కరెంట్ అఫైర్స్ జులై - 16

జులై - 16
గత ఆర్థిక సంవత్సరం (2018-19) ముగిసే నాటికి వాణిజ్య బ్యాంకుల మొత్తం మొండి బకాయిలు రూ.1.02 లక్షల కోట్లు తగ్గి రూ.9.34 లక్షల కోట్లకు చేరాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 2018 మార్చి నాటికి రూ.10.36 లక్షల కోట్లుగా ఉన్న మొండి బకాయిలు 2019 మార్చికి రూ.9.34 లక్షల కోట్లకు చేరాయని వివరించారు. 2018-19లో రూ.లక్ష లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో కూడిన మోసాలు అత్యధికంగా ఐసీఐసీఐ బ్యాంక్‌లో (374) చోటుచేసుకున్నాయి. తర్వాతి స్థానాల్లో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ (338), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (273), ఎస్‌బీఐ (273), యాక్సిస్‌ బ్యాంక్‌ (195), అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌ (190)లు ఉన్నాయి. మోసాల నివారణకు రూ.50 కోట్ల పైబడిన ఎన్‌పీఏ ఖాతాల పరిశీలన, క్రిమినల్‌ చర్యలు చేపట్టడం, కేంద్ర మోసాల రిజిస్ట్రీ ఏర్పాటు, లుకౌట్‌ సర్క్యులర్‌లు జారీ చేయమని కోరే అధికారం పీఎస్‌బీ అధిపతులకు ఇవ్వడం లాంటి చర్యలు తీసుకున్నట్లు సీతారామన్‌ చెప్పారు. గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో వాణిజ్య బ్యాంకులు రికార్డు స్థాయిలో రూ.4.01 లక్షల కోట్లు రికవరీ చేశాయని, ఒక్క 2018-19లోనే ఈ మొత్తం రూ.1,56,746 కోట్లని ఆమె పేర్కొన్నారు.

No comments:

Post a Comment