జులై - 15
|
2019లో భారత్‌లోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్ నిలిచింది. ఈ సంస్థ గత కొన్నేళ్లుగా తన స్థానాన్ని నిలుపుకుంటూ వస్తోంది. యూకేకు చెందిన బ్రాండ్ ఫైనాన్స్ ఆఫ్ ది నేషనన్స్ నిర్వహించిన లీడింగ్ 100 బ్రాండ్స్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. టాటాల బ్రాండ్ విలువ ఒక్క ఏడాదిలో 37శాతం పెరిగిందని సర్వే పేర్కొంది. 2019లో దీనివిలువ 19.55 బిలియన్ డాలర్లు. టాటాలతర్వాతి స్థానంలో 23శాతం వృద్ధితో ఎల్‌ఐసీ బ్రాండ్ విలువ 7.32 బిలియన్ డాలర్లకు చేరినట్లు తెలిపింది. ఇన్ఫోసిస్ బ్రాండ్ విలువ 7.7శాతం వృద్ధితో 6.5 బిలియన్ డాలర్లకు చేరింది. ఆ తర్వాతి స్థానాల్లో ఎస్‌బీఐ, మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రోలు ఉన్నాయి. » టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ గత ఏడాదితో పోలిస్తే దాదాపు 28శాతం విలువ కోల్పోయింది. మహీంద్రా గ్రూప్ విలువ మాత్రం భారీగా పెరిగింది. గత ఏడాది ఈ జాబితాలో 12వ స్థానంలో ఉన్న ఆ సంస్థ ఈసారి 5వ స్థానానికి చేరుకుంది. బ్రాండ్ విలువ 5.24 బిలియన్ డాలర్లకు చేరింది. బ్యాంకింగ్ రంగానికి చెందిన ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐలు తొలి 12 స్థానాల్లో చోటు పొందాయి. తొలి 100 బ్రాండ్లలో 14 స్థానాలు బ్యాంకులవే. కోటక్ మహీంద్రా (23), యాక్సిస్ (26), బీవోబీ (45), కెనరా బ్యాంక్ (58), బీవోఐ (68) ఉన్నాయి.ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా ఆర్థిక వృద్ధి రేటు ఈ ఏడాది జూన్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో 6.2 శాతానికి పడిపోయింది. దాదాపు మూడు దశాబ్దాల కాలంలో (27 ఏళ్లు) ఇదే కనిష్ఠ స్థాయి జీడీపీ వృద్ధి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో (జనవరి - మార్చి) వృద్ధి 6.4 శాతంగా నమోదైంది. దాంతో 2019 ప్రథమార్ధానికి (జనవరి- జూన్) వృద్ధిరేటు 6.3 శాతానికి పరిమితమైంది. తాజా గణాంకాలు చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్‌బీఎస్) అంచనాల ప్రకారం నమోదయ్యాయి. మొండి పద్దుల గుర్తింపు, ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి నిబంధనలను పాటించకపోవడంతో భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రూ. 7 కోట్ల జరిమానా విధించింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రా బ్యాంక్ ‘అభి' అనే పేరుతో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత చాట్ బాట్ సేవలను ప్రారంభించింది. ఈ ఇంటరాక్టివ్ అసిస్టెంట్ వినియోగదారుల ప్రశ్నలకు మిల్లీ సెకండ్ల వ్యవధిలో జవాబులు అందిస్తుంది. ఈ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి.
బంగారం, రాగి గనులను లీజుకు ఇవ్వడాన్ని నిరాకరించినందుకు పాకిస్థాన్‌కు ప్రపంచ బ్యాంక్ రూ.41,100 కోట్ల భారీ జరిమానా విధించింది. బలూచిస్థాన్‌లోని రెకో డిక్ అనే చిన్న పట్టణం బంగారం, రాగి నిల్వలకు ప్రసిద్ధి. ఇక్కడి బంగారు గని ప్రపంచంలోనే అయిదో స్థానం పొందింది. వివిధ దేశాలతో పాకిస్థాన్ కుదుర్చుకున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలకు అనుగుణంగా దీన్ని లీజుకు పొంది తవ్వకాలు చేపట్టడానికి చిలీకి చెందిన అంటోఫగస్టా, కెనడాకు చెందిన బారిక్ గోల్డ్ కార్పొరేషన్‌లు సంయుక్తంగా తెత్యాన్ కాపర్ కంపెనీగా ఏర్పడి 2010లో దరఖాస్తు చేశాయి. ఈ సందర్భంగా అన్ని రకాల సర్వేలు చేసి నివేదికలు సమర్పించాయి. అయితే వివిధ కారణాలతో బలూచిస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో నష్టపరిహారం ఇప్పించాలంటూ 2011లో ఆ కంపెనీ ప్రపంచ బ్యాంకు పరిధిలోని అంతర్జాతీయ పెట్టుబడి వివాదాల పరిష్కార కేంద్రాన్ని ఆశ్రయించింది.
|
Latest News
కరెంట్ అఫైర్స్ జులై - 15
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment