కరెంట్ అఫైర్స్ జులై - 17

జులై - 17
రాష్ట్రీయం (టీఎస్‌)రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత వివరాలను కేంద్ర మానవ వనరుల శాఖ వెల్లడించింది. ప్రాథమికోన్నతలో 32 శాతం, ఉన్నత పాఠశాలల్లో 8 శాతం సబ్జెక్టు ఉపాధ్యాయులు లేరని తెలిపింది. 2,379 పాఠశాలల్లో బాలురకు, 1878 పాఠశాలల్లో బాలికలకు శౌచాలయాలు లేవు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ ప్రాథమిక పాఠశాలల్లో 2018-19లో విద్యార్థుల సంఖ్య ఆరు శాతం తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2017-18తో పోల్చుకుంటే 2018-19లో గతేడాది ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 1.19 లక్షల మంది విద్యార్థులు పెరిగారని ప్రకటించింది. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 7376 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో 2,671, ఉన్నత పాఠశాలల్లో 1268 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక సమర్పించిందిహైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధనా నిర్వహణ సంస్థ (నార్మ్‌)కు 3 జాతీయస్థాయి అవార్డులు లభించాయి. భారత వ్యవసాయ పరిశోధనా మండలి వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేశారు. బెస్ట్‌ సైంటిఫిక్‌ పబ్లికేషన్స్‌ ఇన్‌ హిందీలో మొదటి బహుమతి దక్కింది. పరిపాలన ఉద్యోగుల నైపుణ్యం విభాగంలో రుక్మిణి అమ్మాళ్, సరోజ అవార్డులకు ఎంపికయ్యారు. ఐసీఏఆర్‌ కార్యదర్శి సుశికుమార్, మాజీ డైరెక్టర్‌ జనరల్‌ డా.ప్రణబ్‌సింగ్, డా.త్రిలోచన్‌ మహాపాత్ర అవార్డులను ప్రదానం చేశారు.

No comments:

Post a Comment