జులై - 16
|
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్‌గా ఒడిశాకు చెందిన భాజపా నేత, మాజీ మంత్రి బిశ్వభూషణ్ హరిచందన్‌ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీచేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం ఇప్పటివరకూ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్ కొనసాగుతూ వచ్చారు. 85 ఏళ్ల బిశ్వభూషణ్ హరిచందన్ 1971లో భారతీయ జన్‌సంఘ్‌లో చేరి ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో మీసా చట్టం కింద జైలుకెళ్లారు. భాజపా ఏర్పాటయ్యాక అందులో చేరి 1980 నుంచి 1988 వరకు ఒడిశా భాజపా అధ్యక్షుడిగా పనిచేశారు. 1988లో జనతాపార్టీలో చేరి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. 1996లో తిరిగి భాజపాలో చేరారు. న్యాయ విద్యలో పట్టభద్రుడైన ఈయన భాజపా-బీజేడీ సంకీర్ణ ప్రభుత్వంలో తొమ్మిదేళ్లు (రెండు పర్యాయాలు) మంత్రిగా సేవలందించారు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రచయిత అయిన హరిచందన్ శేష ఝలక్, అస్తాశిఖా, రాణాప్రతాప్, మానసి, మారు బతాస్ తదితర పుస్తకాలు రచించారు.
ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా మధ్యప్రదేశ్ భాజపా నేత అనసూయ ఉయికె నియమితులయ్యారు. ఆ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న బలరాందాస్ టాండన్ 2018 ఆగస్టు 14న కన్నుమూయడంతో మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. గత 11 నెలలుగా ఆమె ఇరురాష్ట్రాల గవర్నర్‌గా వ్యవహరిస్తూ వచ్చారు.. |
Latest News
కరెంట్ అఫైర్స్ జులై - 16
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment