ఆగస్టు 26 నుంచి `పోలీస్` ప్రిలిమినరీ పరీక్షలు
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకానికి సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష తేదీలను తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది.
తప్పులు సవరించుకోండి:
దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం ఇస్తున్నట్లు బోర్డు చైర్మన్ తెలిపారు. అభ్యర్థులు రిజిస్టర్డ్ ఈ-మెయిల్ ఐడీ ద్వారా support@tsprb.in కు సవరణ అంశాలు తెలపాలని సూచించారు. పుట్టిన తేదీ, కమ్యూనిటీ, ఎక్స్ సర్వీస్‌మెన్, స్థానికత, లింగ భేదం, పరీక్ష మాధ్యమం, ఫొటో, సంతకం తదితరాలను సవరించుకోవచ్చని.. ఇందుకు మెయిల్‌లో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, సవరించాల్సిన అంశాలను పేర్కొనాలని చెప్పారు. సవరణకు జూలై 14 వరకు గడువిచ్చామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు.
ఎస్‌ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు
పరీక్ష
|
తేది
|
సమయం
| |
ఎస్‌ఐ
|
26.08.2018
|
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు
| |
ఎస్‌ఐ కమ్యూనికేషన్స్
|
02.09.2018
|
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు
| |
ఏఎస్‌ఐ (ఫింగర్ ప్రింట్స్)
|
02.09.2018
|
మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు
| |
పోలీస్ కానిస్టేబుల్
|
30.09.2018
|
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు
|
No comments:
Post a Comment