ముఖ్యమంత్రి-అధికారాలు - విధులు


భారత రాజ్యాంగం, భారత రాజకీయ వ్యవస్థ, పాలన, ప్రభుత్వ విధానం


ముఖ్యమంత్రి

1. రాష్ట్రంలో డి-జ్యురె ((De jure) కార్యనిర్వహణ అధికారి ఎవరు?
    ఎ) గవర్నరు     బి) ముఖ్యమంత్రి     సి) హైకోర్టు న్యాయమూర్తి     డి) మంత్రిమండలి
జ: (ఎ)
2. రాష్ట్ర మంత్రిమండలి పరిమాణం 91వ రాజ్యాంగ సవరణ ప్రకారం మొత్తం విధానసభ సభ్యుల్లో ఎంతశాతం మించకూడదు?
    ఎ) 10%     బి) 15%     సి) 20%     డి) 25%
జ: (బి) 
3. రాష్ట్ర శాసనసభలో సభ్యుడు కాకుండా మంత్రిగా నియమితుడైన వ్యక్తి ఎన్ని నెలల్లో రాష్ట్ర శాసనసభ సభ్యత్వం పొందాలి?
    ఎ) 3     బి) 6     సి) 9     డి) 18
జ: (బి) 
4. ముఖ్యమంత్రి పదవిలో ఉండగా మరణిస్తే.. మంత్రిమండలి ఏమవుతుంది?
ఎ) రద్దవుతుంది బి) రద్దుకాదు సి) యథాతథంగా డి) చెప్పలేం
జ: (ఎ)
5. రాష్ట్ర మంత్రిమండలి సమష్టిగా దేనికి బాధ్యత వహిస్తుంది?
    ఎ) గవర్నర్     బి) విధాన పరిషత్     సి) విధానసభ     డి) హైకోర్టు
జ: (సి)
6. రాష్ట్రంలో డి-ఫ్యాక్టో (De facto) కార్యనిర్వాహక వర్గం ఏది?
    ఎ) గవర్నర్     బి) ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి     సి) విధాన పరిషత్     డి) విధానసభ
జ: (బి) 
7. రాష్ట్ర ప్రణాళికా బోర్డు అధ్యక్షుడు ఎవరు?
    ఎ) గవర్నర్     బి) ఆర్థికమంత్రి     సి) ముఖ్యమంత్రి     డి) ఉపముఖ్యమంత్రి
జ: (సి)
8. ఒక మంత్రి ముఖ్యమంత్రితో విభేదిస్తే ఆ మంత్రిని పదవి నుంచి తొలగించవచ్చా?
    ఎ) తొలగించవచ్చు     బి) తొలగించకూడదు     సి) గవర్నర్ ఇష్టం     డి) ఏదీకాదు
జ: (ఎ)
9. రాష్ట్ర క్యాబినెట్ సమావేశాలకు అజెండాను నిర్ధారించేది ఎవరు?
    ఎ) గవర్నర్     బి) ముఖ్యమంత్రి     సి) స్పీకర్     డి) క్యాబినెట్ మంత్రి
జ: (బి) 
10. రాష్ట్ర క్యాబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహించేది ఎవరు?
    ఎ) గవర్నర్     బి) స్పీకర్     సి) ముఖ్యమంత్రి     డి) క్యాబినెట్ మంత్రి
జ: (సి) 
11. భారతదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు?
    ఎ) సుచేతా కృపలానీ     బి) సరోజినీనాయుడు     సి) రాజకుమారి అమృత్‌కౌర్     డి) పద్మజా నాయుడు
జ: (ఎ)
12. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి ముఖ్యమంత్రి ఎవరు?
    ఎ) కె. రోశయ్య     బి) ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డి     సి) నారా చంద్రబాబు నాయుడు     డి) ఎవరూ కాదు
జ: (బి) 
13. ఏ తీర్మానం శాసనసభలో ఆమోదం పొందితే రాష్ట్ర మంత్రివర్గం మొత్తం రాజీనామా చేయాల్సి ఉంటుంది?
    ఎ) అవిశ్వాస     బి) కోత     సి) మహాభియోగ     డి) ప్రతిపక్ష
జ: (ఎ)

భారత రాష్ట్రపతి