిచర్ల 2) భైరవకోన 3) ఉమామహేశ్వరం 4) త్రిపురాంతకం
49. ‘‘శత్రువు రక్తంతోను, వారి భార్యల కన్నీళ్ళతోను నేల తడవనీ’’ అన్న గ్రంథం ? 1) జినేంద్ర కళ్యాణాభ్యుదయం
2) ప్రేమాభిరామం 3) నీతిసారముక్తావళి 4) నిర్వచనోత్తరరామాయణం
50. కింది వాటిలో సరైనది ? 1) శ్రీశైల మల్లికార్జునుని చెంచుమల్లయ్యని అంటారు
2) త్రిపుర సుందరి గుడిలో వీర శిలలు పాతి ఉన్నాయి 3) 5 రకాల స్త్రీ ధనాలను విజ్ఞానేశ్వరం తెల్పుతోంది 4) పైవన్నీ
51. రుద్రమదేవికి ఎంత మంది సంతానం ? 1) కుమార్తెలు ఇద్దరు
2) కుమార్తెలు ముగ్గురు 3) కుమార్తెలు నలుగురు 4) ఏకైక కుమార్తె
52. మార్కొపోలోను ఏమని అభివర్ణిస్తారు ?
1) ప్రిన్స ఆఫ్ ఫ్యూర్ లాండ్ 2) పయనీర్ ఆఫ్ సీక్రెట్ లాండ్ 3) ప్రిన్స అమాంగ్ పిలిగ్రిమ్స్ 4) పయనీర్ అమాంగ్ ట్రావెలర్స
53. ఏ దేవుని ప్రీతికోసం ‘గండకత్తెర’ ఆచారం నిర్వహిస్తారు ? 1) కార్తికేయుడు
2) శివుడు 3) గ ణేశుడు 4) విష్ణువు
54. కాకతీయుల కాలంలో ‘ములికినాడు’లో భాగమైన నేటి ఆంధ్రప్రదేశ్లోని జిల్లాలేవి ? 1) అనంతపురం, చిత్తూరు
2) నెల్లూరు, చిత్తూరు 3) కడప, కర్నూలు 4) కడప, నెల్లూరు
55. కింది వాటిలో సరైనది ? 1) రాయగజకేసరి - రుద్రమదేవి
2) తెలుగు కవితా పితామహుడు - శివదేవయ్య 3) సంస్కృతాంధ్ర కవితా పితామహ - అగస్త్యుడు 4) 1,2,3
56. రుద్రమదేవి భర్త ఎవరు ? 1) పువ్వుల ముమ్మిడి
2) చాళుక్య వీరభద్రుడు 3) పినచోడుడు 4) కాయస్థ అంభదేవుడు
57. శివుడు, విష్ణువు, సూర్యుడు ఒకే వేదికపై పూజలందుకునే ఆలయం ఎక్కడ ఉంది ? 1) హన్మకొండ
2) వరంగల్ 3) త్రిపురాంతకం 4) మందడం
58. చారిత్రక పరిపాలనాంశాల ప్రకారం కింది వాటిలో సరైన క్రమం ? 1) రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవి
2) గణపతిదేవుడు, రుద్రదేవుడు, మహాదేవుడు, రుద్రమదేవి 3) రుద్రదేవుడు, గణపతిదేవుడు, రెండవ ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి 4) రెండవ ప్రతాపరుద్రుడు, రుద్రదేవుడు, రుద్రమదేవి, గణపతి దేవుడు
59. ‘సిద్ధాయం’ అనే వ్యవసాయ పన్నుకు మరోపేరు ? 1) దరిశనం
2) పంగము 3) ఉపకృతి 4) నీరి
60. కింది వాటిలో సరికానిది ? 1) మహాజనులు - బ్రాహ్మణ సమయం
2) కొలగాడు - అంగడిలో సరుకులను కొలిచేవాడు 3) ఇనుగుర్తి - గోపాలకృష్ణాలయం 4) వేయిస్థంభాలగుడి - రుద్రమదేవి
|
![]() |
Latest News
ఆంధ్రదేశ సామాజిక సంస్కృతిక చరిత్ర
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment