తెలంగాణ ఎకానమీ, అభివృద్ధి అంశాలకు ఎలా సిద్ధమవ్వాలి. ఏ పుస్తకాలు చదవాలి?

తెలంగాణ ఎకానమీ, అభివృద్ధి అంశాలకు ఎలా సిద్ధమవ్వాలి. ఏ పుస్తకాలు చదవాలి?

– కె.అనిత, నిజామాబాద్‌.
1956 తర్వాతి కాలంలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థలోని వివిధ అంశాలకు సంబంధించి తెలంగాణ ప్రాంత స్థితిగతులను పరిశీలించాలి. ముఖ్యంగా జీఎస్‌డీపీలో వివిధ రంగాల వాటా, శ్రామిక శక్తి, పనిలో పాలుపంచుకునే రేటు తదితర అంశాలను అధ్యయనం చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థలో ప్రాంతీయ అసమానతలను విశ్లేషించుకోవాలి. జల, ఆర్థిక తదితర అంశాల అసమానతలకు సంబంధించిన సమాచారాన్ని సిలబస్‌లో పేర్కొన్న వివిధ కమిటీల నివేదికల నుంచి సేకరించుకోవాలి.
  • తెలంగాణ ఎకానమీలో అభ్యర్థులు ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశం భూ సంస్కరణలు. మొదటి దశ భూ సంస్కరణల లక్ష్యాలు, హైదరాబాద్‌ రాష్ట్రంలోని భూస్వామ్య విధానాలు, కౌలు విధానాలను పరిశీలించాలి. కమతాలపై గరిష్ట పరిమితికి సంబంధించి జాతీయ మార్గదర్శక సూత్రాలను పరిశీలించాలి. తెలంగాణ ప్రాంతంలో భూసంస్కరణలకు సంబంధించి తీసుకొచ్చిన చట్టాల వివరాల గురించి తెలుసుకోవాలి.
  • తెలంగాణ ప్రాంత వ్యవసాయ రంగ స్థితిగతులను ముఖ్యంగా పంటలు, ఉత్పత్తి, ఉత్పాదకత, వ్యవసాయ పరపతి, నీటి పారుదల, ఎరువుల వినియోగం తదితర అంశాలను పరిశీలించాలి.
  • తెలంగాణ రాష్ట్ర జీఎస్‌డీపీలో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటాలను అధ్యయనం చేయాలి. కొత్త ప్రభుత్వం ఈ రంగాల అభివృద్ధికి చేపట్టిన చర్యలపై అవగాహన పెంపొందించుకోవాలి. రుణ మాఫీ టి కార్యక్రమాల సమాచారాన్ని తెలుసుకోవాలి.
  • భారీ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల ప్రగతిపై అవగాహన అవసరం. జిల్లాల వారీగా వివిధ పరిశ్రమలు, ఉపాధి, పెట్టుబడుల గురించి తెలుసుకోవాలి. పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలతోపాటు భారీ పారిశ్రామికీకరణకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన అవసరం.
రిఫరెన్స్‌ ..
1. తెలంగాణ సోషియో ఎకనమిక్‌ ఔట్‌లుక్‌   
2. శ్రీకృష్ణ కమిటీ నివేదిక.
3. తెలుగు అకాడమీ: తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పుస్తకం.

No comments:

Post a Comment