బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ పార్టీ సీనియర్ నేత బోరిస్ జాన్సన్ బాధ్యతలు స్వీకరించారు. థెరిసా మే రాజీనామా లేఖను ఆమోదించిన రాణి ఎలిజబెత్-2 ప్రధాని పదవి చేపట్టాలంటూ జాన్సన్‌ను ఆహ్వానించారు. ఐరోపా సమాఖ్య నుంచి ఈ ఏడాది అక్టోబరు 31న బ్రిటన్ వైదొలుగుతుందని, అందులో ఎలాంటి సంకోచాలకు తావు లేదని జాన్సన్ ప్రకటించారు. వినియోగదారుల వ్యక్తిగత సమాచార గోప్యతలో నిబంధనలు ఉల్లంఘించినందుకు నియంత్రణ సంస్థ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఫేస్‌బుక్‌పై రూ.35,000 కోట్ల (5 బిలియన్ డాలర్ల) జరిమానాను విధించింది. కొత్త నిబంధనావళిని, మెరుగుపరచిన కార్పొరేట్ వ్యవస్థను కూడా ఫేస్‌బుక్ సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అమెరికాలో మరే కంపెనీకీ ఇంతమొత్తం జరిమానా విధించలేదు. మార్కెట్ల నియంత్రణ సంస్థ కూడా 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ.700 కోట్ల) జరిమానా విధించింది. వినియోగదారులు ఇచ్చే వ్యక్తిగత సమాచారంపై నియంత్రణ వారికే ఉండేలా చూస్తామని ఫేస్‌బుక్ పలుమార్లు హామీలు ఇచ్చినా, అమలుకు వచ్చేసరికి ఆ విధంగా జరగలేదని ఎఫ్‌టీసీ ఛైర్మన్ జో సైమన్స్ పేర్కొన్నారు.
|
No comments:
Post a Comment