పదాల తార్కిక అమరిక
(Logical Arrangement of Words)
I. పదాలను వివిధ సంఘటనలు లేదా ఒక పని పూర్తి చేసే విధానం ప్రకారం వివిధ దశలుగా క్రమంలో అమర్చడం.
II. ఒక సమూహానికి సంబంధించిన పదాలను క్రమపద్ధతిలో అమర్చడం.
III. పదాలను దత్తాంశం ఆధారంగా ఆరోహణ లేదా అవరోహణ క్రమంలోకి అమర్చడం.
IV. పదాలను నిఘంటు క్రమంలో అమర్చడం.
V. పదాలను వివిధ సంఘటనలు లేదా ఒక పని పూర్తి చేసే విధానం ప్రకారం వివిధ దశలుగా క్రమంలో అమర్చడం.
1. రీడిండ్ 2. కంపోజింగ్ 3. రైటింగ్ 4. ప్రింటింగ్
ఎ) 1, 3, 4, 2 బి) 2, 3, 4, 1 సి) 3, 1, 2, 4 డి) 3, 2, 4, 1
జవాబు: (డి)
వివరణ: పైన ఇచ్చిన పదాలు పబ్లిషింగ్‌కు సంబంధించిన వివిధ దశల క్రమాన్ని తెలియజేస్తున్నాయి. మొదటగా ప్రచురించాల్సిన విషయాన్ని రాయాలి. తర్వాత రాసిన విషయాన్ని కంపోజింజ్ చేసి ప్రింటింగ్‌కు పంపించాలి. ప్రింటింగ్ అయ్యాక చదువుతాం. కాబట్టి పదాల సరైన క్రమం 3-2-4-1
2. కింది పదాలను క్రమపద్ధతిలో అమర్చండి.
1. దరఖాస్తు, 2. ఎంపిక, 3. పరీక్ష, 4. ఇంటర్వ్యూ, 5. ప్రకటన
ఎ) 1, 2, 3, 5, 4 బి) 5, 1, 3, 4, 2 సి) 5, 3, 1, 4, 2 డి) 4, 5, 1, 2, 3
జవాబు: (బి)
వివరణ: ఒక ఉద్యోగం కోసం ఎంపిక క్రమంలో పదాల అమరికను పై పదాలు తెలియజేస్తున్నాయి. ప్రకటన -దరఖాస్తు - పరీక్ష - ఇంటర్వూ - ఎంపిక. కాబట్టి సరైన క్రమం 5 1 3 4 2
3. కింది పదాలను ఒక క్రమంలో అమర్చండి.
1. శిక్ష 2. జైలు 3. అరెస్టు 4. నేరం 5. తీర్పు
ఎ) 5, 1, 2, 3, 4 బి) 4, 3, 5, 2, 1 సి) 4, 3, 5, 1, 2 డి) 2, 3, 1, 4, 5
జవాబు: (సి)
వివరణ: పై పదాలు ఒక నేరగాడికి సంబంధించినవి. వాటిని క్రమపద్ధతిలో అమర్చగా నేరుం(4), అరెస్టు(3), తీర్పు (5), శిక్ష(1), జైలు(2) కాబట్టి సరైన క్రమం 4, 3, 5, 1, 2
II. ఒక సమూహానికి సంబంధించిన పదాలను క్రమపద్ధతిలో అమర్చడం.
1. కుటుంబం 2. తెగ 3. సభ్యుడు 4. స్థానికత 5. దేశం
ఎ) 3, 1, 2, 4, 5 బి) 3, 1, 2, 5, 4 సి) 3, 1, 4, 2, 5 డి) 3, 1, 4, 5, 2
జవాబు: (ఎ)
వివరణ: ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా పైపదాలను ఒక క్రమ పద్ధతిలో అమరిస్తే... ప్రథమంగా, పైన ఇచ్చిన 5 పదాల్లో చివరగా ఉండేవాడు - సభ్యుడు (3) సభ్యుడు - కుటుంబంలో భాగం; కుటుంబం - తెగలో భాగం; తెగ - స్థానికతలో భాగం; స్థానికత - దేశానికి సంబంధించింది. కాబట్టి పదాల తార్కిక క్రమం సభ్యుడు (3), కుటుంబం(1), తెగ (2), స్థానికత (4), దేశం(5) కాబట్టి సరైన క్రమం 3, 1, 2, 4, 5.
2. కిందిపదాలను క్రమపద్దతిలో అమర్చండి.
1. ఆంధ్రప్రదేశ్ 2. విశ్వం 3. తిరుపతి 4. ప్రపంచం 5. భారతదేశం
ఎ) 3, 1, 4, 5, 2 బి) 1, 3, 5, 4, 2 సి) 3, 1, 5, 4, 2 డి) 3, 1, 2, 4, 5
జవాబు: (సి)
వివరణ: ఇచ్చిన పదాలను క్రమపద్ధతిలో అమరిస్తే
తిరుపతి(3), ఆంధ్రప్రదేశ్(1), భారతదేశం(5), ప్రపంచం (4), విశ్వం (2). కాబట్టి సరైన క్రమం 3, 1, 5, 4, 2
III. పదాలను దత్తాంశం ఆధారంగా ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చడం.
1. కింది పదాలను తార్కిక క్రమంలో అమర్చండి.
1. బంగారం 2. ఇనుము 3. ఇసుక 4. ప్లాటినం 5. డైమండ్
ఎ) 2, 4, 3, 5, 1 బి) 3, 2, 1, 5, 4 సి) 4, 5, 1, 3, 2 డి) 5, 4, 3, 2, 1
జవాబు: (బి)
వివరణ: ఇచ్చిన పదాలను వాటి విలువల ఆధారంగా క్రమపద్ధతిలో అమరిస్తే (తక్కువ విలువ నుంచి ఎక్కువకు)-
ఇసుక (3), ఇనుము (2), బంగారం (1), డైమండ్ (5), ప్లాటినం(4). కాబట్టి సరైన క్రమం 3, 2, 1, 5, 4
2. కింది పదాలను సరైన క్రమంలో అమర్చండి.
1. ట్రిలియన్ 2. వేలు 3. బిలియన్ 4. వంద 5. మిలియన్
ఎ) 1, 2, 4, 3, 5 బి) 1, 5, 3, 2, 4 సి) 4, 2, 3, 5, 1 డి) 4, 2, 5, 3, 1
జవాబు: (డి)
వివరణ: ఇచ్చిన పదాలు లెక్కించడానికి ఉపయోగించేవి. వాటి అవరోహణా క్రమాన్ని రాయగా వంద (4), వేలు (2), మిలియన్ (5), బిలియన్ (3), ట్రిలియన్ (1) కాబట్టి సరైన సమాధానం 4, 2, 5, 3, 1
IV. పదాలను నిఘంటు క్రమంలో అమర్చడం.
1. Hepatitis 2. Cholera 3. Peptidoglyean 4. Chitin
ఎ) 2, 3, 1, 4 బి) 4, 2, 1, 3 సి) 4, 1, 3, 2 డి) 3, 1, 4, 2
జవాబు: (బి)
వివరణ: పై పదాలను ఇంగ్లిష్ నిఘంటువు క్రమంలో అమరిస్తే.. Chitin(4), Cholera(2), Hepatitis(1), Peptidoglyean(3) కాబట్టి, సరైన సమాధానం 4, 2, 1, 3.
2. కింది పదాలను నిఘంటు క్రమంలో అమర్చండి.
1. Ambitious 2. Ambiguous 3. Ambiguity 4. Animation 5. Animals
ఎ) 3, 2, 4, 1, 5 బి) 3, 2, 5, 4, 1 సి) 3, 2, 1, 5, 4 డి) 3, 2, 4, 5, 1
జవాబు: (సి)
వివరణ: పై పదాలను ఇంగ్లిష్ నిఘంటు క్రమంలో అమరిస్తే Ambiguity(3), Ambiguous (2), Ambitious(1), Animals(5), Animation(4) కాబట్టి సరైన సమాధానం 3, 2, 1, 5, 4
3. కింది పదాలను నిఘంటు క్రమంలో అమర్చండి.
1. Divide 2. Divisions 3. Devine 4. Divest 5. Direct
ఎ) 5, 4, 3, 1, 2 బి) 5, 4, 1, 3, 2 సి) 1, 2, 3, 4, 5 డి) 3, 5, 4, 1, 2
జవాబు: (డి)
వివరణ: పై పదాలను నిఘంటు క్రమంలో అమరిస్తే
Devine (3) - Direct(5) - Divest(4) - Divide(1) - Divisions(2) కాబట్టి సరైన సమాధానం 3, 5, 4, 1, 2.
Previous Chapters -
No comments:
Post a Comment