జులై - 18
|
సాంకేతిక సమస్యలతో జులై 15న నిలిచిపోయిన చంద్రయాన్-2 ప్రయోగాన్ని జులై 22న నిర్వహించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్-2 ప్రయోగానికి 56 నిమిషాల ముందు క్రయోజెనిక్ ఇంజిన్ ట్యాంకర్లోని ప్రెజర్ బాటిల్లో లీకేజీ ఏర్పడటంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు.
అయోధ్యలోని రామ జన్మభూమి - బాబ్రీ మసీదు భూవివాద సమస్య పరిష్కారంలో జులై 31 వరకు మధ్యవర్తిత్వమే కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అయోధ్య కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం దీనికి సంబంధించిన నివేదికను ఆగస్టు 1న ఇవ్వాలని సూచించింది. దాన్ని పరిశీలించిన అనంతరం తదుపరి కార్యాచరణపై ఆగస్టు 2న నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అయోధ్య వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి అవకాశముంటే సూచించాలని ఈ ఏడాది మార్చి 8న సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఎఫ్.ఎం.ఖలీఫుల్లా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, ప్రముఖ సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచు ఈ కమిటీలో సభ్యులు. అయితే మధ్యవర్తిత్వ ప్రక్రియలో పురోగతి చోటుచేసుకోవడం లేదని, దాన్ని రద్దు చేసి న్యాయస్థానమే విచారణ జరపాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో ఇటీవల పిటిషన్ దాఖలైంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం జులై 11న విచారణ జరిí, మధ్యవర్తిత్వ ప్రక్రియలో ఇప్పటి వరకు చోటుచేసుకున్న పురోగతిని తెలియజేస్తూ జులై 18లోగా తమకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మధ్యవర్తిత్వ కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించిన ధర్మాసనం మరికొద్ది రోజులు మధ్యవర్తిత్వాన్ని కొనసాగించాలని తీర్పు ఇచ్చింది.
|
Latest News
కరెంట్ అఫైర్స్ జులై - 18
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment