కరెంట్ అఫైర్స్ జులై - 17

జులై - 17
కమ్యూనిస్ట్‌ సిద్ధాంతకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు జాలాది వెంకటేశ్వరరావు (102) హైదరాబాద్‌లో కన్నుమూశారు. జాలాది స్వగ్రామం కృష్ణా జిల్లాలోని ఇందుపల్లి. 1935లో కమ్యూనిస్ట్‌ యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య పిలుపుతో పార్టీలో చేరి బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటంలో పాల్గొన్నారు. అనంతరం కృష్ణా జిల్లా కమిటీ సభ్యుడిగా నియమితులై జిల్లాలో కమ్యూనిస్ట్‌ ఉద్యమానికి బలమైన పునాదులు వేశారు. ఆ తర్వాత జిల్లా కార్యదర్శిస్థాయికి చేరుకున్నారు. స్వాతంత్రోద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్న జాలాది చాలాకాలం పాటు అజ్ఞాత జీవనం గడిపారు. జీవితాంతం గాంధేయవాదిగా ఉంటూ నిరాడంబర జీవనం గడిపారు. నాలుగేళ్ల క్రితమే ఆయన ఆత్మకథ ‘జ్ఞాపకాల తెరలు' విడుదలైంది.

No comments:

Post a Comment