భారత రాజ్యాంగం, భారత రాజకీయ వ్యవస్థ, పాలన, ప్రభుత్వ విధానం

 భారత రాజ్యాంగం, భారత రాజకీయ వ్యవస్థ, పాలన, ప్రభుత్వ విధానం


గవర్నర్

1. రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్‌గా నియమించవచ్చని ఏ రాజ్యాంగ సవరణ చట్టం తెలియజేస్తుంది?
జ: 7వ రాజ్యాంగ సవరణ చట్టం - 1956
2. గవర్నర్‌గా నియమితులవ్వాలంటే ఎన్నేళ్ల వయసు నిండి ఉండాలి?
జ: 35 
3. రాష్ట్ర గవర్నరును ఎవరు నియమిస్తారు?
జ: రాష్ట్రపతి 
4. రాష్ట్ర గవర్నరుతో ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు?
జ: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
5. గవర్నర్ ప్రస్తుత జీతం ఎంత?
జ: రూ.1,10,000
6. గవర్నర్ అధికార నివాసగృహం ఏది?
జ: రాజ్‌భవన్ 
7. రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌ను ఎవరు నియమిస్తారు?
జ: గవర్నర్ 
8. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా ఎవరు వ్యవహరిస్తారు?
జ: గవర్నర్
9. రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని గవర్నర్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నియమిస్తారు?
జ: 5 
10. రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా గవర్నర్ ఎవరిని నామినేట్ చేస్తారు?
జ: ఆంగ్లో ఇండియన్
11. రాష్ట్ర విధాన పరిషత్‌కు గవర్నర్ ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు?
జ: 1/6 వంతు 
12. రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరగనప్పుడు ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ ఆర్డినెన్సును జారీ చేస్తారు?
జ: 213
13. గవర్నర్‌ను అభిశంసించే అధికారం ఎవరికి ఉంది? 
జ: ఎవరు అభిశంసించలేరు
14. ఏ బిల్లులను గవర్నర్ అనుమతితో విధానసభలో ప్రవేశపెట్టాలి?
జ: ద్రవ్య లేదా ఆర్థిక 
15. సైనిక కోర్టు విధించిన శిక్షల్లో రాష్ట్ర గవర్నర్ ...
జ: జోక్యం చేసుకోకూడదు
16. రాష్ట్ర ఆగంతుక నిధి ఎవరి ఆధీనంలో ఉంటుంది?
జ: గవర్నర్ 

పద్మ పురస్కారాలు - 2018