లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ -ఆంగ్ల అక్షర క్రమం

ఆంగ్ల అక్షర క్రమం


  • తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే వివిధ పోటీ పరీక్షల్లో జనరల్‌స్టడీస్‌లో 'విశ్లేషణాసామర్థ్యం' విభాగంలో 'ఆంగ్ల అక్షరక్రమం' అనే అంశంపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సునిశిత పరిశీలన, తార్కిక ఆలోచన ద్వారా ఈ అంశంపై వచ్చే ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు.
    * ఆంగ్ల అక్షరక్రమంలో మొత్తం 26 అక్షరాలు ఉంటాయి.
    * ఆంగ్ల అక్షరక్రమంలో ఎడమ నుంచి అంటే A నుంచి Z వరకు, కుడి నుంచి అంటే Z నుంచి A వరకు లెక్కిస్తారు.

    * ఆంగ్ల వర్ణమాలలో ప్రతి అక్షరం - దానికి వ్యతిరేక దిశలో సమానమయ్యే అక్షరాల జాబితాను కింది విధంగా సూచించవచ్చు.

    ఆంగ్ల అక్షర క్రమంలో
    మొదటి సగభాగం: A నుంచి M వరకు
    రెండో సగభాగం: N నుంచి Z వరకు
    వ్యతిరేక క్రమంలో
    మొదటి సగభాగం: M నుంచి A వరకు
    రెండో సగభాగం: Z నుంచి N వరకు లెక్కిస్తారు.
    1. ఆంగ్ల వర్ణమాలలో ఎడమవైపు నుంచి 12వ అక్షరానికి ఎడమవైపు ఉన్న 5వ అక్షరం ఏది?
          ఎ) F       బి) G       సి) H       డి) I
    సమాధానం: (బి)
    వివరణ: ఆంగ్ల అక్షరక్రమంలో అక్షరాల స్థానాలను ఒకే దిశలో (ఎడమ నుంచి ఎడమ లేదా కుడి నుంచి కుడి వైపు) ఇచ్చి, అక్షర స్థానాన్ని కనుక్కోమంటే... ఆయా స్థానాల భేదాల్లో ఉన్న సంఖ్యను సూచించే అక్షరమే సమాధానం అవుతుంది.
    పై సూచన నుంచి, ఎడమవైపు ఉన్న 5వ అక్షర స్థానం: 12 - 5 = 7. అంటే 7వ స్థానంలో ఉన్న అక్షరం G.

    2. ఆంగ్ల అక్షరమాలలో కుడివైపు నుంచి 11వ అక్షరానికి కుడివైపు వచ్చే 6వ అక్షరం ఏది?
          ఎ) K       బి) V       సి) J      డి) U
    సమాధానం: (బి)
    వివరణ: పై సూచన నుంచి, 11 - 6 = 5.
    కుడివైపు నుంచి 5వ అక్షరం V .
                లేదా
    ఎడమవైపు నుంచి కనుక్కోవడానికి 27 - 5 = 22వ అక్షరం 'V'.

    3. ఆంగ్ల అక్షర క్రమంలో ఎడమవైపు నుంచి 16వ అక్షరానికి కుడివైపున ఉన్న 7వ అక్షరం ఏది?
          ఎ) V       బి) U       సి) W       డి) X
    సమాధానం: (సి)
    వివరణ: ఆంగ్ల అక్షరక్రమంలో అక్షరాల స్థానాలను వేర్వేరు దిశల్లో (ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి) ఇస్తే... అక్షర స్థానం, ఇచ్చిన స్థానాల మొత్తంలోని అక్షరం అవుతుంది.
    పై సూచన నుంచి, 16 + 7 = 23వ స్థానంలో ఉన్న అక్షరం W.
    కాబట్టి ఎడమవైపు నుంచి 16వ అక్షరానికి కుడివైపు ఉన్న 7వ అక్షరం W అవుతుంది.

    4. ఆంగ్ల అక్షరక్రమంలో కుడివైపు నుంచి 7వ అక్షరానికి ఎడమవైపు ఉన్న 9వ అక్షరం ఏది ?
          ఎ) L       బి) K       సి) N       డి) H
    సమాధానం: (బి)
    వివరణ: అక్షర స్థానాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి, 9 + 7 = 16
    కుడివైపు నుంచి 16వ స్థానంలో ఉన్న అక్షరం 'K'.

    5. ఆంగ్ల అక్షరమాలలో A నుంచి ప్రారంభించి 'సరి' స్థానంలో ఉండే ప్రతి అక్షరాన్ని తొలగిస్తూ పోతే (అంటే 2వ, 4వ, 6వ....), కుడి చివరి నుంచి 10వ అక్షరం ఏమవుతుంది?
          ఎ) G       బి) D       సి) Q       డి) ఏదీకాదు
    సమాధానం: (ఎ)
    వివరణ: అక్షరమాలలో A నుంచి ప్రారంభించి 2వ, 4వ, 6వ.. అక్షరాలని తొలగిస్తే, అక్షరక్రమం కింది విధంగా ఉంటుంది.
    A  C  E  G  I  K  M  O  Q  S  U  W  Y
    పై క్రమంలో కుడి చివరి నుంచి 10వ అక్షరం 'G'.

    6. ఆంగ్ల అక్షరమాలలో మొదటి సగం (A నుంచి M వరకు ఉన్న) అక్షరాలను వ్యతిరేక క్రమంలో (M నుంచి A వరకు) రాసినప్పుడు కుడివైపు నుంచి 8వ అక్షరానికి ఎడమవైపు వచ్చే 8వ అక్షరం ఏది?
          ఎ) G       బి) C       సి) D       డి) F
    సమాధానం: (బి)
    వివరణ: అక్షరమాలలో మొదటి సగం అంటే A నుంచి M వరకు ఉన్న అక్షరాలను వ్యతిరేక క్రమంలో రాస్తే కింది విధంగా ఉంటుంది.

    కుడివైపు నుంచి 8వ అక్షరమైన 'H' కు ఎడమవైపున వచ్చే 8వ అక్షరం 'C'.

    7. CAPCET అనే ఆంగ్ల పదంలోని అక్షరాలను సరైన క్రమంలో ఉంచితే ఒక అర్థవంతమైన పదం వస్తుంది. ఆ పదంలోని చివరి అక్షరం ఏది?
          ఎ) C       బి) A       సి) T       డి) P
    సమాధానం: (సి) 
    వివరణ: CAPCET లోని అక్షరాలను సరైన క్రమంలో రాస్తే వచ్చే పదం 'ACCEPT'. దీనిలోని చివరి అక్షరం 'T'.

    8. 'PERVERSION' అనే పదంలోని 1-6, 2-7, 3-8, 4-9, 5-10 స్థానాల్లోని అక్షరాలను పరస్పరం మార్పిడి చేశాక కుడివైపు నుంచి 7వ అక్షరం ఏమవుతుంది?
          ఎ) R       బి) I       సి) E       డి) O
    సమాధానం: (డి)
    వివరణ: 'PERVERSION' అనే పదంలోని అక్షరాలను దత్తాంశం ఆధారంగా మార్పిడి చేస్తే, కింది విధంగా మారుతుంది.

    ఇందులోని 7వ అక్షరం 'O' అవుతుంది.

    9. 'SECRETARIAT' అనే పదంలోని 2వ, 4వ, 6వ, 10వ అక్షరాలతో అర్థవంతమైన పదం ఏర్పడుతుంది. ఆ పదంలోని అక్షరాలతో, ఒకటి కంటే ఎక్కువ పదాలు ఏర్పడితే సమాధానం M, అర్థవంతమైన పదాలు ఏర్పడకపోతే X అవుతుంది. అయితే సరైన సమాధానం ఏది?      ఎ) X       బి) T       సి) M       డి) R
    సమాధానం: (సి)
    వివరణ: 'SECRETARIAT' పదంలోని 2వ, 4వ, 6వ, 10వ అక్షరాలు: E, R, T, A .
    అర్థవంతమైన పదాలు TEAR, TARE, RATE. కాబట్టి సమాధానం M అవుతుంది.

    10. ఆంగ్ల వర్ణమాలలో A ను చిన్న ఆంగ్ల అక్షరంతోనూ, తర్వాత వచ్చే B ను పెద్ద ఆంగ్ల అక్షరంతోనూ సూచిస్తూ, మిగిలిన అన్ని అక్షరాలను ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి రాశారు. ఈ అమరిక ప్రకారం జులై నెల తర్వాత వచ్చే 3వ నెలను ఎలా సూచించవచ్చు?      ఎ) OCTOBER       బి) OctObEr       సి) OCtObEr       డి) ocToBeR
    సమాధానం: (డి)
    వివరణ: దత్తాంశం నుంచి మారిన ఆంగ్ల అక్షరక్రమం కింది విధంగా ఉంది.
    a  B  c  D  e  F  g  H  i  J  k  L  m  N  o  P  q  R  s  T  u  V  w  X  y  Z.
    జులై తర్వాత 3వ నెల అక్టోబర్ (OCTOBER) 'OcToBeR' గా మారుతుంది.

    11. ఒక గడియారంలోని 12 అంకెలను ఆంగ్ల అచ్చులైన a, e, i, o, u లతో వరుసగా సూచిస్తే (అంటే 1ను aతో, 3ను iతో) ఉదయం 10.30కు గంటల ముల్లు ఏయే అక్షరాల మధ్య ఉంటుంది?      ఎ) o, u       బి) a, u       సి) a, e       డి) i, o
    సమాధానం: (బి)

    వివరణ: పై చిత్రం నుంచి ఉదయం 10.30 గంటలకు గంటల ముల్లు a, u ల మధ్య ఉంటుంది.

    12. ఆంగ్ల అక్షరమాలలో 1 - 26, 2 - 25, 3 - 24, స్థానాల్లోని అక్షరాలను జతపరిచారు. ఈ జతల్లో ఏది సరైంది?      ఎ) GR       బి) CW       సి) IP       డి) EV
    సమాధానం: (డి)
    వివరణ: పై దత్తాంశం ఆధారంగా ఆంగ్ల అక్షరమాలను అమరిస్తే జతలు కింది విధంగా ఉంటాయి.
    AZ, BY, CX, DW, EV, FU, GT, HS, IR, JQ, KP, LO, MN

    13. ఆంగ్ల అక్షరమాలను వ్యతిరేక క్రమంలో రాసి, Yతో ప్రారంభించి ఒకదాని తర్వాత ఒకటి వచ్చే (ఏకాంతరంగా) అక్షరాలను తొలగించారు. ఇలా ఏర్పడిన అమరికలో మధ్య ఉండే అక్షరం ఏది?      ఎ) M       బి) N       సి) O       డి) M లేదా O
    సమాధానం: (బి)
    వివరణ: ఆంగ్ల అక్షరమాలను వ్యతిరేక క్రమంలో రాస్తే కింది విధంగా ఉంటుంది.
    Z  Y  X  W  V  U  T  S  R  Q  P  O  N  M  L  K  J  I  H  G  F  E  D  C  B  A
    పై క్రమంలో, Y తో ప్రారంభించి, ఒకదాని తర్వాత ఒకటి వచ్చే అక్షరాలను తొలగించగా అక్షరక్రమం కింది విధంగా మారుతుంది.

    పై అక్షరక్రమంలో 13 అక్షరాలున్నాయి. కాబట్టి 7వ అక్షరమైన 'N' మధ్యలో ఉండే అక్షరం అవుతుంది.
  • Next Chapter: క్యాలండర్