భారత ఆర్థిక వ్యవస్థ
- సామాజిక రంగంలో భారతదేశం అభిలషణీయమైన ప్రగతిని సాధించలేదని, సాధించాల్సింది ఇంకా చాలా ఉందని పేర్కొన్నవారు? జిన్ డ్రీజ్, అమర్త్యసేన్
- అమెరికా.. విద్యపై పెట్టిన పెట్టుబడుల వల్ల ఆ దేశ సగటు జాతీయాదాయం 4.2 శాతం మేర పెరిగిందని అంచనా వేసింది? సూల్జ్, గ్యారీబీకర్
- రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను అనుసరించి ఏ వయసు పిల్లలకు తప్పనిసరిగా ప్రాథమిక విద్యను అందించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంది? 6-14 సంవత్సరాలు.
- ప్రాథమిక విద్యను బోధించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ధ్రువీకరించిన కమిషన్? కొఠారి కమిషన్
- ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తిలో ప్రగతి నమోదు చేసినవి? గోవా, తమిళనాడు, పుదుచ్చేరి.
- 2002లో రూపొందించిన జాతీయ ఆరోగ్య విధానం లక్ష్యాలు? ఆరోగ్య రంగంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులను పెంచటం, వికేంద్రీకృత ప్రజా ఆరోగ్య పద్ధతులకు అవకాశం కల్పించటం.
- జాతీయ నీటి సరఫరా, పారిశుద్ధ్యం పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం? 1954
- వేగవంతమైన గ్రామీణ నీటి సరఫరా పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం? 1972-73
- రాజ్యాంగంలోని ఏ అధికరణ.. మహిళలు, పురుషులకు సామాజిక, ఆర్థిక రంగాల్లో సమాన అవకాశాలను కల్పిస్తోంది? 14వ అధికరణ
- 2011 లెక్కల ప్రకారం బీహార్ జనాభాలో పట్టణ జనాభా శాతం?11.3 శాతం
- ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం వ్యయంలో భాగంగా ఆహారంపై అధిక వ్యయం చేసిన రాష్ట్రం?అసోం
- 2011-12లో బీహార్ గ్రామీణ ప్రాంతాల్లో తలసరి వినియోగ వ్యయం నెలకు (రూపాయల్లో)?రూ.1127
- 2011-12లో పట్టణ ప్రాంతాల మొత్తం వ్యయంలో భాగంగా ఆహారంపై తక్కువ వ్యయం చేసిన రాష్ట్రం?కేరళ
- 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో అధికంగా పెరిగిన జనాభా?91 మిలియన్లు
- 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా వృద్ధి (శాతాల్లో)?31.8 శాతం
- అధిక పట్టణ జనాభా కలిగిన రాష్ర్టం (శాతాల పరంగా)?గోవా
- ఢిల్లీ తర్వాత అధిక పట్టణీకరణ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం?చండీగఢ్
- ప్రాంతీయ అసమానతలను సూచించే అంశాలను పేర్కొంది?రాజ్‌కృష్ణ
- కేంద్ర ప్రణాళికా విధానం కంటే జిల్లా, బ్లాక్, రాష్ట్ర స్థాయిలో గ్రామీణ పథకాలను రూపొందించాలని సూచించింది?కె.ఎన్. రాజ్
- జిల్లాలు, రాష్ట్రాల స్థాయిలో ప్రణాళికా నిర్ణయాలు జరిగితే సంతులిత ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపింది?ఎన్.చక్రవర్తి
- జిల్లాను యూనిట్‌గా, తిరిగి జిల్లాను కూడా చిన్న ఖండాలుగా విభజించి ప్రణాళికలు రూపొందించాలని సూచించింది?డి.ఆర్.గాడ్గిల్
- కేరళ తర్వాత 2001-2011 మధ్యకాలంలో అధిక పట్టణ జనాభా వృద్ధిని నమోదు చేసిన రాష్ర్టం?సిక్కిం
- జిల్లా స్థాయిలో బ్లాక్ ప్రణాళికలు రూపొందించాలని పేర్కొంది?వీకేఆర్‌వీ రావ్, అలఘ్
- గ్రామ స్థాయి నుంచి ప్రాంతీయ ప్రణాళికలు రూపొందించినప్పుడు ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పిన వ్యక్తి?ఎల్.ఎస్ భట్
- 11వ ప్రణాళికలో ఆర్థికంగా ముందజంలో ఉన్న రాష్ట్రాల్లో గరిష్ట వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్రం?గుజరాత్
- పదకొండవ ప్రణాళికలో బీహార్ సాధించిన సగటు వృద్ధిరేటు?12 శాతం
- 1990-91లో తలసరి ఆదాయంలో మొదటి స్థానం పొందిన రాష్ట్రం?పంజాబ్
- సంస్కరణల తర్వాత కాలం నుంచి దేశంలోని మొత్తం పెట్టుబడుల్లో 69.2 శాతం అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు తరలిపోయిందని పేర్కొన్న వ్యక్తి?ఎం.జె. కురియన్
- సంస్కరణల కాలంలో భారతదేశంలోని విత్తసంస్థల నుంచి అధికంగా ఆర్థిక సహాయం పొందిన రాష్ట్రాలు?మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
- మొత్తం పంట భూమిలో సాగునీటి వసతి అధికంగా ఉన్న రాష్ట్రం?పంజాబ్
- అవస్థాపనా అభివృద్ధి సూచీ దేన్ని తెలుపుతుంది?అవస్థాపనా సౌకర్యాల లభ్యత
- అవస్థాపనా అభివృద్ధి సూచీలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం?పంజాబ్
- 1980 నుంచి భారత్‌లో ప్రైవేటు పెట్టుబడులు పెరిగాయని పేర్కొంది?ఎంజే కురియన్
- నేషనల్ శాంపుల్ సర్వే 68వ రౌండు ప్రకారం బీహార్‌లో నమోదైన పేదరికం?33.7 శాతం
- ఏ పంటకు సంబంధించిన వంగడాల కార్యక్రమం (అధిక దిగుబడి ఇచ్చే) కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైందని విమర్మ ఉంది?గోధుమ
- భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో ఆయుః ప్రమాణం తక్కువగా నమోదవుతోంది?మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిషా
- వలసలు, జనాభా సహజ పెరుగుదల భారతదేశంలో దేనికి కారణం అవుతున్నాయి?పట్టణీకరణ
- 2001-11 మధ్యకాలంలో అధిక జనాభా వృద్ధి నమోదు చేసిన నగరం?ఢిల్లీ
- 2011 లెక్కల ప్రకారం భారతదేశంలో పట్టణ జనాభా?37.7 కోట్లు
- మురికివాడలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం?తమిళనాడు
- మురికివాడల జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం?మహారాష్ట్ర
- 2001తో పోల్చినప్పుడు 2011లో హిందూ జనాభా శాతం?తగ్గింది
- ముస్లిం జనాభా (శాతం పరంగా) ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఎక్కువగా ఉంది?లక్ష దీవులు
- దేశంలోని ఎంతశాతం ప్రజలు ఏ మతానికి చెందని వారుగా ఉన్నారు?0.2 శాతం
- Slum Free India అనేది ఏ పథక నినాదం?రాజీవ్ ఆవాస్ యోజన
- పంజాబ్ తర్వాత తలసరి విద్యుత్ వినియోగం ఏ రాష్ట్రంలో ఎక్కువ?తమిళనాడు
- తలసరి బ్యాంకు డిపాజిట్లు ఏ రాష్ట్రంలో ఎక్కువగా నమోదవుతున్నాయి?ఢిల్లీ
- అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి ద్వారా ప్రాంతీయ అసమానతలు తగ్గించొచ్చని పేర్కొన్న ప్రణాళిక?12వ ప్రణాళిక
- రఘరామ్ రాజన్ మల్టి డైమన్షనల్ ఇండెక్స్ ప్రకారం అభివృద్ధిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు?గోవా, కేరళ
- ఎక్కువ మంది జనాభా, వస్తు ఉత్పత్తి రంగం కేంద్రీకృతమైన ప్రదేశాలను అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా వర్ణించింది?కోలిన్ క్లార్క్
- ప్రతి వెయ్యి చదరపు కిలోమీటర్లుకు రోడ్ల విస్తరణ అధికంగా ఉన్న రాష్ర్టం?కేరళ
- ప్రతి వెయ్యి చదరపు కిలోమీటర్లుకు రోడ్ల విస్తరణ తక్కువగా ఉన్న రాష్ర్టం?బీహార్
No comments:
Post a Comment