కరెంట్ అఫైర్స్ జులై - 20

జులై - 20
కేంద్ర ప్రభుత్వం నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా రాజస్థాన్‌ మాజీ ఎంపీ, సుప్రీం కోర్టు న్యాయవాది జగదీప్‌ ధంఖడ్‌ నియమితులయ్యారు.ఈయన 1990-91లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఉపమంత్రిగా పని చేశారు. 2003లో కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా పనిచేస్తున్న కేసరినాథ్‌ త్రిపాఠీ పదవీకాలం జులై 24తో ముగియనుంది. » ఛత్తీస్‌గఢ్‌కు చెందిన భాజపా నేత రమేశ్‌ బైస్‌ త్రిపుర గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయన ఏడుసార్లు ఎంపీగా గెలుపొందారు. 5 సార్లు కేంద్రమంత్రిగా పని చేశారు. ప్రస్తుతం త్రిపుర గవర్నర్‌గా ఉన్న కప్తాన్‌సింగ్‌ సోలంకి పదవీకాలం జులై 27తో పూర్తవుతుంది. » బిహార్‌ గవర్నర్‌గా ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన భాజపా నాయకుడు ఫాగూ చౌహాన్‌ నియమితులయ్యారు. ఈయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. » ఇంటెలిజెన్స్‌ బ్యూరో విశ్రాంత ప్రత్యేక డైరెక్టర్‌ ఆర్‌ఎన్‌ రవి నాగాలాండ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయన కేరళ క్యాడర్‌కు చెందిన 1976 బ్యాచ్‌ మాజీ ఐపీఎస్‌ అధికారి. ఇప్పటి వరకు నాగాలాండ్‌ గవర్నర్‌గా ఉన్న పద్మనాభాచార్య అయిదేళ్ల పదవీకాలం జులై 19తో ముగిసింది. » మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ను ఉత్తర్‌ ప్రదేశ్‌కు బదిలీ చేశారు. అక్కడ పని చేస్తున్న రామ్‌నాయక్‌ పదవీకాలం ముగియడంతో (జులై 22) ఈ మార్పు చేశారు. » గత ఏడాది ఆగస్టు 23న బిహార్‌ గవర్నర్‌గా నియమితులైన లాల్‌జీ టాండన్‌ను మధ్యప్రదేశ్‌కు బదిలీ చేశారు.

No comments:

Post a Comment