మాజీ కేంద్ర మంత్రి, భాజపా సీనియర్ నేత కల్‌రాజ్ మిశ్రా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. వయోభారం కారణంగా ఆయన ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రస్తుతం హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న ఆచార్య దేవవ్రత్ గుజరాత్ గవర్నర్‌గా బదిలీ అయ్యారు. వచ్చే మూడు నెలల్లో 10 రాష్ట్రాల గవర్నర్‌ల పదవీ కాలం పూర్తి కానుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్‌లోని డియోరియా ప్రాంతం నుంచి ఎన్నికైన కల్‌రాజ్ మిశ్రా ఎన్డీఏ-1 ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే 75 సంవత్సరాలు పైబడటంతో 2017లో ఆ పదవికి రాజీనామా చేశారు.
|
No comments:
Post a Comment