కరెంట్ అఫైర్స్ >> రాష్ట్రీయం -డిసెంబరు - 2018 రాష్ట్రీయం

డిసెంబరు - 2018 రాష్ట్రీయం
 డిసెంబరు - 1
రాష్ట్రీయం - ఏపీ¤ ఐక్యరాజ్య సమితి జనరల్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో రెండు రోజులపాటు ‘డిజిటల్‌ కో ఆపరేషన్‌' అనే అంశంపై నిర్వహిస్తున్న ఉన్నత స్థాయి సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ పాల్గొంది. రాష్ట్రం నుంచి ఈ-ప్రగతి ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఈవో) బాలసుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.       » భారత్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం దక్కింది.
 డిసెంబరు - 2
రాష్ట్రీయం - ఏపీ¤ రాష్ట్ర విభజన అనంతరం జరిగిన మొదటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా ఘంటా రామారావు ఎన్నికయ్యారు.¤ గుజరాత్‌లోని సియాక్‌ (సూరత్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌)లో జరిగిన 12వ ‘ప్రకాష్‌ మే ఎనర్షియా - 2018' కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ మూడు పురస్కారాలను గెల్చుకుంది.       » సుస్థిర విద్యుత్తురంగంలో భారీ పెట్టుబడులకు అనుకూలం, మౌలిక సౌకర్యాల కల్పనలో ఉత్తమ రాష్ట్రం, విద్యుత్తు ఉత్పత్తిలో దేశంలోనే ఉత్తమ పనితీరు విభాగాల్లో పురస్కారాలను గెలుచుకుంది.       » ఇంధన పునరుత్పాదక వనరుల విభాగంలో ట్రాన్స్‌కో సీఎండీ కె. విజయానంద్‌కు ప్రతిష్ఠాత్మక యోమెన్‌ జీవిత సాఫల్య పురస్కారం (లైఫ్‌ టైమ్‌ యోమెన్‌ కంట్రిబ్యూషన్‌) ప్రదానం చేశారు.       » తాజా పురస్కారాలతో రాష్ట్ర విద్యుత్తుశాఖ మొత్తం 105 అవార్డులను గెలుచుకుందని ఇంధన శాఖ ప్రకటించింది.
డిసెంబరు - 4
రాష్ట్రీయం - ఏపీ¤ చైనాకు చెందిన బహుళ జాతి సంస్థ, ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం సన్నీ ఆప్టికల్‌ టెక్నాలజీస్‌ ఏపీలో రూ.500 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో 4 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.¤ గన్నవరం విమానాశ్రయం ఏకీకృత అంతర్జాతీయ టెర్మినల్‌ భవనానికి భూమిపూజ నిర్వహించడంతో పాటు సింగపూర్‌ విమాన సర్వీసును ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పౌర విమానయానశాఖ మంత్రి సురేష్‌ ప్రభుతో కలిసి ప్రారంభించారు.        » ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విమానాశ్రయాన్ని రూ.611 కోట్లతో అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేయడం దేశంలో ఇదే ప్రథమమని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా వెల్లడించారు.
డిసెంబరు - 5
రాష్ట్రీయం - టీఎస్‌¤ తెలంగాణలో కంటి వెలుగు పథకం కింద డిసెంబరు 3 నాటికి 1,00,02,544 మంది నేత్ర పరీక్షలు చేయించుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని 2018 ఆగస్టు 15న ప్రారంభించారు        » అత్యధికంగా హైదరాబాద్‌లో 7,70,797 మంది, అతి తక్కువగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,71,877 మంది ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకున్నారు.రాష్ట్రీయం - ఏపీ¤ విజయవాడలో కేవలం 9 గంటల్లోనే 21,233 మందికి దంత పరీక్షలు నిర్వహించారు. దీంతో గిన్నిస్‌ రికార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌ గుజరాత్‌ను అధిగమించింది. 2016లో గుజరాత్‌ 24 గంటల్లో 14,970 మందికి దంత వైద్య పరీక్షలు జరిపింది.
డిసెంబరు - 6
రాష్ట్రీయం - ఏపీ¤ మేకిన్‌ ఇండియా స్ఫూర్తిగా భారత్‌ నుంచి ప్రపంచానికి అనే నినాదంతో చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం పారిశ్రామిక నగరం శ్రీసిటీలోని అల్‌స్టోమ్‌ పరిశ్రమ నుంచి సిడ్నీకి రైళ్లను అందించడంలో కీలక మైలు రాయిని అధిగమించింది.        » ఆస్త్రేలియాలోని సిడ్నీ మెట్రో రైలు కోసం ఇవ్వాల్సిన 22 మెట్రో పాలిస్‌ ట్రైన్‌లలో డ్రైవర్‌ రహిత చివరి రైలును శ్రీసిటీలోని అల్‌స్టోమ్‌ పరిశ్రమ నుంచి అందజేశారు.¤ ప్రపంచ ఆటో దిగ్గజ సంస్థ కియా మోటార్స్‌ రాష్ట్ర సచివాలయంలో ఈ-కార్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు.        » ఈ సందర్భంగా ‘భవిష్యత్తు తరం పర్యావరణ రవాణా' పై కియా మోటార్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు రాష్ట్రంలోని ఆకర్షణీయ పట్టణాలు, నగరాలలో పర్యావరణహిత ఆధునిక రవాణా వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వానికి కియా మోటార్స్‌ భాగస్వామిగా ఉంటుంది. ¤ ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు రావి కోటేశ్వరరావు (94) హైదరాబాద్‌లో మరణించారు.        » గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లికి చెందిన ఆయన క్విట్‌ ఇండియా ఉద్యమ కాలంలో పాల్గొని బళ్లారి జైలులో శిక్ష అనుభవించారు.
డిసెంబరు - 7
రాష్ట్రీయం - ఏపీ¤ సీఆర్‌డీఏ, సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజీ అండ్‌ లీడర్‌షిప్‌ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ ఇండియాస్‌ ఎమర్జింగ్‌ నాలెడ్జ్‌ క్యాపిటల్‌ అంశంపై దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో సదస్సు నిర్వహించారు.
డిసెంబరు - 8
రాష్ట్రీయం - టీఎస్‌
¤ తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ శాతం తుది గణాంకాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 73.20 శాతం పోలింగ్‌ జరిగిందని అధికారులు ప్రకటించారు
.
        » ఓట్లు వేసినవారిలో మహిళలు 73.88 శాతం, పురుషులు 72.54 శాతం ఉన్నారు
.
        »రాష్ట్రంలోనే అత్యధికంగా మధిర నియోజకవర్గంలో 91.65 శాతం, అత్యల్పంగా చార్మినార్‌ నియోజకవర్గంలో 40.18 శాతం పోలింగ్‌ నమోదైంది
.
¤ తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలకు చెందిన 12 మంది విద్యార్థులు సిక్కింలోని లేక్‌ పకంచీ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించారు
.
        » 18,200 అడుగుల ఎత్తైన పర్వతాన్ని అధిరోహించిన ఈ బృందంలో 8 మంది బాలురు, నలుగురు బాలికలు ఉన్నారు
.
¤ అరుదైన కిన్నెర కళాకారిణి డక్కలి బాలమ్మ (90) వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్‌ మండలం ముంబాపూర్‌లో మరణించారు
.
రాష్ట్రీయం - ఏపీ
¤ గుంటూరు జిల్లాలో ఆచార్య నాగార్జున వర్సిటీ సమీపంలో ప్రకృతి వ్యవసాయ సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ విధానంపై డిసెంబరు 17 వరకూ శిక్షణ ఇవ్వనున్నారు
.
        » తెలుగు రాష్ట్రాల నుంచి 9000 మంది రైతులు హాజరయ్యారు.
డిసెంబరు - 10
రాష్ట్రీయం - టీఎస్‌
¤ గస్తీలో ఉన్న మహిళా సిబ్బందికి ప్రాధాన్యం కల్పిస్తూ ‘ఉమెన్‌ ఆన్‌ వీల్స్‌ (వావ్‌)' పేరుతో ప్రత్యేక బృందాలను హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ విభాగం ఏర్పాటు చేసింది
.
        » దేశంలోనే తొలిసారిగా కంబాట్‌ సిస్టమ్‌లో శిక్షణ తీసుకుని రంగంలోకి దిగుతున్న ఈ టీమ్స్‌ను నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ హైదరాబాద్‌లోని గోషామహల్‌ స్టేడియంలో ఆవిష్కరించారు
.
        » సుశిక్షితులైన 43 మందితో 20 వావ్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. వీరు బ్లూ కోల్ట్స్‌లో అంతర్భాగంగా ఒక్కో ద్విచక్రవాహనంపై ఇద్దరు చొప్పున గస్తీ తిరుగుతూ ఉంటారు. తొలిదశలో నగరంలోని 7 డివిజన్లకూ ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు.
డిసెంబరు - 12
రాష్ట్రీయం-ఏపీ¤ ఆంధ్రప్రదేశ్‌లో 132 మిల్లులు ఉండగా, గత 30 ఏళ్లలో కేవలం 22 నూలు, మ్యాన్‌ మేడ్‌ ఫైబర్‌ మిల్లులు మాత్రమే మూత పడ్డాయని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రకటించింది.        » వస్త్ర పరిశ్రమ ద్వారా ఉపాధి కల్పన, ఎగుమతుల పెంపునకు 2016లో రూ.6 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినట్లు తెలిపింది. మర మగ్గాల ఆధునికీకరణ, మౌలిక వసతుల మెరుగుకు రూ.487 కోట్లతో సమగ్ర పథకాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించింది.¤ మడకశిర ఎమ్మెల్యే కె. ఈరన్న ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు పేర్కొంది.        » ఎన్నికల ప్రమాణపత్రంలో క్రిమినల్‌ కేసును వెల్లడించనందుకు శాసనసభ అభ్యర్థిత్వం చెల్లదని ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ఈరన్న సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఉమ్మడి హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఈరన్న పిటిషన్‌ను కొట్టివేసింది.
డిసెంబరు - 13
రాష్ట్రీయం - టీఎస్‌¤ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ నరసింహన్‌ ఆయనతో ప్రమాణం చేయించారు        » కేసీఆర్‌తోపాటు మంత్రిగా మహమూద్‌ అలీ కూడా ప్రమాణం చేశారు.        » మహమూద్‌ అలీకి సీఎం కేసీఆర్‌ అత్యంత కీలకమైన హోం మంత్రిత్వ శాఖను కేటాయించారు.        » తెలంగాణలో 97 రోజుల తర్వాత కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సెప్టెంబరు 6న శాసనసభ రద్దయింది.రాష్ట్రీయం - ఏపీ¤ ప్రభుత్వ నిధులతో దేశంలోనే తొలిసారిగా నిర్మించిన వైద్య పరికరాల పార్క్‌ మెడ్‌టెక్‌ జోన్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు జాతికి అంకితం చేశారు.        » విశాఖ ఉక్కు పరిశ్రమ సమీపంలోని ప్రగతి మైదాన్‌లో దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. కీలకమైన పలు భవనాలు, పారిశ్రామిక యూనిట్లను సీఎం ఈ సందర్భంగా ప్రారంభించారు. ఇదే ప్రాంగణంలో కలాం కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటుచేసిన నాలుగో డబ్ల్యూహెచ్‌వో వైద్య పరికరాల ప్రపంచ సదస్సును కూడా సీఎం ప్రారంభించారు. 90 దేశాల నుంచి 1049 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సును ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు.        » మెడ్‌టెక్‌ జోన్‌ను ప్రపంచ ఆదర్శనీయ హబ్‌గా మార్చేందుకు ‘వయడక్ట్‌' విధానాన్ని పాటిస్తామని సీఎం పేర్కొన్నారు.
డిసెంబరు - 14
రాష్ట్రీయం - ఏపీ¤ ఆంధ్రప్రదేశ్‌ ఇంధన సంరక్షణ మిషన్‌ (ఏపీఎస్‌ఈసీఎం)కు 2018 సంవత్సరానికి జాతీయ ఇంధన సంరక్షణ అవార్డు (ఎన్‌ఈసీఏ) లభించింది.        » జాతీయ ఇంధన సంరక్షణ దినం సందర్భంగా ఇంధన సామర్థ్య సంస్థ (బీఈఈ) ఆధ్వర్యంలో దిల్లీలో జరిగిన కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్, కేంద్రమంత్రి ఆర్‌కే సింగ్‌ చేతుల మీదుగా సీఈఓ చంద్రశేఖర రెడ్డి ఈ పురస్కారాన్ని అందుకున్నారు.        » ప్రభుత్వ సంస్థల విభాగంలో వరుసగా నాలుగో ఏడాది ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్‌కే దక్కింది.        » డిస్కంల విభాగంలో విద్యుత్తు పొదుపు, ఉత్తమ పనితీరుకు ఏపీఎస్పీడీసీఎల్‌కు సర్టిఫికెట్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డు లభించింది.
డిసెంబరు - 16
రాష్ట్రీయం - టీఎస్‌
¤ రాష్ట్రంలో నూతనంగా నారాయణ పేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్‌ దీనికి అనుగుణంగా కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ రెండింటితో జిల్లాల సంఖ్య 33కి చేరుతుంది
.
        » ప్రస్తుతం 69 రెవెన్యూ డివిజన్లు ఉండగా, కొత్తగా కోరుట్లకు ఆమోదం తెలపడంతో వీటి సంఖ్య 70కి పెరగనుంది. మరోవైపు 438 మండలాలు ఉండగా, కొత్తగా మరో ఆరు కలవడంతో వీటి సంఖ్య 444కి చేరుతుంది. ఇవికాక మరిన్ని రెవెన్యూ డివిజన్లు, మండలాలు కూడా ఏర్పాటయ్యే వీలుంది.
రాష్ట్రీయం - ఏపీ
¤ ‘పెథాయ్‌' తీవ్ర తుపానుగా మారింది
.
        » పెథాయ్‌ ప్రభావంతో ఏపీలోని కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిశాయి
.
        » ఈ తుపానుకు థాయిలాండ్‌ దేశం ‘పెథాయ్‌' అని పేరు పెట్టింది
.
        » ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన ‘తిత్లి' తుపానుకు పాకిస్థాన్, ‘గజ' తుపానుకు శ్రీలంక దేశాలు పేర్లను సూచించాయి.
డిసెంబరు - 17
రాష్ట్రీయం - ఏపీ
¤ పెథాయ్‌ తుపాను రాష్ట్రంలో ఈదురు గాలులు, భారీ వర్షాలతో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. రాష్ట్రవ్యాప్తంగా తుపాను ప్రభావంతో వీచిన చలిగాలులకు 23 మంది మృతి చెందారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 3.87 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వెల్లడైంది
.
¤ పోలవరం ప్రాజెక్టుకు ప్రతిష్ఠాత్మక కేంద్ర జలవిద్యుత్తు బోర్డు అవార్డు (సీబీఐపీ) దక్కింది. 2019 సంవత్సరానికి బెస్ట్‌ ఇంప్లిమెంటేషన్‌ ఆఫ్‌ జలవనరుల ప్రాజెక్టుగా అవార్డు ఇస్తున్నట్లు ప్రకటించింది
.
        » పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరిగేందుకు అనుసరిస్తున్న విధానాలకే ఈ అవార్డు దక్కినట్లు వెల్లడించింది. సీబీఐపీ 1927 నుంచి కొన్ని రంగాల్లో విశిష్ట సేవలు అందించినందుకు, ఘనతలు సాధించినందుకు ఈ అవార్డులు అందిస్తూ వస్తోంది
.
¤ దక్షిణ కొరియాలోని సియోల్‌ జాతీయ విశ్వవిద్యాలయంతో ఆచార్య నాగార్జున వర్సిటీ పరిశోధనల్లో భాగస్వామ్యం, విద్యార్థి, అధ్యాపకుల మార్పునకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది
.
¤ రాష్ట్రంలో చేరువ కార్యక్రమాల్లో భాగంగా ప్రవేశపెట్టిన శక్తి టీమ్‌ను విజయవాడలో డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ ప్రారంభించారు
.
        » ఈ బృందానికి కమ్యూనికేషన్‌ స్కిల్స్, ఆత్మరక్షణ పద్ధతులు, ఈత, డ్రైవింగ్‌ తదితర అంశాల్లో పూర్తిగా శిక్షణ ఇచ్చారు. శక్తి బృందం మహిళలకు పూర్తి భరోసా ఇస్తుందని ఆయన పేర్కొన్నారు
.
        » వివిధ జిల్లాల్లో రకరకాలుగా పిలిచే పోలీసింగ్‌ను ఇక నుంచి శక్తిగా పిలుస్తారని వెల్లడించారు
.
రాష్ట్రీయం - టీఎస్‌
¤ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్‌ బాధ్యతలు చేపట్టారు.
డిసెంబరు - 19
రాష్ట్రీయం - ఏపీ¤ రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో (పీపీపీ) అత్యాధునికమైన క్యాథ్‌ల్యాబ్‌ సేవలు గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రిలో అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ గుండె, మెదడుకు సంబంధించి 24 గంటలూ వైద్య సేవలు అందనున్నాయి.        » ఈ క్యాథ్‌ల్యాబ్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు.
డిసెంబరు - 20
రాష్ట్రీయం-ఏపీ¤ తిరుపతి సమీపంలోని ఎలక్ట్రానిక్స్‌ పరికరాల తయారీ కేంద్రాలన్నింటినీ (ఈఎంసీ) కలిపి సిలికాన్‌ నగరం (సిలికాన్‌ సిటీ)గా గుర్తిస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.        » నెల్లూరు-తిరుపతి-చెన్నై కారిడార్‌ను సిలికాన్‌ కారిడార్‌గా పిలవాలని పేర్కొన్నారు.        » తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఏర్పేడు మండలం వికృతమాల వద్ద 158 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న టెలీ కమ్యూనికేషన్‌ లిమిటెడ్‌ (టీసీఎల్‌) పరిశ్రమకు సీఎం భూమి పూజ చేశారు.¤ విశాఖ ఓడరేవు (వీపీటీ) దేశంలోని పరిశుభ్రమైన పోర్టుల్లో రెండో స్థానాన్ని పొందింది. వరుసగా మూడోసారి ఈ గౌరవం దక్కించుకుంది        » కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్‌ పేరిట ఓడరేవులకు ఏటా ఈ అవార్డులను అందజేస్తుంది.
డిసెంబరు - 21
రాష్ట్రీయం - టీఎస్‌¤ ఇప్పటివరకు పరిగణనలో ఉన్న గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖను మిషన్‌ భగీరథ శాఖగా మార్చుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.        » ఇప్పటికే గ్రామీణ నీటి సరఫరా శాఖకు సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ మిషన్‌ భగీరథ పేరిట చేపట్టారు. ప్రజాదరణ లభించడం, అందరికీ ఇది చేరువ కావడం, దేశవ్యాప్తంగా ఈ పథకానికి ఖ్యాతి రావడం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.¤ తెలంగాణ మొదటి శాసనసభాపతి మధుసూదనాచారికి శాసనసభ అధికారులు, సిబ్బంది వీడ్కోలు పలికారు.        » శాసనసభ కమిటీ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్, శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు, ఇతర నేతలు పాల్గొన్నారు.¤ ఎకనామిక్స్‌ టైమ్స్‌ నౌ అందజేసే ‘స్టార్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అండ్‌ ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా' పురస్కారాల్లో భాగంగా తెలంగాణ పోలీసు శాఖ రెండు విభాగాల్లో పురస్కారాలు గెలుచుకుంది. దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పురస్కారాలను అందించారు.        » సాంకేతిక పరిజ్ఞానం వినిమయంలో దేశానికే మార్గదర్శకంగా ఉండేలా సీసీ కెమెరాల ప్రాజెక్టు ఏర్పాటు చేసినందుకు హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనరేట్‌కు టెస్ట్‌ స్మార్ట్‌ సిటీ సర్వైలెన్స్‌ పురస్కారం అందజేశారు.        » అలానే హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ నిర్వహణకు కృత్రిమ మేధ ఉపయోగిస్తున్నందుకు బెస్ట్‌ స్మార్ట్‌ అర్బన్‌ ట్రాఫిక్‌ అవార్డును కూడా హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనరేట్‌కు అందజేశారు.రాష్ట్రీయం - ఏపీ, టీఎస్‌¤ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు నీటిని కేటాయిస్తూ కృష్ణానదీ యాజమాన్య బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చేసిన కేటాయింపులు, జరిగిన వినియోగం పోను మిగిలిన నీటిలో ఆయా రాష్ట్రాలకు ఉన్న వాటాలను బట్టి కేటాయింపులు చేసింది.        » దీని ప్రకారం తెలంగాణకు 55.90 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 33.40 టీఎంసీలు వచ్చాయి.రాష్ట్రీయం - ఏపీ¤ గుంటూరు జిల్లా లాం గ్రామంలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రూ.1.75 కోట్లతో నిర్మించనున్న ఉపగ్రహ ఆధారిత వ్యవసాయ పర్యవేక్షణ కేంద్రం, రూ.1.05 కోట్లతో నిర్మించనున్న మార్కెట్‌ నిఘా కేంద్రం నిర్మాణాలకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.
డిసెంబరు - 22
రాష్ట్రీయం - టీఎస్‌, ఏపీ¤ పౌర సేవలు, అభివృద్ధి, వినూత్న, పథకాలు, సంస్కరణల అమలు అంశాల ప్రాతిపదికన అందించే స్కోచ్‌ అవార్డుల్లో తెలంగాణకు 18, ఆంధ్రప్రదేశ్‌కు 9 అవార్డులు దక్కాయి. దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఈ అవార్డులు ప్రదానం చేశారు        » తెలంగాణ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఏడు అవార్డులను దక్కించుకుంది.        » ఆంధ్రప్రదేశ్‌ ఈ-ప్రగతి అథారిటీకి 5 అవార్డులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ్‌ బ్యాంక్‌కు రెండు, రవాణాశాఖకు ఒకటి, పెట్టుబడుల ప్రోత్సాహం, సౌకర్యాల కల్పన విభాగంలో ఏపీ ఆర్థికాభివృద్ధి మండలికి ఒక అవార్డు దక్కాయి.
డిసెంబరు - 23
రాష్ట్రీయం - టీఎస్‌¤ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు సరికొత్త రికార్డును నమోదు చేసింది. ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి మేడిగడ్డ బ్యారేజి కాంక్రీటు పనుల విషయంలో ఈ ఘనత సాధించింది.        » డిసెంబరు 22 ఉదయం 8 గంటల నుంచి 23 ఉదయం 8 గంటల వరకు 23 గంటల వ్యవధిలో 16,722 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనులను (రెయిన్‌ఫోర్స్‌డ్‌ సిమెంట్‌ కాంక్రీటు) విజయవంతంగా పూర్తిచేశారు. గతంలో ఇదే బ్యారేజీ నిర్మాణంలో 7,212 క్యూబిక్‌ మీటర్ల రికార్డు ఉంది. రాష్ట్రీయం - ఏపీ¤ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని ప్రజావేదికలో ఏపీ విభజన చట్టం హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేశారు. వరుస శ్వేత పత్రాల్లో భాగంగా తొలుత విడుదల చేసిన ఈ పత్రంలో కేంద్ర వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం తూర్పారబట్టింది. విభజన చట్టంలో మొత్తం 14 అంశాలకుగాను ఒక్కదాన్ని కూడా కేంద్రం పూర్తిగా అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
డిసెంబరు - 24
రాష్ట్రీయం - టీఎస్‌¤ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు మార్గం సుగమమైంది. పంచాయతీరాజ్‌ శాఖ రిజర్వేషన్లను ఖరారు చేసింది.        » మొత్తం 12,751 పంచాయతీల్లో షెడ్యూల్‌ ప్రాంతాలకు 1281, ఎస్టీలకు 1177 పంచాయతీలను (100 శాతం ఎస్టీ జనాభా ఉన్న ప్రాంతాలకు) కేటాయించింది. మిగిలిన 10,293 పంచాయతీల్లో రిజర్వేషన్లు ప్రకటించింది. మొత్తంలో 50 శాతం పంచాయతీలను మహిళలకు కేటాయించారు.        » షెడ్యూల్‌ ప్రాంతాలు, 100 శాతం ఎస్టీలకు కేటాయించిన పంచాయతీలు పోను మిగిలిన వాటిలో 22.79 శాతం అంటే 2345 పంచాయతీలను బీసీలకు కేటాయించారు. ఎస్సీలకు 2,113 (20.53 శాతం), ఎస్టీలకు 688 (6.68 శాతం) పంచాయతీలు కేటాయించారు.        » సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్సు ప్రకారం యాభై శాతానికి మించకుండానే రిజర్వేషన్ల కేటాయింపులు పూర్తి చేశారు. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొని ప్రక్రియ పూర్తి చేశారు.¤ రాష్ట్రంలో పురపాలక సంఘాల్లోని వీధి దీపాల సమస్యల పరిష్కారానికి పురపాలక శాఖ టోల్‌ఫ్రీ నంబరు (1800 180 3580) ను అందుబాటులోకి తీసుకొచ్చింది.రాష్ట్రీయం - ఏపీ¤ గత నాలుగేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మొత్తం 615 పురస్కారాలు లభించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
        » ఇంధన శాఖకు అత్యధికంగా 107 పురస్కారాలు లభించాయి. ఆ తర్వాత స్థానంలో పురపాలక పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖలున్నాయి.
డిసెంబరు - 25
రాష్ట్రీయం - ఏపీ¤ ‘సామాజిక సాధికారత - సంక్షేమం' అనే అంశంపై సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని ప్రజావేదికలో శ్వేత పత్రం విడుదల చేశారు.        » నాలుగున్నరేళ్లలో సంక్షేమంపైనే రూ.లక్ష కోట్లకు పైగా వెచ్చించినట్లు వివరించారు. రైతులకు రూ.24 వేల కోట్ల రుణ ఉపశమనం, డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం దీనికి అదనమని పేర్కొన్నారు.
డిసెంబరు - 26
రాష్ట్రీయం - టీఎస్‌¤ కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎస్‌) ఏడో దశ సీవోడీ (కమర్షియల్‌ ఆపరేషన్‌ డిక్లరేషన్‌) విజయవంతమైంది.        » జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.రాష్ట్రీయం - ఏపీ¤ సీఎం చంద్రబాబు రైతు సంక్షేమంపై శ్వేతపత్రం విడుదల చేశారు.        » రైతు సంక్షేమం కోసం గత నాలుగున్నరేళ్లలో రూ.82 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. 2013-14లో రూ.6128 కోట్లుగా ఉన్న వ్యవసాయ బడ్జెట్‌ను 2018-19 నాటికి రూ.19,070 కోట్లకు పెంచామని వెల్లడించారు.¤ 2013-14లో రూ.1.25 లక్షల కోట్లుగా ఉన్న వ్యవసాయ ఆదాయాన్ని 2017-18 నాటికి రూ.2.52 లక్షల కోట్లకు పెంచగలిగామని తెలిపారు.
డిసెంబరు - 27
రాష్ట్రీయం - ఏపీ, టీఎస్‌¤ ఆకాంక్షిత (ఆస్పిరేషనల్‌) జిల్లాల ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల్లోని ఆరు జిల్లాలు వెనుకబడ్డాయి. 2018 జూన్‌లో విడుదల చేసిన తొలి డెల్టా ర్యాంకింగ్‌లతో పోలిస్తే రెండో విడత ర్యాంకుల్లో ఏపీలోని మూడు, తెలంగాణలోని మూడు జిల్లాల పరిస్థితుల్లో మార్పులు కనిపించాయి.
        » ఇదివరకు 4వ స్థానంలో ఉన్న విజయనగరం 11కు, 5వ స్థానంలో ఉన్న కడప 19కి, 14వ స్థానంలో ఉన్న విశాఖపట్నం 106కు చేరాయి
.
        » 15వ ర్యాంకులో ఉన్న ఆసిఫాబాద్‌ 56కి, 22వ స్థానంలో ఉన్న భూపాలపల్లి 35కి, 11వ స్థానంలో ఉన్న ఖమ్మం 68కి చేరాయి
.
        » 2018 జనవరిలో నీతి ఆయోగ్‌ తొలిసారిగా ఆకాంక్షిత జిల్లాల గుర్తింపు మొదలు పెట్టింది. దేశంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన 112 జిల్లాలను ఆకాంక్షిత జిల్లాల జాబితాలో చేర్చింది. విద్య, వైద్యం, వ్యవసాయం, ఆర్థికం, నైపుణ్యాభివృద్ధి, ప్రాథమిక మౌలిక వసతుల కల్పనలో ఆ జిల్లాలు ఎంత పురోగతి సాధించిందో వివరిస్తూ ఆరునెలలకోసారి ర్యాంకులు వెల్లడిస్తోంది. అందులో భాగంగా జూన్‌లో తొలిసారి ర్యాంకులు వెల్లడించిన నీతి ఆయోగ్‌ డిసెంబరులో రెండో దఫా ర్యాంకులు విడుదల చేసింది
.
        » ఓవరాల్‌ ర్యాంకింగ్‌ల్లో ఈసారి విరుద్‌నగర్‌ (తమిళనాడు), నౌపాడ (ఒడిశా), సిద్ధార్థనగర్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌), ఔరంగాబాద్‌ (బిహార్‌), కోరాపుట్‌ (ఒడిశా)లు తొలి ఐదు స్థానాలను ఆక్రమించాయి
.
¤ దిగువ కోర్టుల్లో పనిచేస్తున్న న్యాయాధికారులను తెలుగు రాష్ట్రాల మధ్య తుది కేటాయింపు చేస్తూ ఉమ్మడి హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది
.
        » ఆంధ్రప్రదేశ్‌కు 539 మంది, తెలంగాణకు 362 మంది న్యాయాధికారులను కేటాయిస్తూ ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ (ఆర్‌జీ) సీహెచ్‌ మానవేంద్ర నాథ్‌రాయ్‌ ఉత్తర్వులిచ్చారు
.
        » జిల్లా జడ్జి (డీజే) కేడర్‌ న్యాయాధికారులు 110 మంది, సీనియర్‌ సివిల్‌ జడ్జి (ఎస్‌సీజే) కేడర్‌ న్యాయాధికారులు 132 మంది, జూనియర్‌ సివిల్‌ జడ్జి (జేసీజే) కేడర్‌ న్యాయాధికారులు 297 మందిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు
.
        » తెలంగాణకు 90 మంది జిల్లా జడ్జి కేడర్‌ న్యాయాధికారులు, 71 మంది ఎస్‌సీజే కేడర్‌ న్యాయాధికారులు, 201 మంది జేసీజే కేడర్‌ న్యాయాధికారులను కేటాయించారు
.
రాష్ట్రీయం - టీఎస్‌
¤ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌ 2019 నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు.
        » ఆయనతో పాటు ప్రస్తుతం అక్కడే విధులు నిర్వహిస్తున్న న్యాయమూర్తులు జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, జస్టిస్‌ వి. రామ సుబ్రమణియన్‌లను తెలంగాణ హైకోర్టుకు కేటాయిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి హైకోర్టులో సేవలందిస్తున్న 27 మంది న్యాయమూర్తుల్లో 14 మందిని ఏపీకి, 13 మందిని తెలంగాణకు కేటాయించినట్లయింది
.
రాష్ట్రీయం - ఏపీ
¤ 2019, జనవరి 1 ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మొదటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సి. ప్రవీణ్‌కుమార్‌ నియమితులయ్యారు.
        » ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు కేటాయించిన 14 మంది న్యాయమూర్తుల్లో అందరికంటే సీనియర్‌ కావడంతో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 223 ప్రకారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆయన్ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమించినట్లు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది
.
        » జస్జిస్‌ ప్రవీణ్‌కుమార్‌ ప్రముఖ సీనియర్‌ న్యాయవాది దివంగత సి. పద్మనాభరెడ్డి కుమారుడు. 1961, ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో జన్మించారు. 1986, ఫిబ్రవరి 28న ఆంధ్రప్రదేశ్‌ బార్‌కౌన్సిల్‌లో సభ్యత్వం తీసుకున్నారు. 2012, జూన్‌ 29న ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2013, డిసెంబరు 4న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు
.
¤ సహజవనరుల నిర్వహణపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు
.
        » 2014 తర్వాత సాగునీటి రంగంలో రూ.63,657.52 కోట్లు ఖర్చు చేసి 32.02 లక్షల ఎకరాలకు నీటి భరోసా కల్పించినట్లు పేర్కొన్నారు.
డిసెంబరు - 28
రాష్ట్రీయం - ఏపీ¤ విశాఖ జిల్లా అనకాపల్లిలో ‘పేదరికంపై గెలుపు' పేరుతో నిర్వహించిన మూడో విడత వస్తు సముదాయాల పంపిణీ కార్యక్రమం (గ్రౌండింగ్‌ మేళా)లో 17,438 మంది లబ్ధిదారులకు రూ.234 కోట్ల విలువైన పథకాలను సీఎం చంద్రబాబు అందించారు.¤ ‘మానవ వనరులు - సామాజికాభివృద్ధి' అనే అంశంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. నాలుగున్నరేళ్లలో మానవ వనరుల అభివృద్ధికి రూ.1,31,000 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.¤ సేంద్రీయ వ్యవసాయ విధానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉద్యానశాఖకు జైవిక్‌ ఇండియా పురస్కారం దక్కింది        » సేంద్రీయ సాగు చేసే రాష్ట్రాలకు కర్ణాటక ప్రభుత్వం, ఐకోవా సంయుక్తంగా 2017 నుంచి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నాయి.        » దక్షిణ భారతదేశం నుంచి 2018 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.¤ డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ మంగళగిరిలోని ఏపీ పోలీసు ప్రధాన కార్యాలయంలో 2018 వార్షిక నేర నివేదిక విడుదల చేశారు        » 2017తో పోలిస్తే మొత్తంగా ఈ ఏడాది నమోదైన కేసుల సంఖ్య 3.49 శాతం మేర తగ్గింది.
డిసెంబరు - 29
రాష్ట్రీయం - ఏపీ ¤ రాష్ట్రంలోని ప్రజా రవాణా వాహనాల్లో తిరిగే బాలికలు, మహిళలకు భద్రత కల్పించే ఉద్దేశంతో రవాణా శాఖ ప్రవేశపెట్టిన అభయ ప్రాజెక్టు గోడ పత్రికను సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద విడుదల చేశారు        » రాష్ట్రంలో ప్రస్తుతం 5.49 లక్షల ప్రయాణికుల రవాణా వాహనాలున్నాయని, వాటిలో లక్ష వాహనాల్లో అభయ ప్రాజెక్టు పరికరాలను అమర్చాలని నిర్ణయించారు.¤ ‘ఇంధన రంగం - మౌలిక వసతుల కల్పన'పై సీఎం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు        » నాలుగున్నరేళ్లలో విద్యుత్తు రంగంలో 138 అవార్డులు సాధించడమే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ పనితీరుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వ విధానాల కారణంగా 2014లో రూ.6.49గా ఉన్న యూనిట్‌ సౌర విద్యుత్‌ ఇప్పుడు రూ.2.70గా ఉన్నట్లు పేర్కొన్నారు. నాలుగున్నరేళ్ల కిందట 22 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు లోటు ఉండేదని, దాన్ని అధిగమించి మిగులు విద్యుత్తు స్థాయికి చేరినట్లు వివరించారు.        » ఆనందదాయక అమరావతి, విమానయానం, నౌకాయానం, సహజవాయు నెట్‌వర్క్, ఇంటికే డిజిటల్‌ సేవలు, ఎక్స్‌ప్రెస్‌ రహదారి, ఆర్థిక నగరాలు తదితరాల అభివృద్ధిని ఈ శ్వేతపత్రంలో వివరించారు.రాష్ట్రీయం - టీఎస్‌ ¤ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో (ప్యాక్స్‌) సభ్యులుగా ఉన్న రైతుల పంట రుణ బకాయి రూ.లక్ష వరకు ఉండి ఎగవేతదారుల జాబితాలో ఉన్నప్పటికీ వారికి ప్యాక్స్‌ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తూ రాష్ట్ర సహకార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.        » రూ.లక్ష కంటే ఎక్కువ బాకీ ఉన్న రైతులు అదనపు మొత్తాన్ని వెంటనే చెల్లిస్తే ప్యాక్స్‌ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
డిసెంబరు - 30
రాష్ట్రీయం-టీఎస్‌¤ 2018 సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై హైదరాబాద్‌లో డిజీపీ మహేందర్‌రెడ్డి వార్షిక నివేదిక విడుదల చేశారు.        » రాష్ట్రంలో ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ముఖ్యమైన నేరాలు ఐదు శాతం తగ్గాయి. అన్నింటికంటే ముఖ్యంగా గొలుసు దొంగతనాలు 43% తగ్గాయి. మొత్తం కేసుల్లో శిక్షలు పడిన శాతం పెరగడం మరో కీలకమైన అంశం. జీవిత ఖైదు 11%, ఇతర ముఖ్యమైన నేరాల్లో 5%, మొత్తం మీద అన్ని కేసులు కలిపి 2% శిక్షలు పెరిగాయి        » సైబర్‌ నేరాలు 9418 నుంచి 8199కు తగ్గాయి.¤ తెలంగాణలో పరిపాలన సౌలభ్యం కోసం శాఖలను పునర్వ్యవస్థీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.రాష్ట్రీయం-ఏపీ¤ ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద అందించే నగదు రహిత వైద్య సేవల పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని దీనికి అనుసంధానించి, దాని తరహాలోనే ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద కూడా ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా రూ.5 లక్షల వరకూ నగదు రహిత వైద్యసేవలను అందించనుంది. 2019 ఏప్రిల్‌ నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది.        » సామాజిక ఆర్థిక గణన-2011 (సెక్‌ డేటా) ప్రకారం ఏపీలో దారిద్య్రరేఖకు దిగువున 55 లక్షల కుటుంబాలున్నాయి. వాటిలోని 1.70 కోట్ల మందికి మాత్రమే ఆయుష్మాన్‌ భారత్‌లో లబ్ధి చేకూరుతుంది. కేవలం సెక్‌ డేటానే ప్రాతిపదికగా తీసుకోవడంతో రాష్ట్రంలోని మిగతా పేద కుటుంబాలకు ఆయుష్మాన్‌ వర్తించదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.¤ ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరిన గర్భిణులు పైసా చెల్లించకుండా వైద్యం చేయించుకునే సౌలభ్యాన్ని కల్పించే ‘తల్లి సురక్ష' పథకాన్ని సీఎం చంద్రబాబు ఉండవల్లిలో ప్రారంభించారు. ఇలాంటి వినూత్న పథకాన్ని ప్రారంభించడం దేశంలోనే తొలిసారని వెల్లడించారు. దీనిద్వారా రాష్ట్రంలో ఏటా సుమారు 5 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.        » ఏపీ-108 మొబైల్‌ యాప్‌నూ సీఎం ఆవిష్కరించారు.        » తల్లి సురక్ష పథకానికి దారిద్య్రరేఖకు దిగువనున్నవారు అర్హులు. వ్యయాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. సహజ ప్రసవానికి రూ. 8 వేలు, సిజేరియన్‌కు రూ. 14,500 చెల్లిస్తుంది.        » ప్రస్తుతం రాష్ట్రంలో ప్రసవ సమయంలో తల్లుల మరణాల రేటు లక్షకు 65గా ఉంది. దీన్ని 50కి తగ్గించడం ఈ పథకం ఉద్దేశం.¤ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని కనీస మౌలిక వసతులపై సీఎం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు.        » పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నాలుగేళ్లలో రూ. 1,05,972 కోట్లు కేటాయించి ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అనేక పథకాలతోపాటు వివిధ ఆర్థిక సంస్థల నుంచి నిధులు సమీకరించి తాగునీటి సరఫరా, వీధి దీపాలు, రహదారులు, కాలువలు, మురుగునీరు, వరదనీటి పారుదల వ్యవస్థలను అభివృద్ధి చేశామని పేర్కొంది        » పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో అమలుచేస్తున్న సంస్కరణలు, వివిధ కార్యక్రమాల అమలు, సాంకేతిక అనుసంధానం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం, ఇతర అత్యుత్తమ సంస్థల నుంచి 46 అవార్డులు సాధించడం విశేషం.
డిసెంబరు - 31
రాష్ట్రీయం - ఏపీ¤ పారిశ్రామిక రంగంలో అభివృద్ధి, నైపుణ్య శిక్షణ రంగాల్లో పురోగతి అంశాలపై సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని ప్రజావేదికలో శ్వేతపత్రం విడుదల చేశారు.        » పెట్టుబడులకు అనుకూల వాతావరణం, ఆకర్షణీయమైన విధానాలు, అందుబాటులో విద్యుత్తు, నీరు, మౌలిక సదుపాయాలు, ఆర్థిక ప్రోత్సాహకాలతో పారిశ్రామిక రంగంలో గణనీయమైన అభివృద్ధి నమోదైందని ప్రభుత్వం వెల్లడించింది. రూ.15.48 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాల్లో 1.77 లక్షల కోట్లతో 810 పరిశ్రమలు ప్రారంభమై 2.51 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి లభించిందని పేర్కొంది


కరెంట్ అఫైర్స్ - జనవరి - 2019 రాష్ట్రీయం

No comments:

Post a Comment