ధరలు- ద్రవ్యోల్బణం (2018- 19 ఆర్థిక సర్వే)

గత ఐదు సంవత్సరాలుగా భారత ఆర్థిక వ్యవస్థ అధిక ద్రవ్యోల్బణం నుంచి అల్ప స్థాయి ద్రవ్యోల్బణం దిశగా పయనించింది.
వినియోగ ధరల సూచీ-ఉమ్మడి (CPI-C) గత ఐదు సంవత్సరాలుగా తగ్గుతుండడాన్ని గమనించవచ్చు. హెడ్‌లైన్ వినియోగధరల సూచీ ద్రవ్యోల్బణం 2017-18లో 3.6 శాతం నుంచి 2018-19లో 3.4 శాతానికి తగ్గింది. వినియోగ ఆహార ధరల సూచీ ఆధారిత ఆహార ద్రవ్యోల్బణం 2018-19లో అతి తక్కువగా 0.1 శాతంగా నమోదైంది. వినియోగ ధరల సూచీ- ఉమ్మడి (CPI-C) ప్రారంభమైన తర్వాత సగటు (CPI- C) హెడ్‌లైన్ ద్రవ్యోల్బణం 2018-19లో 3.4 శాతానికి తగ్గింది.
  • టోకు ధరల సూచీ ఆధారిత ఆహార ద్రవ్యోల్బణం గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో క్షీణించింది. 2018-19లో టోకు ధరల సూచీ ఆధారిత ఆహార ద్రవ్యోల్బణం 0.6 శాతంగా నమోదైంది. టోకు ధరల సూచీ ఆహార ద్రవ్యోల్బణం 2018-19లో తగ్గడానికి పప్పు ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పంచదార ధరల తగ్గుదల ప్రధాన కారణంగా నిలిచింది.
  • భారిత (weight), అంశాలను (Items) వినియోగ ధరల సూచీ - ఉమ్మడి (CPI-C) ఆధారంగా పరిశీలించినప్పుడు ఇతరాలు అధిక భారితం (weight) కలిగి ఉండగా, తర్వాత స్థానాల్లో హౌసింగ్, రవాణా, సమాచారం, cereals and products, ఆరోగ్యం, వస్త్రాలు, విద్య నిలిచాయి. వినియోగ ధరల సూచీ-ఉమ్మడి ఆధారిత కోర్ఇన్‌ఫ్లేషన్ నుంచి ఆహారం, ఇంధన గ్రూపులను మినహాయించగా వినియోగ ధరల సూచీ విలువ తెలుస్తుంది. CPI-C ఆధారిత కోర్‌ఇన్‌ఫ్లేషన్ 2017-18లో 4.6 శాతం కాగా, 2018-19లో 5.8 శాతానికి పెరిగి ఏప్రిల్ 2019 నాటికి 4.5 శాతానికి తగ్గింది.
  • అఖిల భారత స్థాయిలో (CPI-C) ద్రవ్యోల్బణానికి ప్రధానంగా miscellaneous గ్రూపు తర్వాత హౌసింగ్, ఇంధనం, లైట్ గ్రూపు లాంటి అంశాలు నిలిచాయి. CPI-C లో వస్తు ద్రవ్యోల్బణ భారితం 76.6 శాతం కాగా, సేవల ద్రవ్యోల్బణ భారితం 23.4 శాతంగా ఉంది.
  • వస్తు ద్రవ్యోల్బణంతో పోల్చినపుడు సేవల ద్రవ్యోల్బణం అధికంగా ఉండి, ఈ రెండింటి మధ్య తేడా పెరుగుతుండటాన్ని గమనించవచ్చు. వినియోగ ధరల సూచీ-ఉమ్మడిలో 40 అంశాలకు సంబంధించిన సేవల భారితం 23.37 శాతం. సేవలో హౌసింగ్ భారితం(10.07 శాతం) అధికం కాగా, తర్వాత స్థానాల్లో రవాణా, సమాచారం (4.59 శాతం), విద్య(3.51 శాతం), ఆరోగ్యం(1.82 శాతం) నిలిచాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ సేవల ద్రవ్యోల్బణంలో ప్రధాన అంశాలైన విద్య, ఆరోగ్య, రవాణా, సమాచారం ప్రాధాన్యత పొందాయి. పట్టణ ప్రాంతాలతో పోల్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యంలో ద్రవ్యోల్బణం ప్రధానమైంది.
  • గ్రామీణ ద్రవ్యోల్బణం తగ్గుదలకు ఆహార ద్రవ్యోల్బణం తగ్గుదల కారణమైంది. 2018 అక్టోబర్ నుంచి 2019 మార్చి వరకు ఆహార ద్రవ్యోల్బణం రుణాత్మకంగా నమోదైంది. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామీణ ద్రవ్యోల్బణాన్ని నిర్ణయించే ఆహార ప్రాధాన్యత తగ్గుతుంది. మరోవైపు గ్రామీణ ద్రవ్యోల్బణంలో సేవల పాత్ర పెరుగుదలను గమనించవచ్చు. గ్రామీణ ద్రవ్యోల్బణంలో సేవల వాటా 70 శాతంగా 2018-19లో నమోదైంది. పట్టణ ప్రాంత ద్రవ్యోల్బణానికి సేవలతోపాటు హౌసింగ్ ప్రధానాంశాలుగా నిలిచాయి.
  • అనేక రాష్ట్రాల్లో 2018-19లో ఇ్కఐ ద్రవ్యోల్బణంలో తగ్గుదలను గమనించవచ్చు. 23 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో CPI ద్రవ్యోల్బణం సగటు 4 శాతంలోపు నమోదైంది. ఆయా రాష్ట్రాల్లో CPI ద్రవ్యోల్బణం(-)1.9 శాతం నుంచి 8.9 శాతం మధ్య నమోదైంది. 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని ద్రవ్యోల్బణం (CPI) దేశ సగటు కంటే తక్కువ. 2018-19లో డామన్, డయులో ద్రవ్యోల్బణం అతి తక్కువగా నమోదుకాగా, తర్వాత స్థానాల్లో హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లు నిలిచాయి.
  • 2018-19లో 16 రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం (CPI) నాలుగు శాతం కంటే తక్కువగా నమోదైంది. మరోవైపు 9 రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 4 శాతంలోపు నమోదైంది.
  • వస్తు ధరలను ప్రచురించిన ప్రపంచ బ్యాంకు అభిప్రాయం ప్రకారం, 2018-19లో శక్తికి సంబంధించిన వస్తు ధరల్లో పెరుగుదల అధికంగా ఉంది. ప్రపంచ బ్యాంకు ఆహార ధరలు,food and agriculture organisation ఆహార ధరలు 2018-19లో ప్రతి ద్రవ్యోల్బణాన్ని చవిచూశాయి. టోకు ధరల సూచీ ఆధారిత ఆహార ద్రవ్యోల్బణంలోనూ 2018-19లో తగ్గుదల ఏర్పడింది.
  • ద్రవ్యోల్బణ నియంత్రణ కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన విధానపరమైన చర్య అయినందువల్ల ధరల స్థితిని తరచుగా సమీక్షిస్తుంది. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఆహార ధాన్యాల నిల్వ, బ్లాక్ మార్కెటింగ్‌ను నియంత్రించే విధంగా రాష్ర్ట ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వం సలహానిచ్చింది. నిత్యావసర వస్తువుల చట్టం 1955, prevention of black-marketing and maintenance of supplies of essential commodities Act 1980 ను సమర్థంగా అమలు పరచడానికి ఈ చర్య దోహదపడుతుంది.
  • ధరలు, ముఖ్య వస్తువుల లభ్యతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరచుగా సమీక్ష సమావేశాలను నిర్వహించింది.
  • పప్పు ధాన్యాలు, ఇతర పంటల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఆయా పంటలకు అధిక మద్ధతు ధరలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అగ్రి-హార్టికల్చర్ ఉత్పత్తులను సేకరించడానికి ధరల స్థిరీకరణ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పెరిగిన ఉల్లిపాయల ధరలను నియంత్రించడానికి నిల్వలను తక్కువ ధరల వద్ద మార్కెట్‌కు ప్రభుత్వం అందించింది. నిల్వ చేసిన పప్పు ధాన్యాలను; ధరల యాజమాన్యానికి సంబంధించి వ్యూహాత్మక మార్కెట్ జోక్యంలో భాగంగా వినియోగించింది.
మాదిరిప్రశ్నలు: 

No comments:

Post a Comment