కరెంట్ అఫైర్స్ జులై - 17

జులై - 17
కంప్యూటర్లను మనిషి మెదడుతో అనుసంధానించి అతడి మేధో సామర్థ్యాన్ని పెంచే దిశగా తాము చేపట్టిన ప్రయోగాల్లో పురోగతి చోటుచేసుకుందని ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో తమ ‘న్యూరోలింక్‌' అంకుర పరిశ్రమ వివరాలు ఆయన వెల్లడించారు. మానవ మెదడును కంప్యూటర్లతో అనుసంధానమే లక్ష్యంగా ఈ సంస్థను ఏర్పాటుచేసి, రహస్య పరిశోధనలు జరిపినట్లు తెలిపారు. తాజా కార్యక్రమంలో న్యూరోలింక్‌ తాము రూపొందించిన సూక్ష్మ సెన్సర్‌ (చిప్‌)ను ఆవిష్కరించింది. వెంట్రుకంత మందమున్న పోగులతో కూడిన ఈ సెన్సర్‌ను రోబోటిక్‌ టెక్నాలజీ సాయంతో చిన్న కోత ద్వారా మెదడులో ప్రవేశపెడతారు. చెవిలో పెట్టుకునే మరో పరికరంతో ఈ చిప్‌ వైర్‌లెస్‌ పరిజ్ఞానం ద్వారా అనుసంధానమవుతుంది. చెవిలో ఉండే పరికరం స్మార్ట్‌ఫోన్‌లోని యాప్‌కి సమాచారం చేరవేస్తుంది. ఆలోచనల ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను నియంత్రించగల సామర్థ్యాన్ని ఆవిష్కరించే దిశగా ప్రస్తుతం తాము పనిచేస్తున్నామని మస్క్‌ తెలిపారు. తాము రూపొందించిన చిప్‌ను వచ్చే ఏడాది చివరికల్లా మానవుల్లో ప్రవేశపెట్టి పరిశోధనలు జరుపుతామని ఆయన చెప్పారు.

No comments:

Post a Comment