కరెంట్ అఫైర్స్ - జనవరి - 2019 రాష్ట్రీయం

జనవరి - 2019 రాష్ట్రీయం
రాష్ట్రీయం - టీఎస్‌¤ రాష్ట్రంలో మూడు విడతలుగా జనవరి 21, 25, 30 తేదీల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.        » దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.        » రాష్ట్రంలో మొత్తం 12,751 పంచాయతీలు ఉండగా, వాటిలో ఇప్పుడు 12,732 పంచాయతీల్లో ఎన్నికలను చేపట్టనున్నారు. ఇంకా గడువు ముగియక పోవడం వల్ల 17 పంచాయతీల్లోను, కోర్టు కేసుల కారణంగా మరో రెండు చోట్ల ఎన్నికలను నిర్వహించడం లేదు.        » మొత్తం 1,13,170 వార్డుల్లో ఎన్నికలను చేపడతారు. ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి వెలువరించారు.¤ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు.        » అనంతరం హైకోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి హోదాలో టీబీఎన్‌ రాధాకృష్ణన్‌ మిగిలిన 12 మంది న్యాయమూర్తులతో ప్రమాణస్వీకారం చేయించారు        » జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ చల్లా కోదండరాం చౌదరి, జస్టిస్‌ బి.శివశంకరరావు, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్, జస్టిస్‌ పి.కేశవరావు, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌ గౌడ్‌ ప్రమాణం చేసినవారిలో ఉన్నారు.
        » తెలంగాణ హైకోర్టు ఏర్పాటుతో పని విభజనలో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌ కొత్త బెంచ్‌లను ఏర్పాటు చేశారు. ప్రధాన న్యాయమూర్తి సహా మొదటి ముగ్గురు సీనియర్‌ న్యాయమూర్తుల నేతృత్వంలో ధర్మాసనాలు ఏర్పాటయ్యాయి. మిగిలిన న్యాయమూర్తులు ఏకసభ్య ధర్మాసనాలుగా కేసుల విచారణ చేపడతారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు.
రాష్ట్రీయం - ఏపీ¤ ఆంధ్రప్రదేశ్‌లో నూతన హైకోర్టు ఏర్పడింది.        » విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గవర్నర్‌ నరసింహన్‌ మొదట తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్‌తో, తర్వాత మిగతా 14 మంది న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు        » జస్టిస్‌ సరస వెంకట నారాయణ భట్టి, జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్‌ మంధాత సీతారామమూర్తి, జస్టిస్‌ ఉప్మాక దుర్గా ప్రసాదరావు, జస్టిస్‌ తాళ్లూరి సునీల్‌ చౌదరి, జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణ మూర్తి, జస్టిస్‌ గుడిసేవ శ్యాంప్రసాద్, జస్టిస్‌ జవలాకర్‌ ఉమాదేవి, జస్టిస్‌ నక్కా బాలయోగి, జస్టిస్‌ తేలప్రోలు రజని, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి, జస్టిస్‌ మంతోజ్‌ గంగారావు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు.¤ విజయవాడలో హైకోర్టు తాత్కాలిక భవనాన్ని సీఎం చంద్రబాబునాయుడు, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రారంభించారు. ¤ విజయవాడలో రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌ఓసీ) ఆంధ్రప్రదేశ్‌ కార్యాలయం ప్రారంభమైంది.¤ ఉండవల్లిలో సీఎం చంద్రబాబు ఆర్థికరంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు        » కేంద్రం సాయం చేయకపోయినా అశాస్త్రీయ రాష్ట్ర విభజన వల్ల ఎదురైన సవాళ్లను, రెవెన్యూ లోటుతో నెలకొన్న ఇబ్బందులను తక్కువ వడ్డీకి రుణాల సమీకరణ, రుణాల పునర్‌వ్యవస్థీకరణ ద్వారా అధిగమిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.        » ప్రతికూల పరిస్థితుల్లోనూ అభివృద్ధి పథం నుంచి రాష్ట్రం తప్పుకోలేదని, సమర్థమైన దార్శనికత, వ్యూహంతో అభివృద్ధి అజెండాను ఏర్పాటు చేసుకుని పయనిస్తున్నామని, 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 ప్రచారాల లాంటి వినూత్న కార్యక్రమాలను చేపట్టాలని వివరించింది. ¤ బాధితులకు సాయం చేసేందుకు ఉద్దేశించిన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎం ఆర్‌ఎఫ్‌) దస్త్రంపై సీఎం చంద్రబాబు సంతకం చేశారు. వైద్య చికిత్సల తిరిగి చెల్లింపులు, ఇతరత్రా ప్రభుత్వ సాయం కోసం దరఖాస్తు చేసుకున్న 7,386 మందికి రూ.53.64 కోట్లను విడుదల చేశారు        » 2014 నుంచి ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం సీఎం సహాయనిధి ద్వారా రూ.1249.56 కోట్లు విడుదల చేసింది. ¤ విజయవాడ స్వరాజ్య మైదానంలో 30వ విజయవాడ పుస్తక మహోత్సవ కార్యక్రమాన్ని మహాత్మాగాంధీ మనవడు, చరిత్రకారుడు ఆచార్య రాజమోహన్‌ గాంధీ, శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సిసోడియా తదితర ప్రముఖులు ప్రారంభించారు.        » నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ (ఎన్‌బీటీ) 1989 అక్టోబరులో మొదటిసారిగా విజయవాడ పుస్తక మహోత్సవాన్ని నిర్వహించింది. 1991 నుంచి ఏటా జనవరిలో పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.        » ఈ కార్యక్రమంలో రాజమోహన్‌ గాంధీ రాసిన ‘మోడరన్‌ సౌత్‌ ఇండియా' పుస్తకాన్ని మండలి బుద్ధ ప్రసాద్‌ ఆవిష్కరించారు.
జనవరి - 2
రాష్ట్రీయం - టీఎస్‌¤ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ రాములు రాసిన ‘దేశానికి దిక్సూచి తెలంగాణ' పుస్తకాన్ని కేటీఆర్‌ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.¤ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల సందర్భంగా ప్రకటించినట్లుగానే రాష్ట్రంలో మరో రెండు కొత్త జిల్లాలు ములుగు, నారాయణపేట ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో నెంబరు 533, 534 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది.        » పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని దానిలో పేర్కొంది. భూపాలపల్లిని విభజించి ములుగు జిల్లా, మహబూబ్‌నగర్‌ను విడదీసి నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబరు 31న ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.¤ పంచాయతీ ఎన్నికల్లో ఓటరుకు సిరా గుర్తును చూపుడు వేలుకు బదులు మధ్యవేలుపై వేస్తారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ రోజున చూపుడు వేలుపై వేసిన గుర్తు ఇంకా చెరగక పోవడంతో, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.రాష్ట్రీయం - ఏపీ¤ రాష్ట్రవ్యాప్తంగా జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు జరిగే జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం నుంచి ప్రారంభించారు.¤ పెథాయ్‌ తుపాను రూ.646 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. దీనివల్ల గుంటూరు నుంచి విజయనగరం వరకూ 6 జిల్లాల్లో 95 వేల మంది రైతులకు నష్టం వాటిల్లింది.        » సాధారణ పంటలకు సంబంధించి రూ.292.76 కోట్లు, ఉద్యాన పంటల్లో రూ.164.27 కోట్లు, ఇతర విభాగాల్లో రూ.189 కోట్ల మేర నష్టం వాటిల్లింది.



కరెంట్ అఫైర్స్ >> రాష్ట్రీయం -డిసెంబరు - 2018 రాష్ట్రీయం

No comments:

Post a Comment