ఆధునిక భౌతిక శాస్త్రం

ఆధునిక భౌతిక శాస్త్రం

ప్రపంచమంతా పదార్థంతో నిర్మితమైంది. పదార్థ ధర్మం అందులోని కణాలపై ఆధారపడి ఉంటుంది. కణాలు, పదార్థ ధర్మం గురించి వివరించడానికి ఈ ఆధునిక భౌతికశాస్త్రం దోహదపడుతుంది.
19వ శతాబ్దంలో ‘మాక్స్‌ప్లాంక్’ అనే భౌతిక శాస్త్రవేత్త ‘క్వాంటం సిద్ధాంతం’ ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం భౌతికశాస్త్ర విభాగంలో ఎన్నో అంశాలను వివరించడంతోపాటు నూతన ఆవిష్కరణలకు పునాది వేసింది. ఈ పాఠంపై అనేక పోటీ పరీక్షల్లో వస్తున్న ప్రశ్నలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన కొన్ని ముఖ్యాంశాలు.
  • ఆటమ్ అంటే గ్రీకు భాషలో విభజించడానికి వీలులేనిది అర్థం.
  • పరమాణువు అత్యంత సూక్ష్మమైన కణం అని డాల్టన్ అనే శాస్త్రవేత్త భావించారు. ఈయన 1808లో పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. డాల్టన్‌ను పరమాణు పితామహుడిగా అభివర్ణిస్తారు.
  • పరమాణువును విభజించవచ్చని అభిప్రాయపడి, పరమాణు నమూనాను పుచ్చకాయతో పోల్చినవారు - జేజే థామ్సన్
  • పుచ్చకాయలోని నల్లని గింజలు రుణావేశాన్ని కలిగి ఉంటాయి.
  • పరమాణువులో ఉండే ప్రాథమిక కణాలు - ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్
  • పరమాణు కేంద్రకంలో ఉండే కణాలు - ప్రోటాన్‌లు, న్యూట్రాన్‌లు
  • పరమాణు కేంద్రకంలో లేని కణం - ఎలక్ట్రాన్
  • పరమాణు కేంద్రకం ధనావేశాన్ని కలిగి ఉంటుంది.
  • ప్రాథమిక కణాల్లో ఆవేశ రహిత కణం - న్యూట్రాన్
  • ప్రాథమిక కణాల్లో ద్రవ్యరాశి స్వల్పంగా ఉండే కణం - ఎలక్ట్రాన్
  • పరమాణు పరిమాణాన్ని తెలిపేందుకు వాడే ప్రమాణంయ (ఆంగ్‌స్ట్రామ్). 
    1Å= 10–8 సెం.మీ. లేదా 10–10 మీ.
  • పరమాణు కేంద్రక వ్యాసార్ధాన్ని తెలిపే ప్రమాణం ఫెర్మి
    ఫెర్మి = 10–13 సెం.మీ. లేదా 10–15 మీ. 
    పొడవును కొలవడానికి ఉపయోగించే అతిచిన్న ప్రమాణమే ఫెర్మి. అమెరికాలో 1942, డిసెంబర్‌లో న్యూక్లియర్ రియాక్టర్‌ను తయారుచేసిన ఎన్‌రిక్ ఫెర్మి పేరు మీదనే ఈ ప్రమాణాన్ని తీసుకున్నారు.
  • పొడవును కొలవడానికి వాడే అతిపెద్ద ప్రమాణం పార్‌సెక్.
    పార్‌సెక్ = 3.26 కాంతి సంవత్సరం
  • పార్‌సెక్‌ను నక్షత్రాల మధ్య దూరం కొలవడానికి ఉపయోగిస్తారు.
  • కాంతి శూన్యంలో ఒక సంవత్సర కాలంలో ప్రయాణించిన దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు.
  • భూమి, నక్షత్రాల మధ్య దూరాన్ని కాంతి సంవత్సరాల్లో కొలుస్తారు.
  • కాంతి సంవత్సరం = 9.46×1012 కి.మీ.
                          = 9.46×10–15 మీ.
  • పరమాణు కేంద్రకానికి ధనావేశం ఉంటుందని రూథర్‌ఫర్డ్ α - కణ పరిక్షేపణ ప్రయోగంతో వివరించారు. ఈయణ్ని పరమాణు కేంద్రక పితామహుడు అని పేర్కొంటారు. పరమాణు నిర్మాణాన్ని గ్రహమండల నమూనాతో వివరించారు.
  • పరమాణు కేంద్రకంలో ఉండే కణాల మధ్య బలాలు - కూలుంబ్ బలాలు.
  • పరమాణు కేంద్రకానికి, దానిచుట్టూ తిరిగే ఎలక్ట్రాన్‌కు మధ్య పని చేసే బలాలు - స్థిర విద్యుదాకర్షణ బలాలు
  • పరమాణు కేంద్రకంలో ఉండే ప్రోటాన్‌ల సంఖ్యను పరమాణు సంఖ్య(z) అంటారు.
  • పరమాణు కేంద్రకంలో ఉండే కణాల ద్రవ్యరాశుల మొత్తాన్ని పరమాణు ద్రవ్యరాశి అంటారు.
  • కేంద్రకంలోని విడివిడి అనుఘటకాల మొత్తం ద్రవ్యరాశికి, కేంద్రకం మొత్తం ద్రవ్యరాశికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని ద్రవ్యరాశి లోపం(Dm) అంటారు.
  • ద్రవ్యరాశి లోపం అనేది కేంద్రక స్థిరత్వానికి కొలమానం.
  • జర్మనీ దేశానికి చెందిన శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ద్రవ్యరాశి శక్తి తుల్యతా నియమాన్ని ప్రతిపాదించారు.

ఐన్‌స్టీన్ ప్రతిపాదనలు
  • ద్రవ్యరాశి- శక్తి తుల్యతా నియమం E = mc2
  • సాపేక్షతా సిద్ధాంతం
  • కాంతి విద్యుత్ ఫలితం. ఈ ఫలితాన్ని నిరూపించినందుకు 1921లో ఐన్‌స్టీన్‌కు నోబెల్ బహుమతి లభించింది.
  • ఐన్‌స్టీన్‌ను మిలీనియం శాస్త్రవేత్తగా పిలుస్తారు.
  • కేంద్రకంలోని కణాలను బంధించడానికి అవసరమయ్యే శక్తిని బంధన శక్తి అంటారు. 
    కేంద్రక బంధన శక్తి (B.E.) = ద్రవ్యరాశి లోపం (m) × 931.5 mev
  • ఒకే పరమాణు సంఖ్య కలిగి విభిన్న ద్రవ్యరాశి సంఖ్యలు, విభిన్న న్యూట్రాన్‌ల సంఖ్యలు ఉండే మూలకపు పరమాణువులను ఐసోటోపులు అంటారు.
  • ఐసోటోపులను థామ్సన్, ఆస్టన్ కనుగొన్నారు.
  • మానవ శరీరంలోని రక్త సరఫరాలో ఉండే లోపాలు తెలుసుకోవడానికి, హృదయస్పందనను నియంత్రించడానికి వాడే ఐసోటోపు - రేడియో సోడియం
  • యంత్ర భాగాల అరుగుదల, మొక్కలు గ్రహించిన నీటిశాతం కనుగొనడానికి, మెదడులో ఏర్పడిన కణతి స్థానం గుర్తించడానికి వాడే ఐసోటోపు - రేడియో పాస్ఫరస్
  • కాన్సర్ గడ్డల చికిత్సలో వాడే ఐసోటోపు - రేడియో కోబాల్ట్ (కోబాల్ట్ ఉపయోగించి చేసే చికిత్సను కోబాల్ట్ థెరపీ అంటారు)
  • శిలాజాల వయస్సును కనుగొనడానికి ఉపయోగించే పద్ధతి - కార్బన్ డేటింగ్ (కార్బన్ డేటింగ్‌ను లిబ్బి అనే శాస్త్రవేత్త వివరించారు.)
  • భూమి, శిలల వయస్సును అంచనా వేయడానికి, ఉపయోగించే ఐసోటోపు - యురేనియం డేటింగ్
  • ఖనిజ లవణాలను కనుగొనడానికి ఉపయోగించే ఐసోటోపు - రేడియో సల్ఫర్
  • రేడియో ఐసోటోపుల ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం - భారత్
  • ఒకే ద్రవ్యరాశి సంఖ్య కలిగి ఉండి, విభిన్న పరమాణు సంఖ్యలు, విభిన్న న్యూట్రాన్ సంఖ్యలు ఉండే మూలక కేంద్రాన్ని ఐసోబార్ అంటారు.
  • ఒకే న్యూట్రాన్ సంఖ్య కలిగి, విభిన్న ద్రవ్యరాశి సంఖ్యలు, విభిన్న పరమాణు సంఖ్యలు ఉండే మూలక కేంద్రాన్ని ఐసోటోన్‌లు అంటారు.
  • ఒకే పరమాణు సంఖ్య, ఒకే ద్రవ్యరాశి సంఖ్య, ఒకే న్యూట్రాన్ సంఖ్య కలిగి, విభిన్న రేడియోధార్మికతలు, విభిన్న భౌతిక ధర్మాలు ఉండే మూలక కేంద్రాన్ని ఐసోమర్ అంటారు.
  • రేడియోధార్మికతను 1896లో ఫ్రెంచి భౌతిక శాస్త్రవేత్త ఎ.హెచ్. బెక్వరల్ వివరించారు.
  • రేడియోధార్మికత కేంద్రక జలాల స్వభావంపై ఆధారపడి ఉంటుంది.
  • ప్రకృతిలోని ప్రాథమిక బలాల్లో అత్యంత బలమైంది - బలమైన కేంద్రక బలం.
  • ప్రకృతిలో అత్యంత బలహీనమైన బలం - గురుత్వాకర్షణ బలం.
  • కేంద్రకంలోని బలాలను కూలుంబ్ వర్గీకరించారు.
  • ఆవేశానికి ప్రమాణం - కూలుంబ్
  • పరమాణు సంఖ్య అధికంగా ఉన్నా, స్థిరత్వ ధర్మాన్ని ప్రదర్శించే మూలకం - సీసం. (సీసం లాటిన్ పేరు ప్లంబం. కాబట్టి దీన్ని pb తో సూచిస్తారు)
  • ప్రొటీయం, డ్యుటీరియం, ట్రిటియంలను ఏర్పరిచే మూలకం - హైడ్రోజన్
  • హైడ్రోజన్‌ను హెన్రీ కావెండిష్ కనుగొన్నారు. ఇది అత్యంత తేలికైన మూలకం.
  • న్యూట్రాన్ రహిత ఏకైక మూలకం - హైడ్రోజన్
  • అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధి - గాయిటర్
  • పరమాణు సంఖ్య 83 కంటే ఎక్కువగా ఉండే మూలక కేంద్రకాలు అస్థిరత్వం వల్ల వికిరణాలను ఉద్గారం చేస్తూ స్వచ్ఛంద, విఘటనం చెందే దృగ్విషయాన్ని సహజ రేడియోధార్మికత అంటారు.
  • సహజ రేడియోధార్మికతను ఎ.హెచ్. బెక్వరల్ వివరించారు.
  • యురేనియం నుంచి విడుదలైన వికిరణాలను బెక్వరల్ కిరణాలు పిలుస్తారు.
  • DAEఅంటే.. Department of Atomic Energy
  • BRIT అంటే.. Board of Radiation and Isotope Technology

ఎలక్ట్రాన్
  • పరమాణువులోని మూల కణాల్లో మొదట కనుగొన్న కణం - ఎలక్ట్రాన్
  • దీనిని 1897లో కనుగొన్నారు.
  • ఎలక్ట్రాన్‌ను జె.జె.థామ్సన్ ప్రయోగపూర్వకంగా కనుగొన్నాడు.
  • రుణావేశ కణానికి జి.జె. స్టోనీ ఎలక్ట్రాన్ అని పేరు పెట్టాడు.
  • ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి, ప్రోటాన్ ద్రవ్యరాశిలో 1837వ వంతు ఉంటుంది.
  • ఎలక్ట్రాన్ ఆవేశం, ద్రవ్యరాశుల మధ్య నిష్పత్తిని ఎలక్ట్రాన్ విశిష్టావేశం అంటారు.
  • ఎలక్ట్రాన్ విశిష్టావేశం (e/m) (సెం.మీ) విలువ: 1.759×1011  col / kg
  • ఈ విలువను జేజే థామ్సన్ కనుగొన్నాడు.

న్యూట్రాన్
  • న్యూట్రాన్‌ను 1932లో జేమ్స్ ఛాడ్విక్ కనుగొన్నాడు.
  • న్యూట్రాన్‌కు కేంద్రకం బయట జీవితకాలం.. 13 నిమిషాలు.
  • న్యూట్రాన్ ద్రవ్యరాశి విలువ ప్రోటాన్ మూలకణ ద్రవ్యరాశికి దాదాపుగా సమానంగా ఉంటుంది.
  • కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియలో ఉపయోగపడే మూలకణం న్యూట్రాన్.

ప్రోటాన్
  • ప్రోటాన్‌ను మొదట గోల్డ్ స్టెయిన్ గుర్తించాడు.
  • 1920లో రూథర్‌ఫర్డ్ ప్రోటాన్‌ను ప్రయోగపూర్వకంగా కనుగొన్నాడు.
  • ప్రోటాన్ ద్రవ్యరాశి: 1.0073 a.m.u.
  • ప్రోటాన్ ఆవేశం +1.602×10-19  col
  • పరమాణు కేంద్రకం ఆవేశానికి కారణమైన మూలకం ప్రోటాన్.


మాదిరి ప్రశ్నలు

  1. సహజ రేడియోధార్మికతలో విడుదలయ్యే కిరణాలేవి?
    జవాబు: α, ß, γ
  2. α, ß, γ కిరణాలకు మరో పేరు?
    జవాబు: బెక్వరల్ కిరణాలు
  3. α-కణం విడుదలైనప్పుడు పరమాణు సంఖ్యలో తగ్గుదల? 
    జవాబు: 2 యూనిట్‌లు
  4. α-కణం విడుదలైనప్పుడు ద్రవ్యరాశి సంఖ్యలో తగ్గుదల?
    జవాబు: 4 యూనిట్‌లు
  5. α-కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త?
    జవాబు: రూథర్‌ఫర్డ్
  6. అత్యధిక అయనీకరణ సామర్థ్యం ఉన్న కణం?
    జవాబు: α-కణం
  7. అత్యధిక చొచ్చుకుపోయే సామర్థ్యం ఉన్న కణం?
    జవాబు: γ -కణం
  8. సహజ రేడియోధార్మికత ప్రక్రియలో ß కణం విడుదలైనప్పుడు పరమాణు సంఖ్యలో పెరుగుదల?
    జవాబు: 1 యూనిట్
  9. ß-కణాన్ని కనుగొన్నవారు?
    జవాబు: రూథర్‌ఫర్డ్
  10. γ-కణం విడుదలైనప్పుడు పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్యలో మార్పు? 
    జవాబు: ఉండదు
  11. γ-కణాన్ని కనుగొన్నవారు?
    జవాబు: విల్లార్డ్
  12. రేడియోధార్మిక శ్రేణులు ఎన్ని రకాలు?
    జవాబు: నాలుగు రకాలు. అవి..
    ఎ. థోరియం శ్రేణి లేదా4n శేణి
    బి. యురేనియం శ్రేణి లేదా 4n+2 శ్రేణి
    సి. ఆక్టీనియం శ్రేణి లేదా 4n+3 శ్రేణి
    డి. నెఫ్ట్యూనియం శ్రేణి లేదా 4n+1 శ్రేణి
  13. సహజ రేడియోధార్మిక శ్రేణుల్లో చిట్టచివరి మూలకం?
    జవాబు: సీసం (పరమాణు సంఖ్య = 82, లాటిన్ నామం ప్లంబం pb)
  14. రేడియోధార్మికతకు ప్రమాణాలేవి?
    జవాబు: బెక్వరల్, రూథర్‌ఫర్డ్, క్యూరి (రేడియోధార్మికతకు చిన్న ప్రమాణం Bq (బెక్వరల్))
    Bq = విఘటనం/ సెకన్ 
    రూథర్‌ఫర్డ్ (R.d) = 106  విఘటనం/సెకన్ 
    రూథర్‌ఫర్డ్ (R.d) = 106 Bq 
    క్యూరీ (C.I) = 3.7×1010  విఘటనం/సెకన్ 
                      = 3.7×1010  Bq
                      = 3.7×104  ×106  Bq
    క్యూరీ (C.I) = 3.7×104  R.d (R.d - రూథర్‌ఫర్డ్)
    రేడియోధార్మికతకు అతి పెద్ద ప్రమాణం క్యూరీ.
  15. ప్రకృతిలోని ప్రాథమిక బలాల్లో అత్యంత బలమైంది?
    జవాబు: బలమైన కేంద్రక బలం
  16. కేంద్రక బలాలను మీసాన్ సిద్ధాంతంతో వివరించిందెవరు?
    జవాబు: యుకావా
  17. పరమాణు కేంద్రకం పాల్గొనే చర్యలు?
    జవాబు: కేంద్రక విచ్ఛిత్తి, కేంద్రక సంలీనం
  18. కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియను వివరించిందెవరు?
    జవాబు: అట్టోహాన్, స్ట్రాస్‌మన్, లిసేవెయిట్‌నర్
  19. కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియ జరగడానికి ఉపయుక్తమైన కణం?
    జవాబు: ఉష్ణీయ న్యూట్రాన్
  20. ఉష్ణీయ న్యూట్రాన్ అంటే?
    జవాబు: తక్కువ వేగం ఉన్న న్యూట్రాన్ (ఉష్ణీయ న్యూట్రాన్ శక్తి 0.04 ev కంటే తక్కువగా ఉంటుంది)
  21. కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియలో విడుదలయ్యే న్యూట్రాన్లు ఏ శ్రేణిలో ఉంటాయి?
    జవాబు: గుణ శ్రేణి న్యూట్రాన్లు విడుదలయ్యే క్రమం: 3, 9, 27, 81, 243, 729....
  22. కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియ ఒక యురేనియం మూలకం అంతరించిపోయే వరకు జరుగుతుంది. ఈ చర్య పేరు?
    జవాబు: శృంఖల చర్య
  23. శృంఖల చర్య ఎన్ని రకాలుగా జరుతుంది?
    జవాబు: రెండు రకాలుగా. అవి..
    ఎ. అనియంత్రిత శృంఖల చర్య
    బి. నియంత్రిత శృంఖల చర్య
  24. అనియంత్రిత శృంఖల చర్య ఆధారంగా పనిచేసేది?
    జవాబు: ఆటమ్ బాంబు (అణు బాంబు)
  25. అణు బాంబు సృష్టికర్తలు?
    జవాబు: అట్టోహాన్, స్ట్రాస్‌మన్
  26. అణు బాంబును మొట్టమొదటిసారిగా ఏ దేశంపై ప్రయోగించారు?
    జవాబు: జపాన్
  27. అణు బాంబును మొదటిసారిగా ఏ నగరంపై విసిరారు?
    జవాబు: హిరోషిమా 
    ఆగస్టు 6న హిరోషిమాపై అణు బాంబువేశారు. కాబట్టి ఆగస్టు 6ను హిరోషిమా డే అని పిలుస్తారు. హిరోషిమాపై విసిరిన బాంబు పేరు లిటిల్ బాయ్.
  28. అణు బాంబును జపాన్‌లోని ‘నాగసాకి’ నగరంపై వేసిన రోజు?
    జవాబు: ఆగస్టు 9. అందుకే ఆగస్టు 9ని నాగసాకి డే అని పిలుస్తారు. నాగసాకి నగరంపై వేసిన బాంబు పేరు ఫ్యాట్‌మాన్.
  29. నియంత్రిత శృంఖల చర్య ఆధారంగా పనిచేసే పరికరం?
    జవాబు: న్యూక్లియర్ రియాక్టర్
  30. న్యూక్లియర్ రియాక్టర్‌ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
    జవాబు: ఎన్‌రిక్ ఫెర్మి
    అమెరికాకు చెందిన ఫెర్మి 1942 డిసెంబర్‌లో న్యూక్లియర్ రియాక్టర్‌ను రూపొందించాడు. ఇతణ్ని న్యూక్లియర్ రియాక్టర్ పితామహుడిగా పిలుస్తారు. ఫెర్మి గౌరవార్థం పరమాణు కేంద్రక పరిమాణాన్ని ఫెర్మిలలో కొలుస్తారు. పరమాణు కేంద్రక వ్యాసార్ధం విలువ = 10-15  m
  31. న్యూక్లియర్ రియాక్టర్‌లో ఎన్ని ప్రధాన భాగాలుంటాయి?
    జవాబు: 5
  32. న్యూక్లియర్‌లో ఉపయోగించే ఇంధన పదార్థాలు ఏవి?
    జవాబు: యురేనియం, థోరియం, ఫ్లూటోనియం.
    ఈ ఇంధన పదార్థాలను స్తూపాకార అల్యూమినియం గొట్టాల్లో నింపుతారు.
  33. న్యూక్లియర్ రియాక్టర్‌లోని మితకారి పదార్థం ప్రయోజనం?
    జవాబు: న్యూట్రాన్‌ల వేగం తగ్గించడం
  34. న్యూక్లియర్ రియాక్టర్‌లో మితకారిగా ఉపయోగించే పదార్థాలు?
    జవాబు: భారజలం, గ్రాఫైట్, బెరీలియం, పారఫిన్.
    భారజలానికి మరో పేరు డ్యూటీరియం ఆక్సైడ్. దీన్ని యురే అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
    • ప్రస్తుతం ఇండియాలో 9 భారజల కేంద్రాలు ఉన్నాయి.
    • భారతదేశంలో మొదట పంజాబ్‌లోని నంగాల్‌లో భారజల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
    • తెలంగాణ రాష్ర్టంలోని ఏకైక భారజల కేంద్రం ఖమ్మం జిల్లాలోని మణుగూరులో ఉంది.
    • గ్రాఫెట్‌ను లెడ్ పెన్సిళ్ల తయారీలో, భారీ యంత్రాల్లో కందెనగా ఉపయోగిస్తారు.
    • లెడ్ పెన్సిల్‌లో లెడ్ ఉండదు.
    • గ్రాఫెట్ కార్బన్ రూపాంతరం.
    • కార్బన్‌కు అలోహ ధర్మం ఉన్నప్పటికీ గ్రాఫైట్ లోహ ధర్మాన్ని పాటిస్తుంది.
    • కార్బన్‌ను ‘కింగ్ ఆఫ్ ది ఎలిమెంట్స్’ అని పిలుస్తారు.
  35. న్యూక్లియర్ రియాక్టర్‌లో వాడే నియంత్రణ కడ్డీల ప్రయోజనం?
    జవాబు: చర్యా వేగాన్ని తగ్గించడం
  36. న్యూక్లియర్ రియాక్టర్‌లో ఉపయోగించే నియంత్రణ కడ్డీలు?
    జవాబు: బోరాన్, కాడ్మియం
  37. న్యూక్లియర్ రియాక్టర్‌లో జరిగే కేంద్రక చర్యల వల్ల విడుదలయ్యే ఉష్ణాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ఉపయోగపడేది?
    జవాబు: శీతల కారిణి (శీతల కారిణిగా ఉపయోగించే పదార్థాలు భారజలం, ద్రవ సోడియం)
  38. కేంద్రక సంలీన చర్యలకు మరో పేరు?
    జవాబు: ఉష్ణకేంద్రక చర్యలు
  39. సూర్యుడు, నక్షత్రాల్లో నిరంతరం జరిగే చర్యలు?
    జవాబు: కేంద్రక సంలీన చర్యలు
  40. సూర్యుడి నుంచి లభించే విటమిన్? 
    జవాబు: విటమిన్-డి
  41. హైడ్రోజన్ బాంబు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది?
    జవాబు: అనియంత్రిత కేంద్రక సంలీన చర్య
    హైడ్రోజన్ బాంబును ఎడ్వర్డ్ టెల్లర్ తయారు చేశారు. ఇతడిని హైడ్రోజన్ బాంబు పితామహుడిగా పిలుస్తారు. మొదటి హైడ్రోజన్ బాంబు పేరు మైక్.
  42. కేంద్రక సంలీన చర్యలు భూమి, చంద్రుడిపై జరగకపోవడానికి కారణం?
    జవాబు: హైడ్రోజన్‌కు ఉన్న స్వల్ప పలాయన వేగం.
    వాయు కణాలు తప్పించుకొని పోయేందుకు కావల్సిన కనీస వేగాన్ని పలాయన వేగం (Ve) అంటారు.
    • భూమిపై హైడ్రోజన్ పలాయన వేగం - 11.2 కి.మీ./సెకన్
    • చంద్రుడిపై హైడ్రోజన్ పలాయన వేగం - 2.38 కి.మీ./సెకన్
    • సూర్యుడిపై హైడ్రోజన్ పలాయన వేగం - 620 కి.మీ./సెకన్
  43. కేంద్రక సంలీన చర్యలో పాల్గొనే మూలకం?
    జవాబు: హైడ్రోజన్
  44. కేంద్రక సంలీన చర్య జరిగిన తర్వాత ఏర్పడే మూలకం?
    జవాబు: హీలియం
  45. సూర్యుడికి మరో పేరు?
    జవాబు: హీలియో

No comments:

Post a Comment