జులై - 17
|
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్‌ఐడీ) సంస్థలకు జాతీయ ప్రాధాన్యమున్న విద్యా సంస్థల హోదా కల్పించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సంస్థలో ప్రిన్సిపల్ డిజైనర్ హోదాలో పనిచేసేవారికి ప్రొఫెసర్ సమానస్థాయి కల్పిస్తూ సవరణ చేశారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ఏపీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్‌ఐడీకి జాతీయ ప్రాధాన్యమున్న విద్యాసంస్థ హోదా దక్కనుంది. » నిరుపయోగ చట్టాలను తొలగించే కార్యక్రమంలో భాగంగా 58 చట్టాల రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. » 3డీ బయోప్రింటింగ్ సహా పలు రంగాల్లో భారత్, అమెరికాల మధ్య అంతర సంస్థ ఒప్పందాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ఉగ్రదాడులపై దర్యాప్తు విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు మరింత శక్తి సమకూర్చడానికి వీలు కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే లోక్‌సభ ఆమోదం పొందిన ఎన్‌ఐఏ (సవరణ) బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. భారతీయులపై, విదేశాల్లోని భారతీయ ఆస్తులపై ఉగ్రదాడులు జరిగితే దర్యాప్తు జరిపే అధికారం ఎన్‌ఐఏకు సమకూరింది.
అత్యాధునిక ‘నావల్ ఎంఆర్‌శామ్' (ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే మధ్యశ్రేణి క్షిపణి) వ్యవస్థలు త్వరలో భారత రక్షణ దళంలో చేరనున్నాయి. భారత నౌకాదళం, మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్‌కు వీటిని సరఫరా చేయడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వరంగ సంస్థ ‘ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్' (ఐఏఐ) ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ.345 కోట్లు. భారత గగనతల రక్షణ వ్యవస్థ (ఏడీఎస్)ను బలోపేతం చేసేందుకు నావల్ ఎంఆర్‌శామ్ వ్యవస్థలు ఉపకరిస్తాయి.తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్, శాస్త్రీయ నృత్యకళాకారిణి సోనాల్ మాన్‌సింగ్, నృత్యకారులు జతిన్ గోస్వామి, శాస్త్రవేత్త కె.కల్యాణసుందరం పిళ్లై సంగీత నాటక అకాడమీ ఫెలోలుగా ఎంపికయ్యారు. 2018 సంవత్సరానికి అకాడమీ జనరల్ కౌన్సిల్ విభిన్న రంగాలకు చెందిన 44 మంది కళాకారులను పురస్కారాలకు ఎంపిక చేసింది. దివాన్‌సింగ్ బజేలి, పురు దధీచ్‌లు ఓవరాల్ కంట్రిబ్యూషన్/ స్కాలర్‌షిప్ విభాగంలో ఎంపికయ్యారు. ఈ పురస్కారాలను ఓ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి అందజేయనున్నారు. అకాడమీ ఫెలో గౌరవానికి రూ.3 లక్షల నగదు బహుమతి, పురస్కార విజేతలకు రూ.లక్ష బహుమతి, తామ్రపత్రం, అంగవస్త్రం అందజేస్తారు. ఈ పురస్కార విజేతల్లో ముగ్గురు తెలుగువారు ఉన్నారు. సంగీతంలో విజయవాడకు చెందిన మల్లాది సూరిబాబు, కూచిపూడి నృత్య విభాగంలో కూచిపూడికి చెందిన పసుమర్తి రామలింగశాస్త్రి, హరికథ విభాగంలో గుంటూరుకు చెందిన కోట సచ్చిదానందశాస్త్రి ఎంపికయ్యారు.దేశంలో వైద్యవిద్య పర్యవేక్షణ కోసం ‘జాతీయ వైద్యకమిషన్' (ఎన్‌ఎంసీ) పేరుతో స్వయంప్రతిపత్తి సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ‘ఎన్‌ఎంసీ-2019 బిల్లు'కి ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న భారత వైద్య మండలి (ఎంసీఐ) చట్టం-1956 స్థానంలో ఈ వ్యవస్థ ఏర్పాటవుతుంది. » నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్స్ట్) పేరుతో ఎంబీబీఎస్ ఆఖరి సంవత్సరం విద్యార్థులకు నిర్వహించే ఉమ్మడి పరీక్ష పీజీ వైద్యవిద్య కోర్సులకు ప్రవేశ పరీక్షగా, డాక్టర్‌గా ప్రాక్టీస్ చేసుకునేందుకు అర్హత పరీక్షగా, విదేశాల్లో వైద్యవిద్య చదివి వచ్చిన విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్ట్‌గా పని చేస్తుంది. » ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న నీట్, కామన్ కౌన్సెలింగ్, ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యార్థులు రాసే నెక్స్ట్ పరీక్షలు ఎయిమ్స్, జిప్‌మర్ లాంటి అన్ని జాతీయ ప్రాధాన్యమున్న వైద్యవిద్యా సంస్థలకూ వర్తిస్తాయి. » ప్రైవేటు కళాశాలలు, డీమ్డ్ యూనివర్సిటీల్లోని 50% సీట్ల ఫీజులు, ఇతర రుసుములను మాత్రమే కమిషన్ నియంత్రిస్తుంది. » వైద్య కళాశాలల్లోని నాణ్యత ప్రమాణాలను మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు (ఎంఏఆర్‌బీ) మదింపు చేస్తుంది. అన్ని వైద్య కళాశాలలకు ర్యాంకులు ఇస్తుంది. » ఎన్‌ఎంసీలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు, పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు, మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు, ఎథికల్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు పేరుతో నాలుగు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తారు. » రాష్ట్రస్థాయి వైద్య మండళ్లకు ఎంపికయ్యే సభ్యులకు మెడికల్ అడ్వయిజరీ కౌన్సిల్, కమిషన్‌లో తగిన ప్రాతినిధ్యం కల్పిస్తారు. » ఇద్దరు పార్ట్‌టైమ్ సభ్యులతో కలిసి ఒక్కో పాలకమండలిలో అయిదుగురు సభ్యులుంటారు. » యూజీ, పీజీ వైద్యవిద్య బోర్డులు నిర్ధరించిన ప్రమాణాల మేరకు కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, పీజీ కోర్సుల ప్రారంభం, సీట్ల పెంపునకు ఎంఏఆర్‌బీ అనుమతులు ఇస్తుంది. దేశంలోని భారీ జలాశయాల భద్రత కోసం ఉద్దేశించిన డ్యాం సేఫ్టీ బిల్లుకు కేంద్రమంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దేశంలోని నిర్దేశిత డ్యాంల భద్రతకు ఒకేతరహా భద్రతా చర్యలు తీసుకోవడానికి వీలుగా ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొస్తోంది. 5600 ఆనకట్టలకు ఈ కొత్త బిల్లు వర్తిస్తుంది. జాతీయ స్థాయిలో నియంత్రణ సంస్థలా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేస్తారు. డ్యాంల భద్రతకు సంబంధించిన విధానాలు, మార్గదర్శకాలు, ప్రమాణాలను అమలు చేసే బాధ్యత దీనికి అప్పగిస్తారు. రాష్ట్రంలోని అన్ని డ్యాంలపై నిఘా, తనిఖీ, నిర్వహణ, ఆపరేషన్ వంటి కార్యక్రమాల పర్యవేక్షణ కోసం రాష్ట్రాల స్థాయిలో ఒక డ్యాం సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేస్తారు.
|
Latest News
కరెంట్ అఫైర్స్ జులై - 17
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment