జులై - 19
|
దేశంలో బ్యాంకులను జాతీయీకరించి 50 ఏళ్లు పూర్తయ్యాయి. 1969 జులై 19న ప్రధాని ఇందిరాగాంధీ ప్రత్యేక ఆర్డినెన్స్‌తో (బ్యాంకింగ్ కంపెనీస్ - అక్విజిషన్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ అండర్‌టేకింగ్స్) 14 బ్యాంకులను జాతీయం చేశారు. మలి దశ జాతీయీకరణ 1980లో జరిగింది. 1955లో ఇంపీరియల్ బ్యాంక్‌ను భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ సొంతం చేసుకుని, దాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)గా మార్చాయి. 1969 నాటికి ఇది మాత్రమే ప్రభుత్వ రంగ బ్యాంక్. మిగిలినవన్నీ ప్రైవేట్ బ్యాంకులే. 1947-55 మధ్య కాలంలో 361 బ్యాంకులు మూతపడటంతో ఎంతోమంది డిపాజిటర్లు తమ డబ్బును పోగొట్టుకున్నారు. స్వాతంత్య్రం వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు గడుస్తున్నా ఆర్థికాభివృద్ధి ఆశించిన రీతిలో లేదు. వ్యవసాయ రంగానికి అప్పులు దొరకని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయీకరణ నిర్ణయం తీసుకున్నారు. 2003 తర్వాత దేశంలో అమలైన ఉదారవాద ఆర్థిక విధానాలు, ప్రైవేటీకరణతో కొత్త వ్యాపారాలకు బాటలు వేశాయి. ఈ సమయంలో బ్యాంకింగ్ రంగం అప్రమత్తంగా లేదు. దీర్ఘకాలంలో ఎదురయ్యే సమస్యలపై అవగాహన లేక పోటీలు పడి వివిధ రంగాల్లో ప్రాజెక్టులకు, కంపెనీలకు పరిమితికి మించి రుణాలు మంజూరు చేశాయి. ముఖ్యంగా విద్యుత్, టెలికామ్, రోడ్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఇచ్చిన రుణాలు మొండి బాకీలుగా మారిపోయాయి. ఈ పరిస్థితులు 2010 నాటికి బ్యాంకింగ్ రంగంలో మలిదశ సంక్షోభానికి దారి తీశాయి. గత ఏడాది మార్చి నాటికి దేశంలో మొత్తం బ్యాంకింగ్ రంగానికి రూ.13 లక్షల కోట్ల వరకు నిరర్ధక ఆస్థులు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా రూ.10 లక్షల కోట్లు. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం రెండు, మూడు విడతలుగా మూలధనాన్ని సమకూర్చాల్సి వచ్చింది. ఇలా గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాల పాలై, మూలధనం కోసం ప్రభుత్వంపై ఆధారపడే పరిస్థితి నెలకొంది.
» 1969 నాటికి దేశంలో 8262 బ్యాంక్ శాఖలు ఉన్నాయి » 1984 నాటికి వాటి సంఖ్య 45,332కు పెరిగింది. » జాతీయీకరణ జరిగేనాటికి బ్యాంక్ శాఖల్లో గ్రామీణ వాటా: 22.4శాతం » 1984 నాటికి బ్యాంక్ శాఖల్లో గ్రామీణ వాటా: 56 శాతం » 1975 నాటికి గ్రామీణ వాటా: 36.3 శాతం. » 2000 నాటికి బ్యాంక్ శాఖల సంఖ్య 65,521 1969లో జాతీయం చేసిన బ్యాంకులు1) అలహాబాద్ బ్యాంక్ 2) బ్యాంక్ ఆఫ్ బరోడా 3) బ్యాంక్ ఆఫ్ ఇండియా 4) బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 5) కెనరా బ్యాంక్ 6) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7) దేనా బ్యాంక్ 8) ఇండియన్ బ్యాంక్ 9) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10) సిండికేట్ బ్యాంక్ 11) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 12) యుకో బ్యాంక్ 13) పంజాబ్ నేషనల్ బ్యాంక్ 14) యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మలి దశలో (1980) జాతీయీకరణ చేసిన బ్యాంకులు1) ఆంధ్రా బ్యాంక్ 2) పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ 3) న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4) విజయా బ్యాంక్ 5) కార్పొరేషన్ బ్యాంక్ 6) ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ » 1993లో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాను పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనం చేశారు. గత ఏడాది విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనమయ్యాయి. దీంతో ఎస్‌బీఐని మినహాయిస్తే మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 17కు పరిమితమైంది. |
Latest News
కరెంట్ అఫైర్స్ జులై - 19
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment