ఆంధ్రప్రదేశ్ లో 1,33,867 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఒకే విడత 1,33,867 ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి సంబంధించిన ఫైలు జూలై 18న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది.
Education Newsవైఎస్ జగన్‌ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కూడా పూర్తి కాకుండానే ఒక చరిత్రను సృష్టించబోతోంది. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 14,900 గ్రామ, వార్డు సచివాలయాలలో పని చేసేందుకు మొత్తం 1,33,867 కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో పెట్టాల్సిన ఫైలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జూలై 17న ఆమోద ముద్ర వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 13,065 గ్రామ పంచాయతీలకు గాను ప్రభుత్వం 11,114 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనకు వచ్చింది. వీటిలో పని చేసేందుకు 99,144 మందిని కొత్తగా నియమించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాల ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. వార్డు సచివాలయాల్లో పని చేసేందుకు 34,723 మంది ఉద్యోగులను నియమిస్తారు. గ్రామ సచివాలయాల్లో పది మంది ఉద్యోగుల నుంచి 12 మంది దాకా పని చేసేలా నిర్ణయించగా, వార్డు సచివాలయాల్లో పదేసి మంది చొప్పున ఉద్యోగులు పని చేస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసే వారు పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం విదితమే.

వారం తర్వాత నోటిఫికేషన్లు :కొత్తగా 1,33,867 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై జూలై 18న రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత వీటి భర్తీకి కేవలం వారం పది రోజుల వ్యవధిలో శాఖల వారీగా నోటిఫికేషన్లు వెలువడుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నోటిఫికేషన్ సమయంలోనే ఏ ఉద్యోగానికి ఏ విద్యార్హత అన్న వివరాలను ఆ శాఖలు వెల్లడించనున్నాయి. నోటిఫికేషన్లలో శాఖల వారీగా వెలువరించిన ఉద్యోగాలను జిల్లాల వారీగా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ప్రత్యేక కమిటీ (డీఎస్‌సీ)లు రాత పరీక్ష నిర్వహించడం ద్వారా భర్తీ చేస్తాయి. ఈ ఉద్యోగాల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలు రిజర్వేషన్ల మేరకు ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం ఉంది.

జిల్లాల వారీగా గ్రామ సచివాలయాల సంఖ్య : 
జిల్లా
గ్రామ పంచాయతీల సంఖ్య
కొత్తగా ఏర్పాటుచేసే గ్రామ సచివాలయాలు
అనంతపుం
1029
896
చిత్తూరు
1372
1035
తూర్పు గోదావరి
1072
1271
గుంటూరు
1031
866
కృష్ణా
980
844
కర్నూలు
909
879
నెల్లూరు
940
665
ప్రకాశం
1038
877
శ్రీకాకుళం
1148
835
విశాఖపట్నం
925
719
విజయనగరం
921
664
పశ్చిమ గోదావరి
909
931
వైఎస్సార్ కడప
791
632
మొత్తం
13065
11114

వార్డు సచివాలయాల్లోకొత్తగా నియమించే ఉద్యోగాలు - వారి విధులు ...
ఉద్యోగం
విధులు
సంబంధిత శాఖ
1. వార్డు పరిపాలన కార్యదర్శి
సాధారణ పరిపాలన
సమన్వయం, సమస్యల
పరిష్కారం, ప్రజా స్పంద
నలు, మున్సిపల్ పన్నుల
వసూళ్లు, తదితరాలు
మున్సిపల్, పట్టణాభివృద్ధి
2. వార్డు సౌకర్యాల కార్యదర్శి
నీటి సరఫరా, పౌర
సౌకర్యాలు, రోడ్లు,
మురికి కాలువలు,
కల్వర్టులు, శ్మశాన
వాటికలు, తదితరాలు
మున్సిపల్, పట్టణాభివృద్ధి
3. పారిశుధ్య, పర్యా వరణ కార్యదర్శి
ఘన, ద్రవ వ్యర్థాల
నిర్వహణ, పర్యావరణ
పరిరక్షణ, జంతు
సంరక్షణ, తదితరాలు
మున్సిపల్, పట్టణాభివృద్ధి
4. వార్డు విద్యా కార్యదర్శి
మున్సిపల్ విద్య,అమ్మ
ఒడి మున్సిపల్,పట్టణాభివృద్ధి
స్కాలర్‌షిప్స్, ఫీజు
రీయింబర్స్‌మెంట్, కీలక
గణాంకాలు, సంస్కృతి,
పండుగలు, ఇతర
మున్సిపల్ కార్యక్రమాలు
మున్సిపల్, పట్టణాభివృద్ధి
5. ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ కార్యదర్శి
అర్బన్ అండ్ టౌన్
ప్లానింగ్, భూవినియోగం,
పట్టణ గృహనిర్మాణం,
అగ్నిమాపకం, పట్టణ
అటవీకరణ, నీటి సంరక్షణ
మున్సిపల్, పట్టణాభివృద్ధి
6. సంక్షేమం,అభివృద్ధి కార్యదర్శి
ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ
తదితరాలు,యువత -
ఉపాధి,పట్టణ పేదరిక
నిర్మూలన, వైఎస్సార్ ఆసరా,
వైఎస్సార్ చేయూత,
వైఎస్సార్ పింఛన్ కానుక
మున్సిపల్, పట్టణాభివృద్ధి
7. వార్డు ఇంధన కార్యదర్శి
వీధి దీపాలు, విద్యుత్
సరఫరా, విద్యుత్ సబ్సిడీ
తదితరాలు
ఇంధనం
8. వార్డు ఆరోగ్య కార్యదర్శి
ప్రజారోగ్యం, జనన మరణాల
నమోదు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ,
వైఎస్సార్ బీమా, సమగ్ర
శిశు అభివృద్ధి పథకం
(ఐసీడీఎస్),తదితరాలు
వైద్య, ఆరోగ్యం
9. వార్డు రెవెన్యూ కార్యదర్శి
భూపరిపాలన, రెవెన్యూ
కార్యక్రమాలు, పౌర
సరఫరాలు, డిజిటలైజేషన్,
సర్టిఫికెట్ల జారీ, విపత్తు
నిర్వహణ
---
10. వార్డు మహిళా, బలహీనవర్గాల పరిరక్షణ కార్యదర్శి
శాంతిభద్రతలు, మహిళలు
- బలహీనవర్గాలపై అత్యాచారాల
నిరోధం, సంబంధిత సేవలు,
మద్యపాన నిషేధం, తదితరాలు
హోం (పోలీస్)

గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు, వారు నిర్వర్తించే విధులు :
ఉద్యోగి హోదా
విధులు
కొత్తగా భర్తీ చేసే ఉద్యోగాల సంఖ్య
పర్యవేక్షణ శాఖ
1. పంచాయతి గ్రామ సచివాలయ కార్యదర్శి
కన్వీనర్, పన్నుల
వసూలు, పారిశుద్ధ్యం,
సంక్షేమ కార్యక్రమాలు
5,417
పంచాయతీరాజ్
2. వీఆర్వో
భూముల పర్యవేక్షణ
వ్యవహారాలు, పౌర
సరఫరాలు
1,790
రెవిన్యూ
3. సర్వే అసిస్టెంట్
భూముల సర్వే
12,671
రెవిన్యూ (సర్వే)
4.ఎఎన్‌ఎం
గ్రామ ప్రజల ఆరోగ్య
బాధ్యత, పర్యవేక్షణ
2,200
వైద్య ఆరోగ్య
5.వెటర్నరీ లేదా ఫిషరీస్ అసిస్టెంట్
పశు వైద్యం, పాడి,
మత్స్య శాఖ కార్యక్రమాలు
9,800
పశుసంవర్ధక
6.మహిళల రక్షణ
మహిళా పోలీసు, మహిళా మహిళా శిశు సంక్షేమ ఉద్యోగి కౌన్సిలింగ్, మహిళల రక్షణ
12,671
మహిళా శిశు సంక్షేమ
7. ఇంజనీరింగ్ అసిస్టెంట్
మంచినీటి సరఫరా, ఇతర
అన్ని రకాల ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ పనులు
12,671
పంచాయతీరాజ్
8. ఎలక్ట్రికల్ అసిస్టెంట్
విద్యుత్ సరఫరా, వీధి
దీపాల పర్యవేక్షణ,
విద్యుత్ కన్‌క్షన్లు ఇవ్వడం
6,086
పంచాయతీరాజ్
9. అగ్రి, హార్టికల్చర్ ఎంపీఈవోలు
వ్యవసాయంలో సూచనలు అగ్రికల్చర్,
ఇవ్వడం,వ్యవసాయ ఉత్పత్తి,
మరియుమార్కెటింగ్
9,996
హర్టికల్చర్
10. డిజిటల్ అసిస్టెంట్
గ్రామ సచివాలయంలో
సింగిల్ విండో సిస్టమ్ పర్యవేక్షణ
12,671
పంచాయతీరాజ్
11.వెల్పేర్ అసిస్టెంట్
పింఛన్ల పంపిణీ,
పొదుపు సంఘాలు,
ఇతర అన్ని సంక్షేమ కార్యక్రమాలు,
ఇళ్ల నిర్మాణం
12,671
సాంఘిక సంక్షేమ, గిరిజన
12. మత్య్స శాఖ ఎంపీఈఏ(అవసరం ఉన్న చోట మాత్రమే)
చేపల పెంపకం వంటి
కార్యక్రమాలపై సహాయకారిగా
పని చేయడం
500
మత్స్య

ఇదీ వార్డు సచివాలయాల స్వరూపం : పట్టణాభివృద్ధి శాఖ 3,786 వార్డు సచివాలయాల్లో వివిధ హోదాల్లో పని చేసేందుకు 34,723 కొత్త ఉద్యోగాలను భర్తీ చేయనుంది. వార్డు సచివాలయాల్లో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ, వార్డు శానిటేషన్ సెక్రటరీ, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులరైజేషన్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ, వార్డు వెల్పేర్, డెవలప్‌మెంట్ సెక్రటరీ, వార్డు ఎన్జరీ సెక్రటరీ, వార్డు హెల్త్ సెక్రటరీ, వార్డు ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ పోస్టుల రూపంలో భర్తీ చేస్తారు.

Current Affairs July 18 2019 In Telugu
Latest Job Notifications 2019


No comments:

Post a Comment