గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
రాష్ట్రంలోని గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమనరీ పరీక్షల (స్క్రీనింగ్ టెస్టు) ఫలితాలు జూలై 25న విడుదలయ్యాయి.
అలాగే ఈ ఫలితాలతో పాటు తుది ‘కీ’ ని కుడా విడుదల చేశారు. గ్రూప్ 2 మెయిన్స్ కు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ తన వెబ్‌సైట్లో పొందుపరిచింది. మొత్తం 446 పోస్టుల భర్తీకి 150 మార్కులకు ఈ ప్రిలిమ్స్ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించింది. జనరల్ కటాఫ్ (ఓసీ) కింద 81.20 మార్కులను పరిగణనలోకి తీసుకొని అర్హులైన 6,195 మంది అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేసింది. వీరికి మెయిన్స్ పరీక్షను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించనున్నారు. జనరల్ కటాఫ్‌లో 5,540 మంది మెయిన్స్ కు ఎంపికయ్యారు. గత ప్రభుత్వం ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు ఏ నిష్పత్తిలో ఎంపిక చేయాలన్న నిర్ణయాధికారాన్ని ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ జీవో 5ను జారీ చేసిన నేపథ్యంలో 1:13.89 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక చేపట్టింది. ఈ నిష్పత్తిలో ఆయా కేటగిరీల వారీగా తక్కువ సంఖ్యలో అభ్యర్థులు ఎంపికైన విభాగాల్లో వారికి కటాఫ్ తగ్గించి మిగతా వారిని మెయిన్స్ కు ఎంపిక చేసింది.
ఇలా ఎంపికై న వారు కేవలం వారి రిజర్వుడ్ కేటగిరీ పోస్టులకు మాత్రమే పరిమితమవుతారు. మెయిన్స్ లో వారు అత్యధిక మార్కులతో మెరిట్‌లో నిలిచినా వారికి ఓపెన్ కేటగిరీ పోస్టులకు అర్హులు కారు. బీసీ-సీ కేటగిరీలో అభ్యర్థులు తక్కువ కావడంతో కటాఫ్‌ను 66.67 మార్కులకు తగ్గించి అదనంగా 83 మందిని ఎంపిక చేసింది. అలాగే బీసీ-ఈ కేటగిరీలో కటాఫ్‌ను 77.31కి తగ్గించి 77 మందిని, ఎస్సీ కేటగిరీలో కటాఫ్‌ను 78.37కు తగ్గించి 215 మందిని, ఎస్టీ కేటగిరీలో కటాఫ్‌ను 69.15కు కుదించి 195 మందిని, అంధుల కేటగిరీలో కటాఫ్ మార్కులు 60.99గా చేసి 38 మందిని, బధిరుల కేటగిరీలో కటాఫ్‌ను 60.99గా నిర్ణయించి 23 మందిని, ఆర్థో కేటగిరీలో 76.60 మార్కులను కటాఫ్‌గా పరిగణించి 24 మందిని ఎంపిక చేశారు. బీసీ-ఏ, బీసీ-బీ, బీసీ-డీ కేటగిరీలకు సంబంధించి అర్హులైన అభ్యర్థులుండటంతో అక్కడ ఎలాంటి సడలింపు లేకుండానే అభ్యర్థులు ఎంపికయ్యారు.
726 మందితో తిరస్కరణ జాబితా : గ్రూప్2 ప్రిలిమ్స్ పరీక్షలు రాసిన వారిలో వివిధ పొరపాట్లు చేసిన వారి ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించకుండా తిరస్కరణ జాబితాలో చేర్చింది. ట్యాంపరింగ్, బుక్‌లెట్ సిరీస్ నంబర్లు సరిగా గుర్తించకపోవడం, ఎక్కువ బుక్‌లెట్ సిరీస్ నంబర్లను గుర్తించడం, వైట్నర్‌ను వినియోగించడం తదితర కారణాలతో 726 మంది తిరస్కరణకు గురయ్యారు. వారి జాబితాను కూడా వెబ్‌సైట్లో పొందుపరచింది.
గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలకోసం క్లిక్ చేయండి
గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష తుది కీ కోసం క్లిక్ చేయండి

No comments:
Post a Comment