జులై - 17
|
భారత స్ప్రింటర్ హిమదాస్ 15 రోజుల వ్యవధిలో నాలుగో స్వర్ణం సాధించింది. చెక్ రిపబ్లిక్‌లోని తబోర్‌లో అథ్లెటిక్స్ మీట్‌లో ఆమె 200 మీ. స్వర్ణం గెలుచుకుంది. భారత్‌కే చెందిన విస్మయ రజతం సాధించింది. జులై 2 నుంచి హిమకి ఇది నాలుగో పసిడి పతకం. జులై 2, 7న పోలెండ్‌లో జరిగిన పొజ్నామ్, కుంటో అథ్లెటిక్స్ మీట్లలో 200 మీ. విజేతగా నిలిచిన ఆమె జులై 13న క్లద్నో (చెక్) అథ్లెటిక్స్ మీట్‌లోనూ గెలిచింది. ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ ప్రపంచకప్ షూటింగ్‌లో 25 మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్‌లో అనీష్ భన్వాలా స్వర్ణం గెలిచాడు. 584 స్కోరుతో అర్హత పోరులో అగ్రస్థానం సాధించిన అనీష్ ఫైనల్లో 29 స్కోర్ చేశాడు. మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్‌లో హైదరాబాద్‌కు చెందిన 14 ఏళ్ల ఈషా సింగ్ రజతం గెలుచుకుంది. ఆమె 236.6 పాయింట్లు స్కోర్ చేసింది. భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి టోక్యో ఒలింపిక్స్ వేదిక పరీక్ష పోటీలో రజతం నెగ్గింది. క్వాలిఫయింగ్ దశలో నాలుగో స్థానంలో నిలిచిన దీపిక తుది పోరులో కొరియాకు చెందిన ఆన్ సాన్ చేతిలో ఓడిపోయింది.
|
Latest News
కరెంట్ అఫైర్స్ జులై - 17
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment