జులై - 17
|
అమెజాన్ సీఈవో జెఫ్‌బెజోస్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడి స్థానాన్ని పదిల పరుచుకున్నారు. ఇటీవల బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ విడుదల చేసిన జాబితాలో ఈయన తొలిస్థానంలో నిలిచారు. ఎల్వీఎంహెచ్ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఇప్పటి వరకూ రెండో స్థానంలో కొనసాగుతున్న మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను వెనక్కి నెట్టారు. ఆర్నాల్డ్ మొత్తం ఆస్తుల విలువ 108 బిలియన్ డాలర్లు. గేట్స్ ఆస్తుల మొత్తం 107 బిలియన్ డాలర్లు. అమెజాన్ చీఫ్ బెజోస్ తన భార్య మెకంజీ బెజోస్‌కు భారీగా భరణం ఇచ్చినా 125 బిలియన్ డాలర్లతో తొలిస్థానంలో నిలిచారు. బిల్‌గేట్స్ తన సంపదలో 35 బిలియన్ డాలర్లను గేట్స్ అండ్ మిలిందా సంస్థకు విరాళంగా ఇవ్వడంతో ఆయన సంపద 107 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆర్నాల్డ్ 2019లో ఇప్పటి వరకు 39 బిలియన్ డాలర్లు సంపాదించారు. ఈ జాబితాలో పేర్కొన్న టాప్ 500 మంది ధనికుల్లో ఒక ఏడాదిలో అత్యధికంగా సంపాదించిన వారి జాబితాలో ఆయన తొలిస్థానంలో నిలిచారు.» అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్‌తో విడాకులు తీసుకుని భరణం పొందిన మెకంజీ ధనిక మహిళల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు. ఆమె నికర ఆస్తుల విలువ 40.3 బిలియన్ డాలర్లు. మొత్తంగా తీసుకుంటే ఈమె 22వ స్థానంలో ఉన్నారు. ఇక ప్రపంచంలో అత్యంత ధనవంతురాలిగా ఫ్రాంకోయిస్ నిలిచారు.» రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ భారత్‌లో అత్యంత ధనికుడిగా తన స్థానాన్ని కాపాడుకున్నారు. ఆయన ఆస్తుల విలువ 51.8 బిలియన్ డాలర్లు. ప్రపంచవ్యాప్తంగా 13వ స్థానంలో నిలిచారు. విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ 20.5 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఈయన 48వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. హెచ్‌సీఎల్ టెక్ శివ నాడార్ 92 స్థానంలో, కొటక్ మహీంద్రా ఎండీ ఉదయ్ కొటక్ 96వ స్థానంలో నిలిచారు. కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం కాలపరిమితిని పెంచింది. నవంబరు 30 వరకు అంటే నెల రోజుల పాటు గడువు పొడిగించింది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 15వ ఆర్థిక సంఘం లక్ష్యాలు, నిబంధనల్లో మార్పులను ఆమోదించింది. భారత అంతర్గత భద్రత, రక్షణ కోసం పక్కాగా, సురక్షితమైన, మురిగిపోని విధంగా నిధుల కేటాయింపునకు మార్గాలు అన్వేషించాలని ఎన్‌కే సింగ్ ఆధ్వర్యంలోని ఆర్థిక సంఘాన్ని ఆదేశించింది. వాల్‌మార్ట్ ఇండియా తన మూడో అతిపెద్ద క్యాష్ అండ్ క్యారీ స్టోర్ ‘బెస్ట్ ప్రైస్ మోడర్న్ హోల్‌సేల్ స్టోర్'ను తెలంగాణలోని నిజామాబాద్‌లో ప్రారంభించింది. జిల్లా కేంద్రంలోని బోర్గాం(పి) వద్ద ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను సంస్థ సీఈఓ క్రిష్ అయ్యర్ ప్రారంభించారు. దాదాపు 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఇప్పటికే హైదరాబాద్, కరీంనగర్‌లలో స్టోర్లు ఉన్నాయి. నాలుగోదాన్ని ఈ ఏడాదిలోనే వరంగల్‌లో ప్రారంభించనున్నారు. నిజామాబాద్ కేంద్రం భారత్‌లో 26వది.
|
|
|
No comments:
Post a Comment