భారత మానవాభివృద్ధి సూచీ విలువలో 1990 - 2017 మధ్య కాలంలో గణనీయమైన ప్రగతి ఏర్పడింది.
| |
ఈ కాలంలో మానవాభివృద్ధి సూచీ విలువ 0.427 నుంచి 0.640కు పెరిగింది. భారత్ మానవాభివృద్ది సూచీ విలువలో పెరుగుదల ఏర్పడినప్పటికీ ఇతర ఆసియా, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో పోల్చినప్పుడు విలువపరంగా భారత్ వెనుకబడి ఉంది. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం రూపొందించిన మానవాభిృద్ధి సూచీలో మొత్తం 189 దేశాల్లో భారత్ 130వ స్థానం పొందింది. రాష్ట్రస్థాయి మానవాభివృద్ధి సూచీలను పరిశీలించినప్పుడు భారత్‌లో ప్రాంతీయ, మానవాభివృద్ధిలో రాష్ట్రాల మధ్య అసమానతలు స్పష్టమవుతున్నాయి. యు.ఎన్.డి.పి. 1990-2017 మధ్య కాలంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించి Sub national HDI ని రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాలు మానవాభివృద్ధిలో గణనీయమైన ప్రగతి సాధించాయి. 2017 సంవత్సరంలో కనిష్ట Sub national HDI విలువ 1990లో సాధించిన గరిష్ట విలువ కంటే అధికమని నివేదిక పేర్కొంది. భారత్‌లో వివిధ రాష్ట్రాల మానవాభివృద్ధి సూచీ స్కోరులను పరిశీలించినప్పుడు ఈ సూచీలో కేరళ, గోవా, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్‌లు మొదటి నాలుగు స్థానాలు పొందగా బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లు చివరి స్థానాలు పొందాయి. 1990వ దశకంలో మానవాభివృద్ధి పరంగా వెనుకబడిన రాష్ట్రాలు ప్రస్తుతం ముందంజలో ఉన్నాయి. మానవాభివృద్ధి సూచీ స్కోరును ప్రాంతాల వారీగా పరిశీలించినప్పుడు తూర్పు ప్రాంత రాష్ట్రాలతో పోల్చినపుడు దక్షిణ, ఉత్తర ప్రాంతంలోని రాష్ట్రాలు మానవాభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి.
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత్ ప్రగతిని కొలవడానికి నీతి ఆయోగ్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ‘SDG ఇండియా ఇండెక్స్’ను అభివృద్ధిపరచింది. ఈ సూచీలో భారత్ స్కోరు 57. ఈ సూచీ ప్రకారం రాష్ట్రాలను నాలుగు కేటగిరీలుగా విభజించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 12, 13, 14, 17 లక్ష్యాలను మినహాయించి మిగిలిన ప్రతి లక్ష్యానికి సంబంధించి రాష్ట్రాలను కింది కేటగిరీల మధ్య విభజించారు. 1. Achiever - ఎస్.డి.జి. ఇండియా సూచీ స్కోరు 100కు సమానమైన రాష్ట్రాలు ఈ కేటగిరీలో ఉంటాయి. 2. Front Runner - స్కోరు 65 కంటే ఎక్కువ లేదా సమానంగా ఉండి వందలోపు సాధించిన రాష్ట్రాలు ఈ కేటగిరీలో ఉంటాయి. ఉదా: కేరళ, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు 3. Performer - స్కోరు 50 కన్నా ఎక్కువ లేదా సమానంగా ఉండి 65 కంటే తక్కువగా ఉన్న రాష్ట్రాలు ఈ కేటగిరీలో ఉంటాయి. ఉదా: ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, కర్ణాటక, మహారాష్ర్ట, తెలంగాణ 4. Aspirant - స్కోరు 50 కంటే తక్కువగా ఉన్న రాష్ట్రాలు ఈ కేటగిరీలో ఉంటాయి. ఉదా: ఉత్తరప్రదేశ్, బిహార్, అస్సాం
మాదిరి ప్రశ్నలు:
1. కింది వాటిలో SDG ఇండియా ఇండెక్స్‌ను అభివృద్ధి పరిచింది ఏది? 1) ఆర్థిక మంత్రిత్వ శాఖ
2) నీతి ఆయోగ్ 3) ఆర్థిక సంఘం 4) ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ స్టడీస్
2. ప్రసూతి మరణాలు 2014-16 మధ్య కాలంలో ప్రతి లక్ష జననాలకు భారత్‌లో ఎంతగా నమోదయ్యాయి? 1) 130
2) 145 3) 162 4) 167
3. కింది వాటిలో బడ్జెటింగ్ ఫర్ Gender Equity కి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది ఏది? 1) మానవ వన రుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
2) ఆర్థిక మంత్రిత్వ శాఖ 3) మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 4) పైవన్నీ
4. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ఉమ్మడి వ్యయం 2018-19లో సాంఘిక సేవలపై జి.డి.పి.లో ఎంత శాతం? 1) 6.2 శాతం
2) 6.8 శాతం 3) 7.3 శాతం 4) 8.2 శాతం
5. సమగ్ర శిక్ష కార్యక్రమంలో కింది ఏ కార్యక్రమం విలీనమైంది?
ఎ) సర్వశిక్షా అభియాన్ బి) రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్ సి) టీచర్ ఎడ్యుకేషన్ డి) పోషణ్ అభియాన్ 1) ఎ, డి 2) ఎ, బి, సి 3) సి, డి 4) డి మాత్రమే
6. 2020 నాటికి కోటి మంది యువతకు నైపుణ్యతా శిక్షణ (skill training) కల్పించడం కింది ఏ పథకం లక్ష్యం? 1) ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన
2) పీఎం-కిసాన్ 2019 3) POSHAN అభియాన్ 4) ఆయుష్మాన్ భారత్, 2018
7. ప్రతిరోజు భారత్‌లో ఎంతమేరకు Solid Waster generate అవుతుందని అంచనా?
1) 31 మిలియన్ టన్నులు 2) 41 మిలియన్ టన్నులు 3) 51 మిలియన్ టన్నులు 4) 61 మిలియన్ టన్నులు
8.జాతీయ వ్యవసాయ బీమా పథకం, ఆధునికీకరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకం స్థానంలో ప్రవేశపెట్టిన పంట బీమా పథకం? 1) ప్రధానమంత్రి సరక్షా బీమా యోజన
2) ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన 3) సంకల్ప్ 2017 4) పైవేవీకావు
9. నేషనల్ శాంపుల్ సర్వే 2011-12 ప్రకారం దేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో ఎంత శాతం సంఘటిత రంగ నైపుణ్యతా శిక్షణ పొందినట్లుగా అంచనా? 1) 1.5 శాతం
2) 2.0 శాతం 3) 2.3 శాతం 4) 5.5 శాతం
10. SDG ఇండియా సూచీ స్కోరు 50 కంటే తక్కువగా ఉన్న రాష్ట్రాలు?
ఎ) ఉత్తరప్రదేశ్ బి) బిహార్ సి) అస్సాం డి) తమిళనాడు 1) ఎ, డి 2) బి, డి 3) ఎ, బి, సి 4) ఎ, బి, సి, డి
11. 2015-16లో దేశంలో బ్యాంక్ లేదా పొదుపు ఖాతాలు నిర్వహిస్తున్న మహిళల శాతం? 1) 42 శాతం
2) 53 శాతం 3) 61 శాతం 4) 63 శాతం
12. జండర్ బడ్జెటింగ్ అనే పదాన్ని తొలిసారిగా 2001లో ఆర్థిక మంత్రిగా ఉన్న ఎవరు ప్రస్తావించారు? 1) యశ్వంత్ సిన్హా
2) జశ్వంత్ సింగ్ 3) చిదంబరం 4) వి.పి. సింగ్
13. శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2016 ప్రకారం భారత్‌లో శిశు మరణాల రేటు ప్రతి వెయ్యి జననాలకు ఎంత? 1) 24
2) 30 3) 34 4) 39
14. కింది ఏ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అధిక శాతం భారత ప్రజారోగ్య ప్రమాణాలను పాటిస్తున్నాయి?
ఎ) ఆంధ్రప్రదేశ్ బి) తమిళనాడు సి) హర్యానా డి) ఉత్తరప్రదేశ్ 1) ఎ, సి 2) ఎ, బి 3) సి మాత్రమే 4) డి మాత్రమే
15. సాంవత్సరిక ప్రీమియం రూ.330గా ఉండి 18 నుంచి 50 సంవత్సరాల వయో వర్గం లోపు వారికి సంబంధించి ప్రభుత్వ జీవిత బీమా పథకం?
1) ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన 2) ఆమ్ ఆద్మీ బీమా యోజన 3) జనశ్రీ బీమా యోజన 4) పైవన్నీ
16. సాంవత్సరిక ప్రీమియం రూ.12గా ఉండి 18 నుంచి 70 సంవత్సరాల వయో వర్గంలోపు వారికి సంబంధించి ప్రమాద బీమా పథకం? 1) కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం
2) ఆయుష్మాన్ భారత్ 3) ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన 4) రాష్ట్రీయ స్వస్థ్య బీమా యోజన
17. ఐదు సంవత్సరాలలోపు మరణాల రేటు 2016లో ప్రతి వెయ్యి జననాలకు భారత్‌లో ఎంతగా నమోదైంది? 1) 24
2) 34 3) 37 4) 39
18.ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్) కింది ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1) 2014
2) 2015 3) 2016 4) 2019
19. కింది వాటిలో అసంఘటిత రంగానికి సంబంధించిన పెన్షన్ పథకం ఏది? 1) అటల్ పెన్షన్ యోజన
2) నిర్మల గ్రామ పురస్కార్ 3) ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన 4) మిషన్ ఇంధ్ర ధ నుష్
20. 2022 నాటికి పౌష్టికాహారలేమి రహిత భారత్ కింది ఏ పథకం లక్ష్యం? 1) స్వధార్
2) POSHAN అభియాన్ 3) బాల బంధు 4) మధ్యాహ్న భోజన పథకం
21. విద్యపై 2018-19 బడ్జెట్ అంచనాల ప్రకారం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ఉమ్మడి వ్యయం జి.డి.పి.లో ఎంత శాతం?
1) 2.1 శాతం 2) 2.8 శాతం 3) 3.0 శాతం 4) 3.5 శాతం
22. ప్రజారోగ్య సౌకర్యాలలో భాగంగా Infertility కోసం హోమియోపతి ట్రీట్మెంట్ను ‘జననీ’ అనే పథకం కింది ఏ రాష్ర్ట ప్రభుత్వం చేపట్టింది? 1) తెలంగాణ
2) మహారాష్ర్ట 3) బీహార్ 4) కేరళ
23.2018-19లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కల్పించిన మొత్తం వ్యక్తిగత పనిదినాల్లో మహిళల వాటా? 1) 48.6 శాతం
2) 54.6 శాతం 3) 59.5 శాతం 4) 65.7 శాతం
24. కింది ఏ రాష్ర్టంలో గ్రామీణ రోడ్ల పొడవు అధికం? 1) మహారాష్ట్ర
2) మధ్య్రపదేశ్ 3) పశ్చిమ బెంగాల్ 4) గుజరాత్
25. సాధారణ స్థితి ఆధారంగా 2017-18లో భారత్‌లో నిరుద్యోగిత రేటు? 1) 4.5 శాతం
2) 5.1 శాతం 3)6.1 శాతం 4) 6.7 శాతం
26.ఆరోగ్యంపై 2018-19 బడ్జెట్ అంచనాల ప్రకారం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ఉమ్మడి వ్యయం జి.డి.పి.లో ఎంత శాతం? 1) 1.5 శాతం
2) 1.9 శాతం 3) 2.1 శాతం 4) 2.6 శాతం
ఎ) కేరళ
బి) హిమాచల్‌ప్రదేశ్ సి) తమిళనాడు డి) అస్సాం 1) ఎ మాత్రమే 2) సి, డి 3) ఎ, బి, సి 4) డి మాత్రమే
28. భారత్‌లో ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2017-18లో ఎంత శాతం?
1) 23.8 శాతం 2) 25.8 శాతం 3) 32.1 శాతం 4) 35.8 శాతం
29. అర్హులైన రైతులందరికీ భూకమతంతో సంబంధం లేకుండా మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ.6000 ఆదాయ మద్దతుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన పథకం? 1) పి.ఎం. కిసాన్ 2019
2) పి.ఎం. శ్రమ్-యోగి మంధన్ యోజన 2019 3) సంకల్ప్ 4) పైవన్నీ
30.పేద మహిళలకు మైక్రో ఫైనాన్స సంస్థల ద్వారా రుణాలు అందించడానికి 1993లో ప్రారంభించిన పథకం? 1) స్వధార్
2) రాష్ట్రీయ మహిళా కోష్ 3) ధనలక్ష్మి 4) సబల
31.గ్రామ పంచాయతీలు పారిశుధ్యాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించింది?
1) నిర్మల్ గ్రామ పురస్కార్ 2) భారత్ నిర్మాణ్ 3) పి.ఎం. గ్రామోదయ యోజన 4) ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన
32. స్వాలంభన కార్యక్రమాన్ని 2010-11 కేంద్ర బడ్జెట్ ద్వారా ప్రకటించిన ఆర్థిక మంత్రి?
1) చిదంబరం 2) ప్రణబ్ ముఖర్జీ 3) యశ్వంత్ సిన్హా 4) పియుష్ గోయల్
33. వాల్మీకి అంబేడ్కర్ ఆవాస్ యోజన పథకం ఉద్దేశ్యం? 1) స్వయం ఉపాధి
2) పట్టణ వేతన ఉపాధి 3) పట్టణ ప్రాంతాలలో మురికివాడలలో నివసించే వారికి గృహ నిర్మాణం 4) మహిళా సాధికారత
34. భారత్‌లో 2017 మానవాభివృద్ధి సూచీ స్కోరు కేరళ, గోవా తర్వాత కింది ఏ రాష్ట్రానికి ఎక్కువ? 1) గుజరాత్
2) ఒడిశా 3) త్రిపుర 4) హిమాచల్‌ప్రదేశ్
|
Latest News
సాంఘిక అవస్థాపన, ఉపాధి, మానవాభివృద్ధి ఆర్థిక సర్వే 2018-19
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment