జులై - 12
|
భారత్‌లో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. 2006-16 మధ్య పదేళ్లలో కాలంలో 27.1 కోట్ల మందిని పేదరికం నుంచి దేశం గట్టెక్కించిందని వెల్లడించింది. పేదరికానికి సరికొత్త అర్థాన్ని చెబుతూ బహుముఖీయమైన పేదరిక సూచీల (ఎంపీఐ) ఆధారంగా జరిపిన విస్తృత అధ్యయనం వివరాలను ఐక్యరాజ్యసమితి తాజాగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 101 దేశాల్లో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ), ఆక్స్‌ఫర్డ్ పేదరిక, మానవాభివృద్ధి కార్యక్రమం (ఓపీహెచ్‌ఐ) విభాగాలు సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. పేదరిక నిర్మూలనలో దక్షిణాసియా దేశాలు మంచి పనితీరును కనబరిచాయని, వీటిలో భారత్ అగ్ర భాగాన ఉందని నివేదిక పేర్కొంది.
|
Latest News
కరెంట్ అఫైర్స్ - జులై - 12
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment