సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అర్జన్ కుమార్ సిక్రీ సింగపూర్ అంతర్జాతీయ కమర్షియల్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన ఆగస్టు 1 నుంచి 2021 జనవరి 4 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. అర్జన్ కుమార్ 2012 నుంచి 2013 వరకు పంజాబ్, హరియాణా హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. తర్వాత 2013 నుంచి 2019 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2019 మార్చిలో పదవీ విరమణ పొందారు. నేషనల్ జ్యుడీషియల్ అకాడమీలో సభ్యుడిగా, ఇంటర్నేషనల్ లా అసోసియేషన్ (భారత విభాగం) సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు.
|
No comments:
Post a Comment