ఒక ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ రికార్డు సృష్టించాడు. ఈ ప్రపంచకప్‌లో 550 పరుగులు చేసిన అతడు జయవర్దనే (శ్రీలంక) రికార్డును అధిగమించాడు. 2007 ప్రపంచకప్‌లో జయవర్దనే 548 పరుగులు చేశాడు. ఒక ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన సారథుల జాబితాలో రికీ పాంటింగ్ (539, 2007) మూడో స్థానంలో ఉన్నాడు. ఫించ్ (507, 2019), డివిలియర్స్ (482, 2015), గంగూలీ (465, 2003) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. గోల్డెన్ గ్లోవ్ ఆఫ్ వొజ్వోదినా అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత యూత్ బాక్సర్లు నాలుగు రజతాలు సాధించారు. సెలాయ్ సాయ్ (49 కేజీ), బిలస్తోన్ సింగ్ (56 కేజీ), అజయ్ కుమార్ (60 కేజీ), విజయ్‌దీప్ (69 కేజీ) జులై 14న జరిగిన ఫైనల్స్ ఓడి రజతాలతో సరిపెట్టుకున్నారు. 22 దేశాలకు చెందిన బాక్సర్లు ఈ టోర్నీలో తలపడుతున్నారు.
|
No comments:
Post a Comment