వరద విపత్తులు
» అపార నష్టం» భారత్‌లోనూ అధికమే
వరదలు.. రకాలు
- 1. నదీ వరదలు
నది తనలో ఉంచుకోగల నీటి పరిమాణాన్ని పారుదల సామర్థ్యం (ఛానెల్ కెపాసిటీ) అంటారు. సముద్రంలోకి పంపే నీరు కంటే ఎక్కువ నీరు నదిలో ఉన్నప్పడు ఆ నీరు పొంగి నది గట్టును దాటి వరదలు సంభవిస్తాయి. వీటిని 'నదీ వరదలు అంటారు.
2. మెరుపు వరదలు
కుండపోత వర్షాలు.. మంచు హఠాత్తుగా కరిగి నదిలో చేరడం.. ఆనకట్టలు విరిగిపోవడం లాంటివి జరిగినప్పుడు అకస్మాత్తుగా వచ్చే వరదలను 'మెరుపు వరదలు అంటారు.
3. తీర ప్రాంత వరదలు
సముద్రంలో ఉప్పెనలు, సునామీలు వచ్చినప్పుడు తీర ప్రాంతంలో ఏర్పడిన వరదలను 'తీర ప్రాంత వరదలు అంటారు.
4. నదీ ముఖద్వార వరదలు
సముద్రంలోని ఉప్పెన కారణంగా సముద్రంలోని అలలు నదీ నీటి ప్రవాహాన్ని వెనక్కి నెడతాయి. ఫలితంగా నదులు సముద్రంలో కలిసే ప్రదేశాల్లో ఏర్పడిన వరదలను 'నదీ ముఖద్వార వరదలు అంటారు.
5. పట్టణ వరదలు
సరైన మురుగునీటి వ్యవస్థ లేని నగరాలు, పట్టణాల్లో భారీ వర్షాలు సంభవించినప్పుడు ఏర్పడిన వరదలను 'పట్టణ వరదలు అంటారు.
6. ప్రమాద కారణ వరదలు
అధిక పరిమాణంలో నీటిని సరఫరా చేసే గొట్టాలు పగిలిపోయినప్పుడు చుట్టు పక్కల ప్రాంతాలు నీటిలో మునిగిపోతాయి. ఇలా ఏర్పడే వరదలే 'ప్రమాద కారణంగా ఏర్పడిన వరదలు.
కొత్త సవాళ్లు
రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సొసైటీ
భారతదేశంలో వరదల ప్రభావం
- 1. గంగానదీ పరీవాహక ప్రాంతం
ఉపనదుల వల్ల గంగానదీ పరీవాహక ప్రాంతంలో ఉత్తర భాగం తీవ్ర వరదలకు గురవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ్ బంగ రాష్ట్రాల్లోని ఉత్తర భాగాలు ప్రతి సంవత్సరం వరదల వల్ల తీవ్రంగా నష్టపోతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో శారద, గాగ్రా నదులు వరదలకు కారణమవుతున్నాయి. బిహార్‌లో ఏటా కోసి, గండక్ నదుల వల్ల వరదలు సంభవిస్తున్నాయి. పశ్చిమ్ బంగలోని దామోదర్, అజయ్ నదుల చుట్టుపక్కల ప్రాంతాల్లో వరదలు వస్తున్నాయి.
2. బహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతం
బ్రహ్మపుత్ర, బరాక్ నదులు.. వాటి ఉపనదుల కారణంగా అసోం ఎక్కువగా వరదలకు గురవుతోంది. జల్దాకా, తీస్తా, తోర్సా నదుల వల్ల పశ్చిమ్‌బంగ ఉత్తర ప్రాంతం నీటి ముంపునకు గురవుతోంది.
3. వాయవ్య నదీ పరీవాహక ప్రాంతం
వాయవ్య భారతదేశంలో జీలం, చీనాబ్, రావి, సట్లెజ్, బియాస్, గగ్గర్ నదుల పరీవాహక ప్రాంతాలు జలసమాధి అవుతున్నాయి.
4. మధ్య, దక్కన్ భారతదేశం
గోదావరి, కృష్ణా, కావేరి, పెన్నా, తుంగభద్ర, నర్మదా తదితర నదులు.. మధ్య, దక్కన్ భారతదేశంలో ఏటా వరదలకు కారణమవుతున్నాయి. ఒడిశాలో మహానది, వైతరణి, బ్రాహ్మణి నదీపరీవాహక ప్రాంతాలు కూడా వరదల బీభత్సాన్ని ఎదుర్కొంటున్నాయి.
5. ముప్పు ముంగిట తెలుగు రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా నదులు ప్రధానంగా వరదలకు కారణమవుతున్నాయి. ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లో నాగావళి, వంశధార నదులు; దక్షిణ ఆంధ్రాలో పెన్నా నదీ ప్రాంతం వరదలకు కారణమవుతున్నాయి. 2009లో కృష్ణానదికి వచ్చిన వరదల వల్ల మహబూబ్‌నగర్, కర్నూలు, నల్గొండ, కృష్ణా, గుంటూరు జిల్లాలకు అపార నష్టం వాటిల్లింది. ముంబయి, కోల్‌కత లాంటి పెద్ద నగరాల్లోనూ మురుగునీటి వ్యవస్థ ప్రణాళికాయుతంగా లేదు. అధిక వర్షాలు వచ్చినప్పుడు నగరాలు నీట మునుగుతున్నాయి. 2005లో ముంబయిలో ఒకే రోజున 10 సెంటీ మీటర్ల వర్షం కారణంగా ఆ మహానగరాన్ని వరదలు ముంచెత్తాయి.
- » జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంచనా ప్రకారం భారతదేశ భూభాగంలో 12.8 శాతం (40 మిలియన్ల హెక్టార్లు) వరదలకు గురవుతోంది. ఇందులో అధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 21.9 శాతం, బిహార్‌లో 12.7 శాతం భూభాగంలో వరదలు సంభవిస్తున్నాయి.
» వరదల కారణంగా 1953-2009 మధ్య భారతదేశం ఏడాదికి సగటున రూ.1,650 కోట్లను నష్టపోయింది. ప్రతి సంవత్సరం సగటున 1,464 మంది చనిపోతుండగా, 86,288 పశువులు మృత్యువాత పడుతున్నాయి.
» మన దేశంలో వరద ఉద్ధృతిని తెలుసుకోవడానికి శాటిలైట్, రిమోట్ సెన్సింగ్ పరికరాలు లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.
» మన దేశంలో వరదల హెచ్చరికలను కేంద్ర జలసంఘం లేదా సాగునీరు, వరద నియంత్రణ శాఖ లేదా జలవనరుల శాఖ జారీ చేస్తాయి.
» సహజ వైపరీత్యమైన వరదలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధంగా ఉండాలి. అప్పుడే అవి విపత్తులుగా మారకుండా ఉంటాయి. తద్వారా విలువైన సంపదను కాపాడుకోవచ్చు.
మాదిరి ప్రశ్నలు
- 1. బిహార్‌లో ఎక్కువగా ఏ నదుల వల్ల వరదలు సంభవిస్తున్నాయి?
ఎ) సోన్, శారద బి) శారద, కోసి సి) కోసి, గండక్ డి) కోసి, శారద
జ: కోసి, గండక్
2. వరదలు ఏ రకమైన విపత్తు?
ఎ) భౌగోళిక బి) నీటి వాతావరణ సంబంధిత సి) ప్రమాద డి) రసాయన
జ: నీటి వాతావరణ సంబంధిత
3. వరదలు ఏ రకమైన వైపరీత్యం?
ఎ) సహజ విపత్తు బి) మానవకారక విపత్తు సి) సహజ, మానవకారక విపత్తు డి) ఏదీకాదు
జ: సహజ, మానవకారక విపత్తు
4. వరదల విపత్తును కింది ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది?
ఎ) జలవనరుల మంత్రిత్వశాఖ బి) నీటిపారుదల శాఖ సి) గ్రామీణాభివృద్ధి శాఖ డి) ఏదీకాదు
జ: జలవనరుల మంత్రిత్వశాఖ
5. 'జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది?
ఎ) ముంబయి బి) కోల్‌కత సి) దిల్లీ డి) బెంగళూరు
జ: కోల్‌కత
6. అంతర్జాతీయ వాతావరణ సంస్థ ఎక్కడ ఉంది?
ఎ) జెనీవా బి) మనీలా సి) వాషింగ్టన్ డి) టోక్యో
జ: జెనీవా
7. రెడ్‌క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ సొసైటీ ఎక్కడ ఉంది?
ఎ) వాషింగ్టన్ బి) మలేసియా సి) లండన్ డి) జెనీవా
జ: జెనీవా
8. ఎత్తయిన ప్రాంతంలో ఇల్లు నిర్మించుకోవడం ... ?
ఎ) వరద నివారణ చర్య బి) భూకంప నివారణ చర్య సి) కరవు నివారణ చర్య డి) ఏదీకాదు
జ: వరద నివారణ చర్య