వన్యప్రాణి సంరక్షణ చట్టాలు

www.telugumaterials.com



వన్యప్రాణి సంరక్షణ చట్టాలు
1.
మద్రాసు అడవి ఏనుగుల సంరక్షణ చట్టం -1873
2.
భారతీయ ఏనుగుల భద్రతా చట్టం -1879
3.
అటవీ పక్షులు, జంతువుల భద్రతా చట్టం -1912
4.
బెంగాల్ ఖడ్గమృగ సంరక్షణ చట్టం-1932
5.
అస్సాం ఖడ్గమృగ సంరక్షణ చట్టం -1954
6.
జాతీయ వన్యప్రాణుల సంరక్షణ చట్టం -1972
7.
అడవుల సంరక్షణ చట్టం -1980

గణాంకాలు
·         భారత వన్యప్రాణి సంరక్షణ సంస్థను 1952లో నెలకొల్పారు.
·         దేశంలో మొత్తం సజీవ జాతులు 1,50,000 ఉన్నట్లు అంచనా.
·         ప్రస్తుతం దేశంలో 103 జాతీయ పార్కులున్నాయి.
·         అభయారణ్యాల సంఖ్య - 500 పైగా
·         బయోస్ఫియర్ రిజర్వులు-18
·         టైగర్ రిజర్వులు -49
·         ఎలిఫెంట్ రిజర్వులు - 32
ప్రాజెక్ట్ టైగర్
·         1972లో పులిని జాతీయ జంతువుగా ప్రకటించారు.
·         1973 ఏప్రిల్ 1 పులుల సంరక్షణ కోసం ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించారు.
·         దేశంలో మొదటి టైగర్ ప్రాజెక్ట్ - బండీపూర్ (కర్ణాటక)-1973
·         జిమ్ కార్బెట్ పార్కును కూడా 1973లోనే టైగర్ ప్రాజెక్టుగా ప్రకటించారు.
·         దేశంలో మొత్తం టైగర్ రిజర్వులు - 49
·         చివరగా ఏర్పాటైన టైగర్ రిజర్వులు: 49వది ఒరంగ్ (అసోం), 48వది రాజాజి (ఉత్తరాఖండ్)
·         దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వు - నాగార్జునసాగర్ - శ్రీశైలం
·         అతి చిన్న టైగర్ రిజర్వులు - ఒరంగ్ (అసోం), బోర్ (మహారాష్ర్ట)
·         అత్యధిక టైగర్ రిజర్వులు ఉన్న రాష్ర్టం -మధ్యప్రదేశ్
·         దేశంలో మొత్తం పులుల సంఖ్య (2016 ప్రకారం) -2500
·         అత్యధిక పులులున్న రాష్ర్టం - కర్ణాటక
·         పులులు ఎక్కువగా ఉన్న రిజర్వు - సుందర్బన్స్ (పశ్చిమ బెంగాల్)
ప్రాజెక్ట్ ఎలిఫెంట్
·         దేశంలో ఏనుగుల సంరక్షణ కోసం 1992 ఫిబ్రవరి 13 ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ప్రారంభించారు.
·         దేశంలో 32 ఎలిఫెంట్ ప్రాజెక్టులున్నాయి.
·         ఏనుగులు ఎక్కువగా ఉన్న రాష్ర్టం కేరళ.
·         దేశంలో మొత్తం 20,000 ఏనుగులు ఉన్నట్లు అంచనా.
·         ఏనుగుల సంచారాన్ని బట్టి 3 జోన్లుగా విభజించారుజ
1. గ్రీన్ జోన్: ఏనుగులకు - మానవులకు ఘర్షణ లేని ప్రాంతాలు.
2.
ఎల్లో జోన్: ఏనుగులు - మానవులకు తరచుగా ఘర్షణలు జరిగే ప్రాంతాలు.
3.
రెడ్ జోన్: ఏనుగులు - మానవులకు మధ్య ఎప్పుడూ ఘర్షణలు జరిగే ప్రాంతాలు.

ప్రాజెక్ట్ క్రోకోడైల్
·         ప్రపంచంలో దీన్ని 1974లో ప్రారంభించారు.
·         1975లో ఐక్యరాజ్య సమితి సహకారంతో దేశంలో ప్రారంభించారు.
·         చెన్నైలో మొదటి క్రోకోడైల్ బ్యాంకు ఏర్పాటు చేశారు.
·         దేశంలో 8 రాష్ట్రాల్లో 16 మొసళ్ల కేంద్రాలున్నాయి.
·         వేగంగా అంతరించిపోతున్న మొసళ్ల జాతులు- ఘరియల్, మగ్గర్, ఎస్టూరైన్.
·         ఘరియల్ జాతి గేవియాలిడే జాతికి చెందింది. ఇవి సన్నని, పొడవైన ముట్టె కలిగి ఉంటాయి.
·         తెలంగాణలో మొసళ్ల సంరక్షణ కేంద్రాలు- మంజీర (మెదక్), శివరాం (ఆదిలాబాద్), నాగార్జునసాగర్ (నల్గొండ), కిన్నెరసాని (ఖమ్మం).
·         ఆంధ్రప్రదేశ్లో మొసళ్ల సంరక్షణ కేంద్రాలు - కర్నూలు - శ్రీశైలం, తూర్పుగోదావరి - కోరింగ, ఉభయ గోదావరి - పాపికొండలు
ప్రాజెక్ట్ సీ టర్టిల్
తాబేళ్ల సంరక్షణకు 1975లో ప్రాజెక్ట్ సీ టర్టిల్ ప్రారంభించారు.
తాబేళ్ల రక్షణ కేంద్రాలు
1.
ఒడిశా -గహిర్మాథా బీచ్ (ఆలివ్ రిడ్లే తాబేళ్ల రకం)
2.
తమిళనాడు - ట్యుటికోరన్ (హాక్స్బిల్ తాబేళ్ల రకం)

ప్రాజెక్ట్ స్నో లెపార్డ్‌ (మంచు చిరుత)
2009
జనవరిలో 5 రాష్ట్రాల్లో ప్రారంభమైంది. అవి..
1.
జమ్మూకశ్మీర్
2.
హిమాచల్ప్రదేశ్
3.
ఉత్తరాఖండ్
4.
అరుణాచల్ ప్రదేశ్
5.
సిక్కిం

ప్రాజెక్ట్ రెడ్ పాండా (క్యాట్ బేర్)
·         1966లో పద్మజా నాయుడు.. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో రెడ్ పాండా పార్క్ను ప్రారంభించారు.
·         ఇవి నివసించే రాష్ట్రాలు - అరుణాచల్ప్రదేశ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్.
గంగా డాల్ఫిన్ సంరక్షణ
·         డాల్ఫిన్ను జాతీయ జలచర జంతువుగా గుర్తించారు. ఇవి భారత్లో గంగా, బ్రహ్మపుత్రా నదుల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
·         వీటి సంరక్షణకు ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
రినో విజన్ 2020
·         2020 నాటికి ఖడ్గమృగాల (రినోల) సంఖ్యను 2000 నుంచి 3000కు పెంచడం దీని ఉద్దేశం.
·         అదేవిధంగా ఖడ్గమృగాలను దేశంలోని 7 సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు.
·         మొదటిసారిగా ఖడ్గమృగాలను తరలించిన సురక్షిత ప్రాంతం - మానస్ రిజర్‌‌ (అసోం)
·         ప్రాజెక్టుకు సహాయం అందించే సంస్థలు: International Rhino Foundation; Asian Rhino and Elephant Action Strategy India
జాతీయ పార్కులు
·         దేశంలో 103 జాతీయ పార్కులున్నాయి. వీటి వైశాల్యం - 40,500 .కి.మీ.
·         దేశ వైశాల్యంలో వీటి శాతం - 1.23%
·         దేశంలో పెద్ద జాతీయ పార్కులు - హేమిస్ (జమ్మూ కశ్మీర్), జిమ్ కార్బెట్ (ఉత్తరాఖండ్)
·         దేశంలో చిన్న జాతీయ పార్కు - సౌత్ బటన్ (అండమాన్ నికోబార్‌‌)
·         హేళీ పార్కు 1936లో ఏర్పాటైంది. దీన్ని
·         1973లో జిమ్ కార్బెట్ నేషనల్ పార్కుగా మార్చారు.
·         ప్రధాన జాతీయ పార్కులు - వాటిలోని ప్రధాన ప్రాణులు - ఇతర విశేషాలు
·         జమ్మూ కశ్మీర్: దాచీగాం (హంగుల్)
·         పశ్చిమ బెంగాల్: జల్దపార (ఖడ్గమృగాలు), పద్మజానాయుడు పార్కు (ఎర్ర పాండాలు)
·         కేరళ: పెరియార్
·         గుజరాత్: గిర్ (ఆసియా సింహాలు), వేలవాదర్ (నల్లబాతులు)
·         రాజస్థాన్: కియోలడియో ఘనా నేషనల్ పార్క్‌ - ఇంతకుముందు భరత్పూర్ బర్డ్ శాంక్చ్యురీగా పిలిచేవారు. (సైబీరియా కొంగలు)
·         మధ్యప్రదేశ్: కన్హా (బెట్వా నది పార్కు మధ్య గుండా పోతుంది)
·         అసోం: కజిరంగా (ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు)
·         ఒడిశా: నందన్కానన్ (తెల్ల పులులు)
·         తమిళనాడు: గిండి (పాములకు ప్రసిద్ధి)
·         గోవా: సలీం అలీ (పక్షి సంరక్షణ కేంద్రం)
బయోస్ఫియర్ రిజర్వులు
దేశంలో 18 బయోస్ఫియర్ రిజర్వులున్నాయి
1.
నీలగిరి - తమిళనాడు-కేరళ - 1986 (దేశంలో మొదటిది)
2.
నొక్రెక్ - మేఘాలయ (1988)
3.
నందాదేవి - ఉత్తరాఖండ్ (1988)
4.
గల్ఫ్ ఆఫ్ మన్మార్ - తమిళనాడు (1989)
5.
సుందర్బన్స్ - పశ్చిమ బెంగాల్ (1989)
6.
గ్రేట్ నికోబార్ - నికోబార్స్‌ (1989)
7.
మానస్ - అసోం (1989)
8.
సిమ్లిపాల్ - ఒడిశా (1994)
9.
డిబ్రూ - సైఖోవా - అసోం (1997)
10.
దిహాంగ్ - అరుణాచల్ప్రదేశ్ (1998)
11.
పచ్మర్హి - మధ్యప్రదేశ్ (1999)
12.
కాంచనజంగ - సిక్కిం (2000)
13.
అగస్త్యమలై - కేరళ (2001)
14.
అమర్కంటక్ - మధ్యప్రదేశ్ (2005)
15.
కచ్ - గుజరాత్ (2008)
16.
కోల్డ్ డిజర్‌‌ - హిమాచల్ ప్రదేశ్ (2009)
17.
శేషాచలం - ఆంధ్రప్రదేశ్ (2001)
18.
పన్నా - మధ్యప్రదేశ్ (2011)
బయోస్ఫియర్ రిజర్వుల్లో పెద్దది - కచ్ (12,454 .కి.మీ), చిన్నది - డిబ్రూ-సైఖోవా (765 .కి.మీ)

దేశంలో యునెస్కో గుర్తించిన బయోస్ఫియర్ రిజర్వులు -10. అవి..
1. నీలగిరి
2.
నందాదేవి
3.
సుందర్బన్స్
4.
గల్ఫ్ ఆఫ్ మన్మార్
5.
సిమ్లిపాల్
6.
పచ్మర్హి
7.
నక్రిక్
8.
అమర్ కంటక్
9.
గ్రేట్ నికోబార్
10.
అగస్త్యమలై

హాట్స్పాట్స్
ఒకప్పుడు జీవ వైవిధ్యం గల ప్రాంతాలు, ప్రస్తుతం మానవ చర్యల వల్ల ప్రమాదాన్ని ఎదుర్కొనే భౌగోళిక ప్రాంతాలను ఎకలాజికల్ హాట్స్పాట్స్ అంటారు.
ప్రపంచంలో 35 హాట్స్పాట్స్ ఉన్నాయి.
దేశంలో 2 ఉన్నాయి. అవి..
1.
ఈశాన్య హిమాలయాలు
2.
పశ్చిమ కనుమలు
మాదిరి ప్రశ్నలు
1. కిందివాటిలో యునెస్కో గుర్తించని బయోస్ఫియర్ రిజర్వు?
 1) నక్రిక్
 2)
నందాదేవి
 3)
అగస్త్యమలై
 4)
పన్నా
·         Ans: పన్నా
2. అంతరించిపోతున్న మొసళ్ల జాతి?
 1) ఘరియల్
 2)
హాక్స్బిల్
 3)
రిడ్లె
 4)
కుబాన్
·         Ans: ఘరియల్
3. దేశంలో పులులు ఎక్కువగా ఉన్న రాష్ర్టం?
 1) మధ్యప్రదేశ్
 2)
కర్ణాటక
 3)
ఆంధ్రప్రదేశ్
 4)
పశ్చిమ బెంగాల్
·         Ans: కర్ణాటక
4. కన్హా జాతీయ పార్కు నుంచి నది ప్రవహిస్తోంది?
 1) కెన్
 2)
యమునా
 3)
సోన్
 4)
బెట్వా
·         Ans: బెట్వా
5. ఆలివ్ రిడ్లే తాబేళ్లు గల రాష్ర్టం?
 1) తమిళనాడు
 2)
ఒడిశా
 3)
తెలంగాణ
 4)
మధ్యప్రదేశ్
·         Ans: ఒడిశా
6. కోరింగ మొసళ్ల కేంద్రం జిల్లాలో ఉంది?
 1) తూర్పుగోదావరి
 2)
ఆదిలాబాద్
 3)
పశ్చిమ గోదావరి
 4)
నల్గొండ
·         Ans: తూర్పుగోదావరి
7. దేశంలో టైగర్ ప్రాజెక్ట్లు?
 1) 47
 2) 48
 3) 49
 4) 42
·         Ans: 49
8. జతపరచండి?
1) పెంచ్ పార్కు
a) తెలంగాణ
2) మృగవని
b) మహారాష్ర్ట
3) ఘనా
c) ఉత్తరాఖండ్
4) వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్
d) రాజస్థాన్
1) 1-b, 2-a, 3-d, 4-c
 2) 1-b, 2-a, 3-c, 4-d
 3) 1-c, 2-a, 3-d, 4-b
 4) 1-d, 2-c, 3-b, 4-a
·         Ans: 1-b, 2-a, 3-d, 4-c
9. జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం?
 1) 1974
 2) 1972
 3) 1872
 4) 1964
·         Ans: 1972