నవంబరు 1 |
నవంబరు - 2018 రాష్ట్రీయం రాష్ట్రీయం - ఏపీ¤ ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యాన్ని నెల్లూరు జిల్లా తపాలాశాఖ అరుదైన గుర్తింపుతో గౌరవించింది. పద్మభూషణుడైన బాలసుబ్రహ్మణ్యం ముఖచిత్రంతో కూడిన తపాలా కవరును రూపొందించింది. » నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా పోస్టల్‌శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం దీన్ని ఆవిష్కరించారు. రాష్ట్రీయం - టీఎస్¤ హైదరాబాద్ మెట్రోరైలుకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. నగరంలోని మూడు స్టేషన్ల (రసూల్‌పుర, ప్యారడైజ్, ప్రకాష్‌నగర్) నిర్మాణాలు పర్యావరణహితంగా ఉండటంతో వాటిని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గ్రీన్ ప్లాటినం అవార్డుకు ఎంపిక చేసింది. » దేశవ్యాప్తంగా కర్బన ఉద్గారాలను తగ్గించే నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న ఐజీబీసీ పాయింట్ల ఆధారంగా ప్లాటినం, గోల్డ్, సిల్వర్ రేటింగ్‌లను ఇస్తోంది. » హైదరాబాద్ మెట్రో రైలు స్టేషన్ల నిర్మాణంలో సహజ వనరులను ఉపయోగించుకున్నట్లు తేలడంతో గ్రీన్ ప్లాటినం అవార్డుకు ఎంపిక చేశారు. |
నవంబరు 2 |
రాష్ట్రీయం - టీఎస్¤ విద్యుత్తు వినియోగ వృద్ధి రేటుతో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. కేంద్రీయ విద్యుత్తు మండలి (సీఈఏ) 2016-17లో దేశ ప్రజలు వినియోగించిన కరెంటు లెక్కలపై వెలువరించిన వార్షిక నివేదిక (2017-18)లో ఈ విషయం వెల్లడైంది.ముఖ్యాంశాలు » 2016-17లో రాష్ట్ర తలసరి (ఒక వ్యక్తి ఏడాదికి వినియోగించే) వినియోగం 1551 యూనిట్లు. 2017-18లో అది 1727 యూనిట్లకు చేరడంతో వృద్ధిరేటు 11.34 శాతంగా నమోదైంది. ఇదే కాల వ్యవధిలో జాతీయ తలసరి వృద్ధి 2.4 శాతమే. జాతీయ స్థాయిలో తలసరి వినియోగం 1122 యూనిట్ల నుంచి 1149 యూనిట్లకు పెరిగింది. » 2014-15లో రాష్ట్ర తలసరి వినియోగం 1084 యూనిట్లు. ఇప్పుడు 1727కు చేరింది. » తెలంగాణలో గతేడాది 60,237 మిలియన్ యూనిట్ల (ఎంయూ) కరెంటు వినియోగమైంది. దేశవ్యాప్తంగా 12.04 లక్షల ఎంయూలు వాడారు. » రాష్ట్రమంతా అన్ని వర్గాలు వినియోగించే కరెంటు వృద్ధిలోనూ తెలంగాణ 13.62 శాతంతో మొదటి స్థానంలో ఉంది. జాతీయ వృద్ధి శాతం 6.11 కంటే ఇది చాలా అధికం. తెలంగాణ తర్వాత ఉత్తరప్రదేశ్ 11.92%, ఏపీ 7.43%, మహారాష్ట్ర 7.40%తో వరుస స్థానాల్లో ఉన్నాయి. » తెలంగాణలో ఒక రోజు ఏర్పడే గరిష్ఠ డిమాండు వృద్ధి 11.94 శాతంగా నమోదైంది. జాతీయ స్థాయిలో ఇది 2.43 శాతమే. » తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 4.28 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు అదనంగా విద్యుత్తు సదుపాయం కల్పించారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఏటా సగటున 70 వేల కనెక్షన్లు ఇస్తే, ఏర్పాటు తర్వాత 97 వేల కనెక్షన్లు మంజూరు చేశారు. » తలసరి కరెంటు వినియోగంలో తెలంగాణ (11.34% వృద్ధి) తర్వాతి స్థానాల్లో ఏపీ (5.23%), మహారాష్ట్ర (4.8%), హిమాచల్ ప్రదేశ్ (3.95%), మధ్యప్రదేశ్ (3.13%) ఉన్నాయి. రాష్ట్రీయం - ఏపీ¤ ఏపీ ప్రణాళిక శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం గత నాలుగేళ్లలో అత్యధిక సగటు వృద్ధిరేటు సాధించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. జాతీయ స్థాయిలో సగటు వృద్ధిరేటు 7.3 శాతం నమోదు కాగా, ఏపీలో 10.5 శాతం నమోదైంది. » ఏపీ మినహా మిగతా రాష్ట్రాలేవీ రెండంకెల వృద్ధి రేటు సాధించలేదు. ¤ దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు ‘అడ్వాన్స్‌డ్‌రోబోటిక్ కంట్రోల్ కోర్సు'ల్లో శిక్షణ ఇచ్చేందుకు జర్మనీకి చెందిన యూరోపియన్‌సెంటర్ ఫర్ మెకాట్రానిక్స్ (ఈసీఎం)తో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందాన్నికుదుర్చుకుంది. ¤ సముద్ర, తీర ప్రాంతానికి సంబంధించి సమగ్ర, లోతైన పరిశోధనలకు విశాఖలోప్రత్యేక కేంద్రాన్ని (నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ - ఎన్‌సీసీఆర్) ఏర్పాటుచేస్తున్నట్లు కేంద్ర శాస్త్రసాంకేతిక, భూశాస్త్ర (ఎర్త్‌సైన్సెస్) మంత్రి హర్షవర్ధన్‌తెలిపారు. » విశాఖలోని డాల్ఫిన్ హిల్స్ పై ఈ కేంద్రం ప్రతిపాదిత స్థలంలోఆయన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. |
నవంబరు 3 |
రాష్ట్రీయం - ఏపీ, టీఎస్¤ కాపలాలేని రైల్వే గేట్లను తొలగించాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా మూడేళ్ల క్రితం ప్రయత్నాలు మొదలు పెట్టిన దక్షిణ మధ్య రైల్వే ఈ లక్ష్యాన్ని చేరుకుంది. » బ్రాడ్‌గేజ్ మార్గంలో మొత్తం 486 కాపలాలేని లెవల్ క్రాసింగ్‌లను సురక్షితంగా మార్చినట్లు ప్రకటించింది. » 2016-17 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ‘మిషన్ జీరో యాక్సిడెంట్స్' అనే నినాదాన్ని ప్రకటించింది. 2018 చివరినాటికి కాపలాలేని రైల్వే గేట్లన్నింటినీ తొలగించడం అందులోని ఒక లక్ష్యం. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ ప్రత్యేక దృష్టి పెట్టి లక్ష్యాన్ని పూర్తి చేశారు. రాష్ట్రీయం - ఏపీ ¤ పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్ డ్యాంను 41.15 మీటర్ల ఎత్తు వరకు నిర్మించుకునేందుకు కేంద్ర జలవనరుల సంఘం ఆమోదం తెలిపింది. |
నవంబరు 5 |
రాష్ట్రీయం - టీఎస్ ¤ దేశంలోనే ఉత్తమ పట్టణ ప్రజా రవాణా ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రోకు భారత ప్రభుత్వం నుంచి అవార్డు లభించిందని ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు ఎండీ కేవీబీ రెడ్డి, హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. నాగ్‌పూర్‌లో జరిగిన జాతీయ స్థాయి సదస్సులో వీరు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. » ఇప్పటివరకు హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు 68 అవార్డులు లభించాయి. రాష్ట్రీయం - ఏపీ ¤ తిత్లీ తుపాను బాధితులకు సాయం పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని తిత్లీ బాధితులకు గృహ మంజూరు పత్రాలు అందజేశారు. » ఉద్ధానంలో మూత్రపిండాల పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, 200 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. వంశధార బహుదా హైలెవెల్ కెనాల్ నిర్మాణం చేపట్టి ఈ ప్రాంతానికి పూర్తిగా నీళ్లిచ్చే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. |
నవంబరు 6 |
రాష్ట్రీయం - ఏపీ ¤ అమరావతిలో నిర్వహించిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యాంశాలు » కడపలో రూ.12 వేల కోట్లతో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని, అందుకు 100 శాతం పెట్టుబడిని రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకోవాలని నిర్ణయించింది. దీని నిర్మాణానికి రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ప్రత్యేక వాహక సంస్థ (ఎస్పీవీ) ఏర్పాటవుతుంది. సంస్థలో ప్రాథమిక పెట్టుబడిగా రూ.2 కోట్లను కేటాయించారు. » రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ తాత్కాలిక ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పి.మధుసూదన్ నియమితులయ్యారు. ఈయన గతంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) సీఎండీగా పనిచేశారు. » ప్రకాశం జిల్లా దోనకొండలో మెగా పారిశ్రామిక హబ్ నిర్మాణానికి 2395.98 ఎకరాల ప్రభుత్వ భూమి ఉచితంగా కేటాయింపు. » నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్) ఏర్పాటుకు ప్రకాశంలోని 6 గ్రామాల్లో భూసేకరణకు వెళ్లేందుకు ఏపీఐఐసీకి అనుమతి. ¤ గ్రీస్‌లో ఇటీవల జరిగిన ప్రపంచ కరాటే ఛాంపియన్‌షిప్-2018 పోటీల్లో బంగారు పతకం సాధించిన రాష్ట్రానికి చెందిన భూపతిరాజు అన్మిష్ వర్మను సీఎం చంద్రబాబు సన్మానించారు. » ప్రపంచ ఛాంపియన్‌షిప్ కరాటే పోటీల్లో భారత్ నుంచి మొదటిసారి బంగారు పతకం సాధించిన వ్యక్తి అన్మిష్. రాష్ట్రీయం - టీఎస్¤ ప్రముఖ కవి, రచయిత, పరిశోధకుడు కపిలవాయి లింగమూర్తి (90) హైదరాబాద్‌లో మరణించారు. » ప్రస్తుత నాగర్‌కర్నూలు జిల్లా బల్మూరు మండలం జినుకుంట గ్రామంలో 1928 మార్చి 31న లింగమూర్తి జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ (తెలుగు) చేశారు. తెలుగు పండితుడిగా, ఉపన్యాసకుడిగా కొనసాగుతూనే పలు పుస్తకాలు రచించారు. ఆయన రచించిన భాగవత కథాతత్వం, సాలగ్రామ శాస్త్రం, పాలమూరు జిల్లా దేవాలయాలు, మాంగళ్య శాస్త్రం, స్వర్ణ శకలాలు అనే గ్రంథాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. » లింగమూర్తికి తెలుగు విశ్వవిద్యాలయం 2014 ఆగస్టు 30న గౌరవ డాక్టరేట్ అందజేసింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న తొలి వ్యక్తి కపిలవాయి. ఆయన రచనల్లో 87 ప్రచురితమయ్యాయి. |
నవంబరు 7 |
రాష్ట్రీయం - ఏపీ, టీఎస్¤ కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు బదిలీ అయ్యారు. » రాజస్థాన్‌కు చెందిన జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ 1959 డిసెంబరు 24న జన్మించారు. 1980లో అమెరికాలోని ఆర్కాడియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1983లో దిల్లీ వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 2005 జూన్ 13న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2015 మార్చి 10న కర్ణాటక హైకోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు. |
నవంబరు 8 |
రాష్ట్రీయం - ఏపీ¤ ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా రెల్లిలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దీనికి వీలుగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేయనుంది. » ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో 6వ అంశం కింద ఇచ్చిన హామీకి అనుగుణంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. తొలి దశ కింద రూ.420 కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించారు. 2019-20 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమయ్యే వీలుంది. |
నవంబరు 9 |
రాష్ట్రీయం - టీఎస్¤ హైదరాబాద్ హైటెక్స్ ప్రదర్శన కేంద్రంలో టీ వర్క్స్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరుగనున్న ‘మేకర్ ఫెయిర్ హైదరాబాద్-2018' ప్రారంభమైంది. » దేశవ్యాప్తంగా విభిన్న రంగాలకు చెందిన ఔత్సాహికుల సృజనను ప్రదర్శించేందుకు మేకర్‌ఫెయిర్ వేదికగా నిలిచిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. » సృజనకు, నూతన ఆవిష్కరణలకు, పారిశ్రామికవేత్తలకు చేయూతనందించే లక్ష్యంతో మేకర్స్ ఫెయిర్‌ను ఏర్పాటు చేశారు.¤ చెత్త నుంచి విద్యుత్తు తయారు చేసే ప్లాంటు ఒకటి హైదరాబాద్ సమీపంలోని యాచారంలో ఏర్పాటు కానుంది. ఈ ప్లాంటు సామర్థ్యం 12 మెగావాట్లు. దీన్ని నెట్‌లింక్స్ లిమిటెడ్‌కు అనుబంధంగా ఉన్న శ్రీవెంకటేశ్వర గ్రీన్ పవర్ ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేస్తోంది. ఇందుకు అవసరమైన పెట్టుబడి కోసం తకర లెబెన్ కం. లిమిటెడ్, కుని ఉమి అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ అనే జపాన్ సంస్థలతో నెట్‌లింక్స్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. » ఈ ఒప్పందం ప్రకారం శ్రీవెంకటేశ్వర గ్రీన్ పవర్ ప్రాజెక్ట్ నెలకొల్పే యూనిట్లో జపాన్ కంపెనీలు 30 శాతం వాటా తీసుకుంటున్నాయి. » ఈ ప్లాంటు స్థాపనకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని హిటాచి జోసెన్ అనే సంస్థ అందిస్తుంది. ఈ సంస్థ ఈపీసీ కాంట్రాక్టర్‌గా కూడా వ్యవహరిస్తుంది. దీనికోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో లభించే చెత్తను ఉపయోగించుకుంటారు. ఈ ప్లాంటు ద్వారా రోజుకు 700 టన్నుల చెత్తను విద్యుత్తుగా మార్చుతారు. » నెట్‌లింక్స్ ఛైర్మన్ లోక మనోహర్‌రెడ్డి. |
నవంబరు 10 |
రాష్ట్రీయం - ఏపీ¤ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటక శాఖ సారథ్యంలో విజయవాడలో సోషల్ మీడియా సమ్మిట్ అండ్ అవార్డ్స్ అమరావతి - 2018 వేడుక అట్టహాసంగా జరిగింది. » ఈ కార్యక్రమంలో కరీనా కపూర్ ‘సోషల్ మీడియా స్టైల్ ఐకాన్'; సమంత ‘సోషల్ మీడియా మోస్ట్ లైక్డ్ సౌతిండియన్ స్టార్', దేవిశ్రీ ప్రసాద్ ‘మోస్ట్ లైక్డ్ సౌతిండియన్ మ్యూజిషియన్' అవార్డును అందుకున్నారు. రాష్ట్రీయం - ఏపీ, టీఎస్¤ విద్యలో ఆవిష్కరణల కోసం ఐసీటీ వినియోగించే ఉపాధ్యాయులకు ఇచ్చే ఈ - జాతీయ అవార్డు - 2017కు తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. » తెలంగాణ నుంచి గజ్వేల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న దేవనపల్లి నాగరాజు, లాలాగూడ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్న చిలుకా ఉమారాణి, ఆంధ్రప్రదేశ్ నుంచి కదిరి మశానం పేట ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు వజ్ర నరసింహారెడ్డిలు ఈ అవార్డును దక్కించుకున్నారు. » దేశవ్యాప్తంగా 43 మందికి ఈ అవార్డులు లభించాయి. |
నవంబరు 11 |
రాష్ట్రీయం - ఏపీ ¤ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది. నూతన మంత్రులుగా ఎన్‌ఎండీ ఫరూక్, కిడారి శ్రవణ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. » సీఎం చంద్రబాబు సమక్షంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ వీరిద్దరితో ప్రమాణస్వీకారం చేయించారు. » ఫరూక్‌కు మైనార్టీ సంక్షేమంతో పాటు వైద్యవిద్య, ఎన్టీఆర్ వైద్యసేవ, ఆహార భద్రత శాఖలు కేటాయించారు. శ్రావణ్‌కు గిరిజన సంక్షేమం, ప్రాథమిక వైద్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విధాన పరిషత్తు, ఔషధ నియంత్రణ, ఆయుష్ బాధ్యతలు అప్పగించారు. డాక్టర్ కామినేని శ్రీనివాస్ రాజీనామాతో ఖాళీ అయిన వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటివరకు సీఎం వద్ద ఉంది. తాజా విస్తరణలో దాన్ని విభజించి ఇప్పటివరకు నక్కా ఆనందబాబు చూస్తున్నారు. తాజాగా దాన్ని శ్రావణ్‌కు కేటాయించారు. ఆయన వద్ద ఎస్సీ సంక్షేమం మిగిలి ఉంది. ఉపముఖ్యమంత్రి చినరాజప్ప వద్ద ఉన్న సినిమాటోగ్రఫీ శాఖను ఆనందబాబుకు అదనంగా అప్పగించారు. ¤ భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 131వ జయంతి ఉత్సవాలను ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో కడపలో నిర్వహించారు. |
నవంబరు 12 |
రాష్ట్రీయం - ఏపీ ¤ వివిధ కార్పొరేషన్ల ద్వారా ఒకేరోజు రెండు లక్షల మందికి స్వయం ఉపాధి యూనిట్లు అందజేసే ‘పేదరికం పై గెలుపు' కార్యక్రమం సీఎం చంద్రబాబు విజయవాడలో ప్రారంభించి, దాని లోగోను ఆవిష్కరించారు. » ‘ఆదరణ - 2' పథకాన్ని కూడా ప్రారంభించారు. చర్మకారులకు పింఛన్లు ఇచ్చే పథకం ఉత్తర్వులను విడుదల చేశారు. » ప్రభుత్వం అమలు చేస్తున్న స్వయం ఉపాధి కార్యక్రమాల్లో బ్యాంకు రుణాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ‘ఆదరణ' పథకంలో బ్యాంకు రుణం తీసుకునే విధానాన్ని రద్దు చేసి 90 శాతం రాయితీపై పరికరాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. |
నవంబరు 13 |
రాష్ట్రీయం - టీఎస్ ¤ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నాచౌక్‌లో ఆరు వారాల పాటు నిరసనలకు అనుమతించాలని ఉమ్మడి హైకోర్టు తెలంగాణా ప్రభుత్వాన్ని ఆదేశించింది. » నిరసనలకు చట్టబద్ధ అనుమతి మంజూరు చేయాలని స్పష్టం చేసింది. రాజ్యాంగం ప్రసాదించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛను అడ్డుకోజాలరని పేర్కొంది. » అయితే ఆందోళనకారులు ఇష్టారాజ్యంగా నిరసన వ్యక్తం చేయడానికి వీల్లేదని, ముందుగా అధికారుల అనుమతి తీసుకోవాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.¤ ముఖ్యమంత్రి కేసీఆర్ 51 నెలల పాలనపై ఆయన ముఖ్య ప్రజాసంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావు రాసిన రెండు పుస్తకాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ ఛైర్మన్ ఘంటా చక్రపాణి ఆవిష్కరించారు. ఇదీ సుపరిపాలన, 51 మంత్స్ ఆఫ్ కేసీఆర్ పేరిట ఈ పుస్తకాలను దాదాపు 130 వ్యాసాలతో ప్రచురించారు.రాష్ట్రీయం - ఏపీ, టీఎస్¤ తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాల్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని ఉమ్మడి హైకోర్టు అభిప్రాయపడింది. » మానవుడు తన చర్యలతో పర్యావరణాన్ని, ప్రకృతిని పాడు చేస్తున్నాడని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.‘భూగ్రహానికి అతి హీనమైన యాత్రికుడు మానవుడు' అని వ్యాఖ్యానించింది. చాలా సమస్యలను మనమే సృష్టించుకుంటున్నామని పేర్కొంది. » తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించేందుకు ఏయే చర్యలను తీసుకుంటున్నారో చెప్పాలని తెలంగాణ, ఏపీ దేవాలయశాఖ అధికారులను, కాలుష్య నియంత్రణ మండళ్లను ఆదేశించింది. |
నవంబరు 14 |
రాష్ట్రీయం - టీఎస్¤ గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తెరాస అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో రెండు సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. » ఈ సందర్భంగా ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలతో కూడిన ప్రమాణ పత్రం సమర్పించారు. ఈ వివరాల మేరకు కేసీఆర్ ఆస్తుల విలువ రూ.22.60 కోట్లు.రాష్ట్రీయం - ఏపీ¤ దిగ్గజ సంస్థ అమెజాన్ దేశంలోనే తొలిసారిగా నవ్యాంధ్రలో క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు అందించాలని నిర్ణయించింది. » ఏపీఎస్‌ఎస్‌డీసీతో కలిసి అమెజాన్ సంస్థ క్లౌడ్ కంప్యూటింగ్‌లో శిక్షణ ఇవ్వనుంది.¤ ఆంధ్రప్రదేశ్‌లో ద్రవ్యోల్బణ శాతం మైనస్‌కు చేరింది. ఈ ఏడాది అక్టోబరులో దేశంలో సగటు ద్రవ్యోల్బణం 3.31%గా, ఆంధ్రప్రదేశ్‌లో -1.07%, హిమాచల్ ప్రదేశ్‌లో -0.73%గా నమోదైంది. » దేశంలో అత్యధికంగా అసోంలో 6.03%, తెలంగాణలో 3.72% ద్రవ్యోల్బణం నమోదైంది. |
నవంబరు 15 |
రాష్ట్రీయం - ఏపీ¤ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి రాష్ట్రంలో సోదాలు, దర్యాప్తు చేసే అధికారాన్ని నిరాకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆ సంస్థ ప్రవేశానికి వెసులుబాటు కల్పించే సమ్మతి ఉత్తర్వును ఉపసంహరించుకుంది. అంతర్గత విభేదాలతో సీబీఐ ప్రతిష్ఠ మసకబారిందని రాష్ట్రంలో ఆ సంస్థ ప్రమేయం అవసరం లేదని భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. » దిల్లీ మినహా ఏదైనా రాష్ట్రంలో సీబీఐ తన అధికారాలను వినియోగించుకోవాలంటే ఆయా రాష్ట్రాలు సాధారణ సమ్మతి (జనరల్ కన్సెంట్) తెలపాల్సి ఉంటుంది. ¤ విశాఖపట్నంలో యునెస్కో ఎంజీఐఈపీ విభాగం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటుచేసిన టెక్-2018 సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.¤ ఇండోనేషియాకు చెందిన అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజం ఆసియా పల్ప్ పేపర్ (ఏపీపీ) గ్రూపు అనుబంధ సంస్థ సినర్ మాస్ గ్రూపు ప్రకాశం జిల్లాలో పరిశ్రమను స్థాపించాలని నిర్ణయించింది. » రెండు దశల్లో రూ.21,600 కోట్ల (3 బిలియన్ యూఎస్ డాలర్లు) పెట్టుబడులు పెట్టనుంది. టిష్యూ, ప్యాకింగ్, పేపర్ తయారీ పరిశ్రమను 2 వేల ఎకరాల్లో పెట్టాలని నిర్వాహకులు నిర్ణయించారు. » రూ. 13 వేల కోట్ల పెట్టుబడితో అనంతపురం జిల్లాలో ఏర్పాటవుతున్న కియా మోటార్స్ పారిశ్రామిక రంగంలో మైలురాయిలా నిలిచింది. » ఈ పరిశ్రమతో 6 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. |
నవంబరు 16 |
రాష్ట్రీయం - ఏపీ ¤ ఫార్ములా-1 పవర్ బోట్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలు అమరావతిలో ప్రారంభమయ్యాయి. ప్రకాశం బ్యారేజీ సమీపంలో పున్నమి ఘాట్ వద్ద సీఎం చంద్రబాబు వీటిని ప్రారంభించారు. » తొలిసారి ఫార్ములా-1 పవర్ బోట్ రేస్ అమరావతికి వచ్చిందని, ఇకపై ఏటా నవంబరులోనే రేస్‌ను కృష్ణానదిపై నిర్వహిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు. » ఈ రేస్ జరుగుతున్న ప్రాంతాన్ని (పున్నమి ఘాట్) ఇకపై ఎన్టీఆర్ సాగర్ పేరుతో పిలవనున్నట్లు ప్రకటించారు. ¤ విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎంఎస్ ధోని క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఎంఎస్ ధోనికి చెందిన ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి (ఏపీఈడీబీ) ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. » ఒప్పందంలో భాగంగా ఆర్కా స్పోర్ట్స్ సంస్థ రూ.60 కోట్లతో రెండు దశల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ అకాడమీని, అంతర్జాతీయ పాఠశాలను అభివృద్ధి చేస్తుంది. క్రికెట్‌తోపాటు ఇతర క్రీడలకు అవసరమైన 24 క్రీడామైదానాలను, ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియంలను, మౌలిక వసతులను అభివృద్ధి చేస్తారు. రాష్ట్రీయం - టీఎస్ ¤ బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో సంస్కరణలు తెచ్చినందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి (వీసీ) ప్రవీణ్‌రావుకు ‘విద్యా నాయకత్వ పురస్కారం' లభించింది. » హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో బిజినెస్ స్కూల్ అఫైర్, దేవాంగ్ మెహతా జాతీయ విద్యా సంస్థ ప్రతినిధుల నుంచి ప్రవీణ్‌రావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు. » భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ప్రకటించిన ర్యాంకుల్లో జయశంకర్ విశ్వవిద్యాలయానికి దేశంలోనే రెండో ర్యాంకు లభించింది. ¤ రాష్ట్ర పరిశ్రమల్లో కెల్లా అత్యుత్తమ యాజమాన్య సంస్థగా ‘తెలంగాణ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ పురస్కారాన్ని' సింగరేణి సంస్థ అందుకుంది. » వరల్డ్ హెచ్‌ఆర్‌డీ కాంగ్రెస్ నిర్వాహకురాలు హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సింగరేణికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ¤ రైతు బంధు, రైతు బీమా పథకాలకు ఐరాస గుర్తింపు లభించింది. » ప్రపంచ దేశాల్లో రైతుల అభివృద్ధి కోసం చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో 20 పథకాలను ఎంపిక చేయగా అందులో తెలంగాణకు చెందిన రైతు బంధు, రైతు బీమా పథకాలు రెండూ ఎంపికయ్యాయి. » ఈ పథకాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా ఐరాస తెలంగాణ ప్రభుత్వానికి ఆహ్వానం పంపింది. నవంబరు 21, 23 తేదీల మధ్య ఐరాస వ్యవసాయ విభాగం ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) కేంద్ర కార్యాలయం రోమ్ నగరానికి రావాల్సిందిగా కోరింది. |
నవంబరు 17 |
రాష్ట్రీయం - టీఎస్ ¤ ఎకనామిక్స్ టైమ్స్ పత్రిక ప్రకటించిన ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్' పురస్కారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ముంబయిలో అందజేశారు. » కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తదితరులు హాజరయ్యారు. |
నవంబరు 18 |
రాష్ట్రీయం - ఏపీ¤ రాజధాని అమరావతిలో నిర్వహించిన ఎఫ్1హెచ్2ఓ, ఎఫ్4 పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి సీఎం చంద్రబాబు బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీలు 70-75 దేశాల్లో టీవీలో ప్రసారమయ్యాయని, 9 కోట్ల మంది ప్రజలు వీక్షించారని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. » వచ్చే ఏడాది నవంబరు 15, 16, 17 తేదీల్లో ఈ పోటీలను మళ్లీ నిర్వహించనున్నట్లు తెలిపారు. |
నవంబరు 19 |
రాష్ట్రీయం - ఏపీ, టీఎస్¤ దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రధాన రైల్వే స్టేషన్ల వద్ద వంద అడుగుల మేరకు జాతీయ జెండాలు ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్ నిర్ణయించారు. |
నవంబరు 20 |
రాష్ట్రీయం - ఏపీ¤ భూ వివాదాల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూధార్ పథకాన్ని ఉండవల్లి నివాసంలోని ప్రజావేదికలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. » భూములకు సంబంధించి జరిగే మోసాలకు భూధార్ ద్వారా అడ్డుకట్ట పడుతుందని, భూ లావాదేవీల ప్రక్రియ మరింత సులువవుతుందని సీఎం పేర్కొన్నారు. భూధార్ విశిష్ట సంఖ్య ఉన్న భూముల లావాదేవీలకు ధృవపత్రాలు, ఆధారాలు సమర్పించాల్సిన అవసరం ఉండదన్నారు. రాష్ట్రీయం - ఏపీ, టీఎస్¤ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని 9వ షెడ్యూల్ కింద పేర్కొన్న సంస్థల్లో ఆరింటి విభజన మాత్రమే మిగిలిందని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. |
నవంబరు 21 |
రాష్ట్రీయం - టీఎస్¤ తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా పథకాలు రైతులకు మేలు చేస్తాయని ప్రపంచ ఆహారం, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మరియా హెలెనా సెమెడో ప్రశంసించారు. » ఇటలీ రాజధాని రోమ్‌లో ఈ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘అంతర్జాతీయ సృజనాత్మక వ్యవసాయ సదస్సు'లో మరియా హెలెనా ప్రసంగించారు. తెలంగాణ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, విత్తన ధృవీకరణ సంస్థ సంచాలకుడు డాక్టర్ కేశవులు భారత ప్రతినిధులుగా దీనిలో పాల్గొన్నారు. రాష్ట్రీయం - ఏపీ¤ కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెం గ్రామం వద్ద ఆంధ్రప్రదేశ్‌లోనే ఎత్తయిన 27 అడుగుల తెలుగుతల్లి విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.¤ మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం ఆస్తులను ప్రకటించారు. 2018 మార్చి నెలాఖరుకి సీఎం కుటుంబం నికర ఆస్తుల విలువ రూ.88,68,50,000. చంద్రబాబు కుటుంబ ఆస్తుల విలువ సంవత్సర కాలంలో రూ.13.60 కోట్లు పెరిగింది. » చంద్రబాబు ఆస్తుల విలువ సుమారు రూ.2.99 కోట్లు కాగా, మనవడు దేవాన్ష్ పేరు మీద రూ.18.71 కోట్ల విలువైన ఆస్తులున్నాయి.¤ తూర్పు గోదావరి జిల్లా కోనలో 1811 ఎకరాల్లో సరికొత్త వాణిజ్య ఓడరేవు నిర్మాణం కోసం జీఎంఆర్‌కు చెందిన కాకినాడ గేట్‌వే పోర్టు లిమిటెడ్ (కేజీపీఎల్) రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. » డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్‌ఓటీ) విధానంలో రూ.2123 కోట్లతో ఓడరేవు నిర్మాణం కోసం కేజీపీఎల్ ముందుకొచ్చింది. |
నవంబరు 22 |
రాష్ట్రీయం - ఏపీ ¤ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ‘వ్యర్థాల నిర్వహణ - యాజమాన్య పద్ధతుల'పై ఎనిమిదో ఐకాన్ సదస్సును శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. ¤ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్) అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. » శాశ్వత ఉద్యోగుల మాదిరిగా ఒప్పంద మహిళా అధ్యాపకులకు 180 రోజుల ప్రసూతి సెలవులు ఇవ్వాలని నిర్ణయించారు. |
నవంబరు 23 |
రాష్ట్రీయం - ఏపీ¤ ఆంధ్రప్రదేశ్‌లో మీ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు సమర్థమైన సేవలు అందుతున్నట్లు ఆసియా అభివృద్ధి బ్యాంకు అధ్యయన నివేదిక వెల్లడించింది. » ‘గవర్నమెంట్ ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ అండ్ డిజిటల్ డివైడ్ : ద కేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్' పేరుతో విడుదల చేసిన నివేదికలో ఏపీలో అమలవుతున్న సేవల గురించి విశ్లేషించింది. మీ సేవ ప్రాజెక్టు వల్ల అవినీతి తగ్గడంతో పాటు, ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా అన్ని స్థాయుల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని, దీన్నుంచి మిగతా రాష్ట్రాలు పాఠాలు నేర్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడింది. » రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో ఒక్కో కామన్ సర్వీసు సెంటర్‌లో 14890, గ్రామీణ ప్రాంతాల్లో 4627 లావాదేవీలు నమోదవుతున్నట్లు పేర్కొంది. » ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు 350 ఎలక్ట్రానిక్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. వాటిలో 30-35 సేవలకు అధిక డిమాండ్ ఉంది. మొత్తం సేవల్లో వాటి వాటా 85% వరకూ నమోదవుతోంది. ¤ మూడు రోజులపాటు కొనసాగే ‘అమరావతి ఎయిర్ షో - 2018' విజయవాడలోని బెరం పార్కులో ప్రారంభమైంది. » వైమానిక విన్యాసాలను విజయవాడలో నిర్వహించడం ఇది రెండోసారి.¤ దేశవ్యాప్తంగా ‘ఇన్‌స్పైర్' అవార్డుల ఎంపికలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. » 2018-19 సంవత్సరానికి రాష్ట్రం నుంచి మొత్తం 5,698 ప్రాజెక్టులు ఇన్‌స్పైర్ పురస్కారాలకు ఎంపికయ్యాయి. » రాష్ట్ర స్థాయిలో 1772 అవార్డులతో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో, అనంతపురం - 850, నెల్లూరు - 589తో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. చివరి 3 స్థానాల్లో ప్రకాశం - 91, నెల్లూరు - 71, విజయనగరం - 48 జిల్లాలున్నాయి. » ఈ అవార్డు కింద ఎంపికైన ఒక్కో ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.10 వేలు అందిస్తుంది. ఈ మొత్తంతో విద్యార్థులు సైన్సు ప్రాజెక్టులను రూపొందిచవచ్చు.¤ పుట్టపర్తి సాయి కుల్వంత్ మందిరంలో సత్యసాయి 93వ జయంతి వేడుకలను నిర్వహించారు. రూ.45 కోట్లతో నిర్మించిన సత్యసాయి విశ్వవిద్యాలయ పరిశోధన కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. |
నవంబరు 24 |
రాష్ట్రీయం - ఏపీ ¤ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై 2017-18, 2018-19 లలో సవరించిన, ప్రతిపాదించిన బడ్జెట్ అంచనాల ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ కొన్ని పరిశీలనలు చేసి ఓ నివేదికను వెలువరించింది. ముఖ్యాంశాలు రాష్ట్రాలు ఆర్థికంగా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నాయి, రెవెన్యూ ఆదాయం - రెవెన్యూ ఖర్చుల పరిస్థితి ఎలా ఉంది. మొత్తం ఖర్చులో పెట్టుబడి వ్యయం ఎంత? విద్య, వైద్యం వంటి వాటిపై ఎంత ఖర్చు చేస్తున్నాయనే అంశాలపై ఈ పరిశీలన సాగింది. ఈ అంశాల్లో 29 రాష్ట్రాల పరిస్థితులను ఆర్‌బీఐ విశదీకరించింది. రుణ నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మెరుగ్గా ఉందని నివేదిక పేర్కొంది. 2017తో పోలిస్తే స్థూల జాతీయోత్పత్తిలో ఏపీ రుణాల శాతం తగ్గుతోందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ అప్పులు 2016-17 లెక్కల ప్రకారం 36.4 శాతం ఉండగా, 2018-19 బడ్జెట్ అంచనాల్లో అది 27.3 శాతానికి తగ్గిందని పేర్కొంది. 2017-18 సవరించిన అంచనాల్లో జీఎస్‌డీపీలో రుణాలు 28.4 శాతం ఉండగా ప్రస్తుత సంవత్సరం అంచనాల్లో అది తగ్గింది. ఉద్యోగుల వేతనాలపై చేస్తున్న ఖర్చు ఏటా పెరుగుతూనే ఉంది. 2016-17లో ఇది 325.3 బిలియన్ రూపాయలుగా ఉండగా, 2017-18లో 365 బిలియన్ రూపాయలకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ అంచనా 417 బిలియన్ రూపాయలకు పెరిగింది. గత మూడేళ్లుగా ఏపీ బడ్జెట్‌లో విద్యకు కేటాయింపులు పెరుగుతున్నాయి. 2016-17 బడ్జెట్ మొత్తంలో ఇది 12.6 శాతం ఉండగా, 2017-18లో 13 శాతానికి పెరిగింది. ప్రస్తుతం విద్యపై 14 శాతం ఖర్చు చేసేందుకు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ప్రజా వైద్యం, కుటుంబ సంక్షేమంపై సగటున బడ్జెట్‌లో 4 శాతం ఖర్చు చేస్తున్నారు. 2016-17లో 4.7 శాతం, 2017-18లో 4.3 శాతం, ప్రస్తుతం 4.6 శాతం వినియోగిస్తున్నారు. సాంఘిక రంగంలో నిధుల వినియోగం పెరుగుతోంది. సాంఘిక సేవలు, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ ఖర్చు కింద ఆహార నిల్వల కోసం గిడ్డంగుల నిర్మాణం తదితరాలు కలిపి ఈ ఖర్చు ఉంటుంది. 2016-17లో 628 బిలియన్ రూపాయలు, 2017-18లో 795.9 బిలియన్ రూపాయలు ఖర్చు చేయగా ఈ ఆర్థిక సంవత్సరంలో 969 బిలియన్ రూపాయలకు చేరింది. మొత్తం చెల్లింపుల్లో ఈ వాటా 2016-17లో 45.7 శాతం ఉండగా 2017-18లో 51.1 శాతానికి పెరిగింది. రాష్ట్రీయం - టీఎస్¤ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బార్ కౌన్సిల్ తొలి ఛైర్మన్‌గా ఎ. నరసింహా రెడ్డి ఎన్నికయ్యారు. » ఉమ్మడి రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు ఛైర్మన్‌గా ఎన్నికైన నరసింహారెడ్డి మూడోసారి తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. » బార్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్‌గా సునీల్, జనార్ధన రావులు పదవీ కాలాన్ని చెరి సగం పంచుకోనున్నారు. |
నవంబరు 26 |
రాష్ట్రీయం - టీఎస్¤ ప్రపంచ ఆహార భద్రతకు కలిసి పని చేద్దామని ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. » ఇటలీ రాజధాని రోమ్‌లో ఉన్న ఈ సంస్థ ప్రధాన కార్యాలయంలోని వ్యవసాయ వ్యూహాత్మక బృందాలతో రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, విత్తన ధృవీకరణ సంస్థ సంచాలకుడు డాక్టర్ కేశవులు చర్చించారు. రాష్ట్ర వ్యవసాయ రంగం అభివృద్ధికి చేపడుతున్న పథకాలను ప్రజంటేషన్ ద్వారా పార్థసారథి వివరించారు. రాష్ట్రీయం - ఏపీ¤ గుంటూరు జిల్లా నెకరికల్లు వద్ద రూ.6020 కోట్లతో చేపడుతున్న గోదావరి - పెన్నా నదుల అనుసంధానం తొలి దశ పనులకు సంబంధించిన పైలాన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. » ఇక్కడే పేరేచర్ల - కొండమోడు రహదారిని నాలుగు వరసలుగా విస్తరించడానికి రూ.736 కోట్ల పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. |
నవంబరు 27 |
రాష్ట్రీయం - టీఎస్¤ ప్రాజెక్టుల పునరాకృతిలో భాగంగా రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరాసాగర్‌ల స్థానంలో నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల పథకానికి కేంద్రం పర్యావరణ అనుమతులు జారీ చేసింది. » 70.40 టీఎంసీల సామర్థ్యంతో 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు గోదావరి నదిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వద్ద ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. » రూ.7,926.14 కోట్లతో చేపడుతున్న ఈ పథకం ద్వారా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని ఆయకట్టుకు నీరు అందనుంది. రాష్ట్రీయం-ఏపీ¤ అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే కె. ఈరన్న (తెదేపా) ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. » 2014 ఏప్రిల్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో దాఖలు చేసిన ప్రమాణ పత్రం (అఫిడవిట్)లో తనపై కేసు నమోదైన విషయాన్ని, భార్య ప్రభుత్వ ఉద్యోగిని అనే వివరాలను ఉద్దేశ పూర్వకంగా ఆయన గోప్యంగా ఉంచారని కోర్టు స్పష్టం చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్ట నిబంధనలకు ఈ చర్య విరుద్ధమని పేర్కొంది. » పిటిషనర్/వైకాపా అభ్యర్థి ఎం.తిప్పే స్వామి ఆ స్థానానికి ఎమ్మెల్యేగా ఎన్నిక అయినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.సునీల్ చౌదరి తీర్పు వెలువరించారు. |
నవంబరు 29 |
రాష్ట్రీయం-టీఎస్¤ తెలంగాణలో వంద శాతం గృహాలకు విద్యుదీకరణ పూర్తయిందని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ వెల్లడించారు. » కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సౌభాగ్య పతకంలో తెలంగాణ సహా ఎనిమిది రాష్ట్రాలు వంద శాతం లక్ష్యాన్ని చేరుకోగా మొత్తం మీద 15 రాష్ట్రాలు సఫలీకృతం అయ్యాయని మంత్రి వెల్లడించారు.రాష్ట్రీయం-ఏపీ¤ సముద్రంలోకి చేపల వేటకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన 20 మంది మత్స్యకారులు పాకిస్థాన్ చెరలో చిక్కుకున్నారు. » శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన 20 మంది, విజయనగరం జిల్లాకు చెందిన ఐదుగురు జాలర్లు గుజరాత్ తీర ప్రాంతమైన వీరావల్ నుంచి సముద్రంలో చేపల వేటకు బయలుదేరి పొరపాటున పాకిస్థాన్ జలాల్లో ప్రవేశించారు. అక్కడి కోస్ట్ గార్డ్ (మెరైన్ సెక్యూరిటీ) దళాలు 20 మందిని అదుపులోకి తీసుకోగా మిగిలిన ఐదుగురు ఈ ఘటనను దూరంగా గమనించి తప్పించుకున్నారు. » ఏపీకి సంబంధించిన వీరంతా గుజరాత్‌లో చేపల గుత్త వ్యాపారుల వద్ద పనిచేస్తున్నారు.¤ మంత్రి లోకేష్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతమైన యువనాయకుల సరసన ఆయనకు స్థానం దక్కింది. ఎపొలిటికల్ సంస్థ 2018 సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన జాబితాలో ఈయనకు చోటు దక్కింది. » మొదటి 20 స్థానాల్లో నిలిచిన భారతీయుడిగా లోకేష్ గుర్తింపు పొందారు. » ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న వివిధ దేశాల్లోని 35 ఏళ్లలోపు యువ నాయకుల జాబితాను ఎపొలిటికల్ సంస్థ వెల్లడించింది. » కెనడా ప్రభుత్వం, ప్రపంచ ఆర్థిక వేదిక బెర్నార్డ్ వాన్‌వీర్, యూరోపియన్ కమిషన్ భాగస్వామ్యంతో ఈ సంస్థ పనిచేస్తుంది. |
నవంబరు 30 |
రాష్ట్రీయం - టీఎస్¤ పర్యావరణం, పర్యాటక రంగ పురోభివృద్ధి కార్యక్రమాల విభాగంలో తెలంగాణకు పురస్కారం లభించింది. » లఖ్‌నవూలో జరిగిన ‘స్మార్ట్ నగరాల సదస్సు'లో ఈ పురస్కారాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం స్వీకరించారు.¤ విద్య, సాంస్కృతిక రంగాల్లో పరస్పర సహకారానికి అనువుగా తెలంగాణ ప్రభుత్వం, బ్రిటిష్ కౌన్సిల్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. » భాష, నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ, అవకాశాల కల్పన రంగాల్లో మరింత కృషి చేసేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుంది. రాష్ట్రీయం -డిసెంబరు - 2018 రాష్ట్రీయం |
No comments:
Post a Comment