జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 29న ప్రతిష్ఠాత్మక ‘ఫిట్ ఇండియా' కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టనుంది. నెహ్రూ యువ కేంద్ర సహకారంతో కేంద్ర క్రీడల శాఖ దీనికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. కేంద్ర క్రీడల శాఖ ప్రత్యేక సచివాలయాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందులో సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారి, ఆయనకు సహాయంగా 10 మంది యువ అధికారులు ఉంటారు. వీరంతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సమన్వయపరుస్తూ పనిచేస్తారు. ఏం సంవత్సరంలో దేనికి ప్రాధాన్యం?2019-20 : శారీరక దారుఢ్యం, మానసిక ఆరోగ్యం 2020-21: ఆరోగ్యకర ఆహారపు అలవాట్ల పెంపు 2021-22 : పర్యావరణ హిత జీవనశైలి 2022-23 : ఆరోగ్యకర జీవన విధానాలతో వ్యాధుల నిర్మూలన ప్రథమ వార్షిక ప్రణాళిక..తొలి సంవత్సరమైన 2019-20కి సంబంధించి ఆగస్టు నుంచి జులై వరకు 12 నెలల ప్రణాళికను క్రీడల శాఖ రూపొందించింది. నెలల వారీగా వివిధ అంశాలను ప్రోత్సహిస్తూ కార్యక్రమాలుంటాయి. 1. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో పరుగు, నడక, సైకిల్ ర్యాలీలు.ఆరోగ్యశిబిరాలు. 2. పాఠశాల నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు గ్రామాలు, పట్టణాలు, సమితులు, జిల్లాల స్థాయిల్లో దశలవారీగా క్రీడలు 3. ఫిట్‌నెస్ క్లబ్‌ల ఏర్పాటు. సామాజిక మాధ్యమాల్లో ప్రజలు తమ వ్యాయామ వివరాలను పంచుకోవడం. 4. వ్యాయామానికి గాను ఇరుగు పొరుగు ప్రాంతాల్లో స్థలాల ఏర్పాటు. వీటి అభివృద్ధికి స్వచ్ఛందసేవకులను ఆహ్వానించడం 5. బృందాలుగా నడవడం. నడక పోటీలు, మారథాన్ల నిర్వహణ 6. సైక్లింగ్‌కు ప్రాధాన్యం. 2 - 10 కి.మీ.ల సైక్లింగ్ పోటీలు. రాష్ట్రాల రాజధానుల్లో విరివిగా నిర్వహణ 7. స్థానిక, సంప్రదాయ క్రీడల్లో పోటీలు 8/9/10. సమితులు, జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో పాల్గొన్న క్రీడా ఔత్సాహికుల గుర్తింపు 11. దిల్లీలో నిర్వహించే జాతీయస్థాయి కార్యక్రమానికి గాను రాష్ట్ర స్థాయి ఎంపికలు పూర్తి 12. 2020 ఆగస్టు 29న జాతీయ స్థాయి కార్యక్రమం హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఆధ్వర్యంలో దేశీయ సాంకేతికతతో తయారు చేసిన చేతక్ హెలికాఫ్టర్ భారతీయ నౌకాదళంలో చేరింది. నావికాదళానికి అధునాతన హెలికాఫ్టర్లను తయారు చేసేందుకు 2017 ఆగస్టులో కుదిరిన ఒప్పందం మేరకు వీటిని రూపొందించారు. ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉగ్రవాదులుగా నిర్ధారించేలా చట్టానికి సవరణలు చేయడానికి ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రార్థనా స్థలాలు, చారిత్రక ప్రదేశాల వద్ద ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాయి. మరో అయిదు రాష్ట్రాలు పాక్షికంగా నిషేధం అమలు చేస్తున్నాయి. తెలంగాణ వీటిపై ఇంకా నిషేధం విధించలేదు. ఆంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వినియోగాన్ని పాక్షికంగా నిషేధించింది. ఈ మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) జాతీయ హరిత ధర్మాసనానికి యథార్థ నివేదికను సమర్పించింది.
|
No comments:
Post a Comment